AP CM PRESENTS SILK VASTRAMS ON THE AUSPICIOUS OCCASION OF GARUDA SEVA _ శ్రీవారికి పట్టువస్త్రాలు సమర్పించిన రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు గౌ|| శ్రీ వైఎస్‌.జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి

OFFERS PRAYERS IN TIRUMALA TEMPLE-TAKES PART IN GARUDA SEVA

 TIRUMALA, 11 OCTOBER 2021: The Honourable Chief Minister of Andhra Pradesh, Sri YS Jagan Mohan Reddy on Monday evening presented the silk vastrams on behalf of the State Government to TTD on the occasion of Garuda Seva day at Tirumala temple.

Earlier, the CM carried the vastrams over his head from Sri Bedi Anjaneya Swamy temple and reached Tirumala temple through Maha Dwaram in a celestial procession amidst the recitation of Veda Mantras and Mangala Vaidyam.

After darshan of Sri Venkateswara Swamy, he was rendered Vedaseervachanam at Ranganayakula Mandapam.

He was presented with Theertha Prasadams, a laminated photo of Srivaru made with dried flower petals, Coffee Table Book on TTD by TTD Chairman Sri YV Subba Reddy along with the TTD EO Dr KS Jawahar Reddy.

Later he also released the year 2022 Calendars and Diary.

TAKES PART IN GARUDA SEVA

The CM also took part in Garuda Vahana Seva at Kalyanotsava Mandapam.

MPs Sri Gurumurty, Sri Mithun Reddy, Sri V Prabhakar Reddy, Sri Reddeppa Reddy, Deputy Speaker Sri K Raghupati, Deputy CM Sri Narayana Swamy, ministers Sri P Ramachandra Reddy, Sri V Srinivasa Rao, Sri M Gautam Reddy, Kodali Venkateswara Rao,  MLAs Sri B Karunakar Reddy,

Sri Vallabhaneni Vamsi, Sri Madhusudhan Reddy, Board members Smt Prasanthi Reddy and others were also present.

Among others DIG Krantirana Tata, District Collector Sri Harinarayana, Additional EO Sri AV Dharma Reddy, CVSO Sri Gopinath Jatti, Urban SP Sri Venkatappala Naidu and other district administration authorities were also present.

ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

శ్రీవారికి పట్టువస్త్రాలు సమర్పించిన రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు గౌ|| శ్రీ వైఎస్‌.జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి

తిరుమల, 2021 అక్టోబ‌రు 11: శ్రీవారి బ్రహ్మోత్సవాల సంద‌ర్భంగా సోమ‌వారం రాత్రి రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు గౌ|| శ్రీ వైఎస్‌.జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి రాష్ట్ర ప్రభుత్వం తరఫున శ్రీవేంకటేశ్వరస్వామివారికి పట్టువస్రాలు సమర్పించారు.

ముందుగా గౌ|| ముఖ్యమంత్రివర్యులు శ్రీ బేడి ఆంజనేయస్వామివారి ఆలయం వద్దకు చేరుకున్నారు. వారికి ఆలయ అర్చకులు పరివట్టం కట్టారు. అక్కడినుంచి పట్టువస్త్రాలను తలపై ఉంచుకుని మంగళవాయిద్యాల నడుమ ఊరేగింపుగా శ్రీవారి ఆల‌యానికి చేరుకుని స్వామివారికి వస్త్రాలు సమర్పించారు. అంతకుముందు టిటిడి ధర్మకర్తల మండలి అధ్యక్షులు శ్రీ వైవి.సుబ్బారెడ్డి, కార్యనిర్వహణాధికారి డాక్ట‌ర్ కెఎస్‌.జ‌వ‌హ‌ర్‌రెడ్డి, అద‌న‌పు ఈవో శ్రీ ఎవి.ధ‌ర్మారెడ్డి కలిసి స్వాగతం పలికారు.

దర్శనానంతరం గౌ|| ముఖ్యమంత్రివర్యులకు రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశీర్వ‌చ‌నం చేశారు. శ్రీవారి తీర్థప్రసాదాలు, డ్రైఫ్లవర్ టెక్నాలజీతో చేసిన స్వామివారి చిత్రపటం, కాఫీ టేబుల్‌బుక్ అందజేశారు.

ఈ కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి శ్రీ నారాయణ స్వామి, ఉపసభాపతి శ్రీ కోన రఘుపతి, మంత్రులు శ్రీ వెల్లంపల్లి శ్రీనివాసరావు, శ్రీ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, శ్రీ మేకపాటి గౌతమ్ రెడ్డి, శ్రీ కన్నబాబు, శ్రీ కొడాలి నాని, శ్రీ అనిల్ కుమార్ యాదవ్, ఎంపీలు శ్రీ గురుమూర్తి, శ్రీ మిథున్ రెడ్డి, శ్రీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, శ్రీ మార్గాని భరత్, శ్రీ రెడ్డెప్పరెడ్డి, ఎమ్మెల్యేలు శ్రీ కరుణాకర్ రెడ్డి, శ్రీ రోజా, శ్రీ బియ్యపు మధుసూదన్ రెడ్డి, శ్రీ వెంకటే గౌడ, శ్రీ ఆదిమూలం, శ్రీ చింతల రామచంద్రారెడ్డి, శ్రీ ఆరణి శ్రీనివాసులు, శ్రీ మేడా మల్లికార్జున రెడ్డి, శ్రీ తిప్పేస్వామి, శ్రీ ఆర్.ప్రతాప్ కుమార్ రెడ్డి, చిత్తూరు జడ్ పి ఛైర్మన్ శ్రీ శ్రీనివాసులు, బోర్డు సభ్యులు శ్రీమతి ప్రశాంతి రెడ్డి, శ్రీ పోకల అశోక్ కుమార్, శ్రీ కాటసాని రాంభూపాల్ రెడ్డి, శ్రీ మధుసూదన్ యాదవ్, శ్రీ కె.సంజీవయ్య, దేవాదాయ శాఖ ముఖ్య కార్యదర్శి శ్రీమతి వాణీ మోహన్, జిల్లా కలెక్టర్ శ్రీ హరినారాయణన్, టిటిడి సివిఎస్వో శ్రీ గోపినాథ్ జెట్టి, అర్బన్ ఎస్పీ శ్రీ వెంకట అప్పలనాయుడు, తిరుపతి కార్పొరేషన్ డెప్యూటీ మేయర్ శ్రీ భూమన అభినయ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.