CM INAUGURATES ALIPIRI FOOTPATH _ పునర్నిర్మించిన‌ అలిపిరి నడకదారి పైకప్పును ప్రారంభించిన ముఖ్యమంత్రి

TIRUMALA, 11 OCTOBER 2021: The Honourable Chief Minister of Andhra Pradesh Sri YS Jagan Mohan Reddy on Monday inaugurated the renewed Alipiri footpath.

The Alipiri footpath shelters were constructed about 40 years ago, have become dilapidated. To provide hassle-free trekking to pedestrian pilgrims through this footpath route, TTD has decided to renovate the roof slabs.

At this juncture, Reliance Industries Limited has come forward to provide new shelters all along the footpath on a donation basis at a cost of Rs.25crore and completed the work within a year.

The reach from Alipiri to Galigopuram for 1100 m length, is provided with new galvalume roofing shelters while from Galigopuram to Tirumala (Up to GNC) for 3250 m length, is provided with new RCC sloped roofs.

MPs Sri Gurumurty, Sri Mithun Reddy, Sri V Prabhakar Reddy,Deputy CM Sri Narayana, Ministers Sri Srinivasa Rao, Srii P Ramachandra Reddy, Sri M Gautam Reddy, local MLA Sri Karunakar Reddy, TTD Chairman Sri YV Subba Reddy, Additional EO Sri AV Dharma Reddy, Reliance representatives Sri M Sachin, Sri AVSS Rao and others were also participated in this inaugural event.

ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

పునర్నిర్మించిన‌ అలిపిరి నడకదారి పైకప్పును ప్రారంభించిన ముఖ్యమంత్రి

తిరుప‌తి, 2021 అక్టోబ‌రు 11: తిరుప‌తిలోని అలిపిరి నుండి తిరుమ‌ల జిఎన్‌సి టోల్ గేట్ వ‌ర‌కు పున‌ర్నిర్మించిన న‌డ‌క‌మార్గం పైక‌ప్పును సోమ‌వారం ముఖ్యమంత్రివర్యులు గౌ|| శ్రీ వైఎస్‌.జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి ప్రారంభించారు. ముందుగా అలిపిరి పాదాల మండ‌పం వ‌ద్ద‌ గౌ|| ముఖ్య‌మంత్రికి టిటిడి ధర్మకర్తల మండలి అధ్యక్షులు శ్రీ వైవి.సుబ్బారెడ్డి, అద‌న‌పు ఈవో శ్రీ ఎవి.ధ‌ర్మారెడ్డి, జెఈవో శ్రీ‌మ‌తి స‌దా భార్గ‌వి క‌లిసి పుష్ప‌గుచ్ఛాలు అందించి స్వాగ‌తం ప‌లికారు.

అలిపిరి నుంచి తిరుమలకు నడచివెళ్లే మార్గంలో 40 సంవత్సరాల క్రితం పైకప్పు నిర్మించారు. ఈ పైకప్పు అక్కడక్కడా పాడై పునరుద్ధరణ అవసరమైంది. ఈ పరిస్థితుల్లో రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ లిమిటెడ్‌ సంస్థ రూ.25 కోట్ల విరాళంతో నడకమార్గంలో నూతనంగా పైకప్పు నిర్మించడానికి ముందుకొచ్చింది. అలిపిరి నుండి గాలిగోపురం వరకు 1100 మీటర్ల దూరం కొత్తగా గాల్‌వాల్యూమ్‌ రూఫింగ్‌ షెల్టర్లు నిర్మించారు. గాలిగోపురం నుంచి తిరుమల జిఎన్‌సి వరకు 3,250 మీటర్ల దూరం కొత్తగా ఆర్‌సిసి రూఫ్‌ షెడ్లు ఏర్పాటు చేశారు.

ఈ కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి శ్రీ నారాయణ స్వామి, ఉపసభాపతి శ్రీ కోన రఘుపతి, మంత్రులు శ్రీ వెల్లంపల్లి శ్రీనివాసరావు, శ్రీ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, శ్రీ మేకపాటి గౌతమ్ రెడ్డి, ఎంపీలు శ్రీ గురుమూర్తి, శ్రీ మిథున్ రెడ్డి, శ్రీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, తిరుపతి ఎమ్మెల్యే శ్రీ కరుణాకర్ రెడ్డి టీటీడీ చైర్మన్ వై వి సుబ్బారెడ్డి, బోర్డు సభ్యులు శ్రీ పోకల అశోక్ కుమార్, అదనపు ఈఓ ఏవి.ధర్మారెడ్డి, తిరుపతి కార్పొరేషన్ డెప్యూటీ మేయర్ శ్రీ భూమన అభినయ రెడ్డి, రిలయన్స్ సంస్థ ప్రతినిధులు శ్రీ ఎం.సచిన్, శ్రీ ఏవీఎస్ఎస్.రావు తదితరులు పాల్గొన్నారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.