CJI OFFERS PRAYERS IN TIRUCHANOOR TEMPLE _ తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారిని దర్శించుకున్న సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగోయ్
Tiruchanoor, 16 Nov. 19: The Honourable Chief Justice of India, Justice Ranjan Gogoi accompanied by his wife Smt Rupanjali Gogoi offered prayers in the temple of Sri Padmavathi Devi at Tiruchanoor on Saturday afternoon.
On his arrival at the entrance of the temple, he was offered Purnakumbha Swagatham by temple priests.
After darshanam of presiding deity, TTD JEO Sri P Basanth Kumar offered him with prasadam,
Temple Dy EO Smt Jhansi Rani and AEO Sri Subramanyam and others were present.
ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER, TTDs, TIRUPATI
తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారిని దర్శించుకున్న సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగోయ్
తిరుపతి, 2019 నవంబరు 16: తిరుచానూరులోని శ్రీపద్మావతి అమ్మవారిని శనివారం సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగోయ్ దర్శించుకున్నారు. ముందుగా ఆలయం వద్దకు చేరుకున్న జస్టిస్ రంజన్ గొగోయ్‌కు టిటిడి జెఈవో శ్రీ పి.బసంత్ కుమార్, అర్చకులు ఇస్తికఫాల్ స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు.
దర్శనానంతరం వేదపండితులు వేదాశీర్వచనం చేశారు. అమ్మవారి తీర్థప్రసాదాలు అందజేశారు.
ఈ కార్యక్రమంలో ఆలయ డెప్యూటీ ఈవో శ్రీమతి ఝాన్సీరాణి, ఏఈవో శ్రీ సుబ్రమణ్యం, సూపరిండెంట్ శ్రీ కుమార్, ఇతర అధికారులు పాల్గొన్నారు.
తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.