LAKSHA BILWARCHANA AT SRI KAPILESWARA SWAMY TEMPLE _ శ్రీ కపిలేశ్వరాలయంలో వైభవంగా లక్ష బిల్వార్చన
Tirupati, 16 Nov. 19: TTD conducted special rituals at Sri Kapileswara Swamy Temple as part of ongoing Laksha Bilwarchans seva and provided special darshan to devotees in the morning.
Later in the evening the utsava idols of Sri Kapileswara Swamy and Kamakshi Amma we’re taken out in in a grand procession in the temple town.
Similarly the Rudra homam was conducted at the temple on Saturday as part of homa Mahotsavam since a month in all TTD temples. Interested couple could participate iin the homam with a ticket of ₹500 and beget, one uttarium, one blouse, and Anna Prada dam besides blessings.
DyEO of TTD local temples Sri Subramanyam, superintendent Sri Reddy Sekhar, temple priests and devotees participated.
ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI
శ్రీ కపిలేశ్వరాలయంలో వైభవంగా లక్ష బిల్వార్చన
తిరుపతి, 2019 నవంబరు 16: తిరుపతిలోని శ్రీ కపిలేశ్వరస్వామివారి ఆలయంలో శనివారం ఉదయం లక్ష బిల్వార్చన సేవ వైభవంగా జరిగింది. ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు.
ఇందులోభాగంగా ఉదయం 3.00 గంటలకు సుప్రభాతంతో స్వామివారిని మేల్కొలిపి అభిషేకం, అలంకారం, అర్చన నిర్వహించారు. యాగశాల మండపంలో ఉదయం 6.00 నుంచి మధ్యాహ్నం 12.00 గంటల వరకు లక్ష బిల్వార్చన సేవ వైభవంగా జరిగింది. ఇందులో లక్ష బిల్వ పత్రాలతో స్వామివారిని అర్చించారు. ఈ సందర్భంగా ఉదయం 6 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, మధ్యాహ్నం 12 నుంచి 3 గంటల వరకు, సాయంత్రం 5.30 నుంచి రాత్రి 9 గంటల వరకు భక్తులకు సర్వదర్శనం కల్పించారు. అదేవిధంగా సాయంత్రం 6 నుంచి రాత్రి 8 గంటల వరకు శ్రీకపిలేశ్వరస్వామి, శ్రీకామాక్షి అమ్మవారి ఉత్సవమూర్తులను పురవీధుల్లో ఘనంగా ఊరేగించనున్నారు.
శ్రీ కపిలేశ్వరాలయంలో ఘనంగా రుద్రయాగం
శ్రీ కపిలేశ్వరస్వామివారి ఆలయంలో శ్రీ కపిలేశ్వరస్వామివారి హోమం (రుద్రయాగం) శనివారం ఘనంగా జరిగింది. కార్తీకమాసాన్ని పురస్కరించుకుని ఆలయంలో విశేషపూజ, హోమ మహోత్సవాలు నిర్వహిస్తున్న విషయం విదితమే.
ఇందులో భాగంగా శుక్రవారం ఉదయం రుద్రజపం, హోమం, నివేదన, లఘు పూర్ణాహుతి, దీపారాధన నిర్వహించారు. సాయంత్రం 6.00 గంటల నుండి జపం, హోమం, రుద్రత్రిశతి, బిల్వార్చన, విశేషదీపారాధన నిర్వహించనున్నారు. రుద్రయాగం వెయ్యి రుద్రాభిషేకాల ఫలాన్ని ఇస్తుందని, ఇందులో పాల్గొన్న వారికి మృత్యుగండం, బాలారిష్టాలు తొలగి ఆయురారోగ్యాలు సిద్ధిస్తాయని ఆలయ అర్చకులు తెలిపారు. గృహస్తులు రూ.500/- చెల్లించి ఒకరోజు హోమంలో పాల్గొనవచ్చు. గృహస్తులకు ఒక ఉత్తరీయం, ఒక రవికె, అన్నప్రసాదం బహుమానంగా అందజేస్తారు.
ఈ కార్యక్రమంలో టిటిడి స్థానిక ఆలయాల ఉపకార్యనిర్వహణాధికారి శ్రీ సుబ్రమణ్యం, సూపరింటెండెంట్ శ్రీ భూపతి, టెంపుల్ ఇన్‌స్పెక్టర్ శ్రీ రెడ్డిశేఖర్, ఆలయ అర్చకులు, విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.
టి.టి.డి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.