CM REVIEWS ON TTD DEVELOPMENT PROGRAMMES _ గౌ|| ముఖ్య‌మంత్రి స‌మ‌క్షంలో స‌హ‌జ వ్య‌వ‌సాయ ప‌ద్ధ‌తుల‌పై రైతు సాధికార సంస్థ‌తో ఒప్పందం చేసుకున్న టిటిడి

TIRUMALA, 12 OCTOBER 2021:  Honourable CM of AP Sri YS Jaganmohan Reddy reviewed on the various developmental activities recently taken up by TTD.

This meeting was held at Annamaiah Bhavan in Tirumala on Tuesday. TTD EO Dr KS Jawahar Reddy explained TTD’s activities in the protection and promotion of Desi Cows.

He briefed on Gosamrakshana at Palamaner Gosala, Gudiko Gomata, Govinduniki Go Adharita Naivedyam, Panchagavya products, Navaneeta Seva, Natural Farming, Dry Flower Technology etc.

Later a MoU between TTD and Rythu Sadhikara Samstha(RySS), Government of AP on Natural Farming.

CM appreciated the efforts of TTD and also the women who arr trained to prepare articles in Dry Flower Technology by YSR Horticulture University.

Dy CM Sri Narayana Swamy, Ministers P Sri Ramachandra Reddy, Sri V Srinivasa Rao, local MLA Sri Karunakar Reddy, TTD Chairman Sri YV Subba Reddy, District Collector Sri Harinarayana, Additional EO Sri AV Dharma Reddy, YSR Horticulture University Dr Janakiram were also present.

ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

గౌ|| ముఖ్య‌మంత్రి స‌మ‌క్షంలో స‌హ‌జ వ్య‌వ‌సాయ ప‌ద్ధ‌తుల‌పై రైతు సాధికార సంస్థ‌తో ఒప్పందం చేసుకున్న టిటిడి

టిటిడి చేప‌ట్టిన అభివృద్ధి కార్య‌క్ర‌మాల‌ను అభినందించిన గౌ|| రాష్ట్ర ముఖ్య మంత్రి

తిరుమల, 2021 అక్టోబ‌రు 12: తిరుమ‌ల అన్న‌మ‌య్య భ‌వ‌నంలో మంగ‌ళ‌వారం ఉద‌యం రాష్ట్ర ముఖ్య మంత్రి గౌ|| శ్రీ వై.ఎస్‌.జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి స‌మ‌క్షంలో జ‌రిగిన కార్య‌క్ర‌మంలో టిటిడి ఈవో డాక్ట‌ర్ కె.ఎస్‌.జ‌వ‌హ‌ర్‌రెడ్డి ప‌వ‌ర్ పాయింట్ ప్ర‌జెంటేష‌న్ ద్వారా టిటిడి ప్ర‌తిష్టాత్మ‌కంగా చేప‌ట్టిన ప‌లు అభివృద్ధి కార్య‌క్ర‌మాల‌ను గో సంర‌క్ష‌ణ‌కు టిటిడి ఏ విధంగా కృషి చేస్తోంది, ప‌ల‌మ‌నేరు వ‌ద్ద 400 ఎక‌రాల‌లో గో శాల అభివృద్ధిని గురించి తెలియ‌జేశారు. ఇందులో భాగంగా శ్రీ‌వారి గో ఆధారిత నైవేధ్యం, గుడికో గోమాత‌, అగ‌ర‌బ‌త్తుల త‌యారీ, పంచ‌గ‌వ్య ఉత్ప‌త్తులు, గో ఆధారిత వ్య‌వ‌సాయం త‌దిత‌ర వాటిపై ముఖ్యమంత్రికి వివ‌రించారు. వివ‌రించారు.

డాక్ట‌ర్ వైఎస్ఆర్ ఉద్యాన విశ్వ‌విద్యాల‌యం స‌హ‌కారంతో డ్రై ఫ్ల‌వ‌ర్ టెక్నాల‌జితో టిటిడిలోని వివిధ ఆలయాల్లో ఉప‌యోగించిన పూల‌తో స్వామి, అమ్మ‌వార్ల ఫోటోలు, క్యాలండర్లు, కీ చైన్లు, పేపర్ వెయిట్లు తదితరాలు త‌యారీ విధానాన్నిఈవో వివ‌రించారు. అనంత‌రం ఎస్వీబిసిలో ప్ర‌సారం అవుతున్న ఆధ్యాత్మిక, భ‌క్తి కార్య‌క్ర‌మాల వివ‌రాల‌ను అద‌న‌పు ఈవో మ‌రియు ఎస్వీబిసి ఎండి శ్రీ ఎవి.ధ‌ర్మారెడ్డి ముఖ్య‌మంత్రికి వివ‌రించారు. ఈ సంద‌ర్బంగా ముఖ్య‌మంత్రి టిటిడిని అభినందించారు.

రైతు సాధికార సంస్థ‌తో ఎంఓయు

స‌హ‌జ వ్య‌వ‌సాయ ప‌ద్ధ‌తుల‌పై ముఖ్య‌మంత్రి స‌మ‌క్షంలో ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌భుత్వ రైతు సాధికార సంస్థ ఎగ్జిక్యూటివ్ వైస్ ఛైర్మ‌న్ శ్రీ విజ‌య్‌కుమార్‌, టిటిడి ఈవో డాక్ట‌ర్ కె.ఎస్‌.జ‌వ‌హ‌ర్ రెడ్డిలు ఎంఓయు ప‌త్రాల‌ను మార్చుకున్నారు.

ఈ కార్య‌క్ర‌మానంత‌రం అన్న‌మ‌య్య భ‌వ‌నం అవ‌ర‌ణంలో నిత్య పుష్ప కైంక‌ర్య సేవ‌లో త‌రించిన పుష్పాల‌తో త‌యారు చేసిన దేవ‌తా క‌ళా కృతుల‌ను ముఖ్య‌మంత్రి ప‌రిశీలించి, ఈ క‌ళాకృతుల‌ను త‌యారుచేసిన మ‌హిళ‌ల‌ను అభినంధించారు.

ఈ కార్య‌క్ర‌మంలో గౌ.డిప్యూటీ ముఖ్య‌మంత్రి నారాయ‌ణ స్వామి, టిటిడి చైర్మన్ శ్రీ వైవి సుబ్బారెడ్డి, ఎంపీలు శ్రీ మిథున్ రెడ్డి, శ్రీ గురుమూర్తి, మంత్రులు శ్రీ పి. రామచంద్రారెడ్డి, శ్రీ వి.శ్రీనివాసరావు, ప్ర‌భుత్వ విప్ శ్రీ శ్రీ‌కాంత్ రెడ్డి, క‌లెక్ట‌ర్ శ్రీ ఎం.హ‌రినారాయ‌ణ‌, ఎమ్మెల్యేలు శ్రీ కరుణాకర్ రెడ్డి, శ్రీ కాట‌సాని రాంభూపాల్ రెడ్డి, శ్రీ మ‌ధుసూధ‌న్ రెడ్డి, శ్రీ ఆదిమూలం, బోర్డు స‌భ్యులు శ్రీ ఆశోక్ కుమార్‌, జెఈవోలు శ్రీ‌మ‌తి స‌దా భార్గ‌వి, శ్రీ వీర‌బ్ర‌హ్మం, సివిఎస్వో శ్రీ గోపినాథ్ జెట్టి, డాక్ట‌ర్ వైఎస్ఆర్ ఉద్యాన విశ్వ‌విద్యాల‌యం ఉప కుల‌ప‌తి డా.జాన‌కిరామ్‌ త‌దిత‌రులు పాల్గొన్నారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.