CHINNA SESHA VAHANA OBSERVED _ చిన్న‌శేష వాహ‌నంపై శ్రీ మ‌ల‌య‌ప్ప‌స్వామి క‌టాక్షం

Tirumala, 8 February 2022: As a part of Saptha Vahana Seva, Sri Malayappa took celestial ride on Chinna Sesha Vahanam, the second one in the series in Kalyanotsava Mandapam in Tirumala temple on Tuesday morning.

According to Hindu puranas the Kundalini Shakti is said to be most powerful level of energy and is called Kaivalya Gnana.

This is the potent energy available to mankind by the grace of Sri Venkateswara and is represented by mighty snake. To make the human being aware about the importance of that Serpentine Kundalini energy, which enables human being to reach the 8.4 millionth manifestations, the last in the cosmic life cycle, Sri Malayappa took ride on the five-hooded Chinna Sesha Vahanam which is also believed to be the divine serpent Vasuki.

TTD top brass officials and some trust board members were present.

ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER TTDs, TIRUPATI

చిన్న‌శేష వాహ‌నంపై శ్రీ మ‌ల‌య‌ప్ప‌స్వామి క‌టాక్షం

తిరుమల, 2022 ఫిబ్ర‌వ‌రి 08: ర‌థ‌స‌ప్త‌మి ప‌ర్వ‌దినాన్ని పుర‌స్క‌రించుకుని మంగ‌ళ‌వారం ఉద‌యం 9 నుండి 10 గంట‌ల వ‌రకు శ్రీ‌వారి ఆల‌యంలోని క‌ల్యాణ మండ‌పంలో శ్రీ మలయప్పస్వామివారు ఐదు తలల చిన్నశేష వాహనంపై క‌టాక్షించారు.

చిన్న‌శేష వాహనం – కుటుంబ శ్రేయస్సు

పురాణ ప్రాశస్త్యం ప్రకారం చిన్నశేషుడిని వాసుకి(నాగ‌లోకానికి రాజు)గా భావిస్తారు. శ్రీ వైష్ణవ సంప్రదాయానుసారం భగవంతుడు శేషి, ప్రపంచం శేషభూతం. శేషవాహనం ఈ శేషిభావాన్ని సూచిస్తుంది. చిన్నశేష వాహనాన్ని దర్శిస్తే కుటుంబ శ్రేయ‌స్సుతోపాటు కుండలినీయోగ సిద్ధిఫలం లభిస్తుందని ప్రశస్తి.

టిటిడి ఈవో డాక్ట‌ర్ కె.ఎస్‌.జ‌వ‌హ‌ర్‌రెడ్డి దంప‌తులు, బోర్డు స‌భ్యులు శ్రీ కాట‌సాని రాంభూపాల్ రెడ్డి, శ్రీ విశ్వ‌నాథ్‌, శ్రీ మ‌ధుసూద‌న్ యాద‌వ్‌, శ్రీ మారుతి ప్ర‌సాద్, శ్రీ రాములు, అద‌న‌పు ఈవో శ్రీ ఎవి.ధ‌ర్మారెడ్డి దంప‌తులు,
సివిఎస్వో శ్రీ గోపినాథ్ జెట్టి దంప‌తులు, ఇత‌ర టీటీడీ అధికారులు ఈ వాహ‌న సేవ‌లో పాల్గొన్నారు.

తి.తి.దే ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.