COMMENDABLE SERVICES BY SRIVARI SEVAKULU-ADDITIONAL EO _ శ్రీ‌వారి సేవ‌కుల సేవ‌లకు టిటిడి అద‌న‌పు ఈవో శ్రీ ఎ.వి.ధ‌ర్మారెడ్డి అభినంద‌న‌లు

Tirumala, 6 October 2019: The Srivari Seva volunteers have rendered commendable services to pilgrims even in inclement weather conditions on Garuda Seva Day,  said TTD Additional EO Sri AV Dharma Reddy. 

In a meeting organized at Asthana Mandapam,  the Additional EO complimented the 3500 odd Srivari Sevakulu for their impeccable services even in outside lines, Vaikuntham Queue Complex and other places.  He said he expects the same support from them even during Vaikuntha Ekadasi,  Radha Sapthami festivals etc. 

Earlier CVSO Sri Gopinath Jatti said, the Rs.98crore twin buildings of srivari Seva Sadan are a gift of Lord to the sincere services of volunteers.  He aspired them to continue their spirited services in the future too. 

Annaprasadam Special Officer Sri Venugopal, Catering officer  Sri Shastry, Health Officer Dr RR Reddy and others were also present. 

ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

 

 

శ్రీ‌వారి సేవ‌కుల సేవ‌లకు టిటిడి అద‌న‌పు ఈవో శ్రీ ఎ.వి.ధ‌ర్మారెడ్డి అభినంద‌న‌లు

తిరుమల, 2019 అక్టోబరు  06:   శ్రీ‌వారి వార్షిక‌  బ్రహ్మోత్సవాల‌లో భాగంగా శుక్ర‌వారం సాయంత్రం తిరుమ‌ల‌కు విచ్చేసిన ల‌క్ష‌లాది మంది భ‌క్తుల‌కు సేవ‌లందించి శ్రీవారి గరుడ వాహనసేవ విజయవంతమ‌య్యేందుకు కృషి చేసిన శ్రీ‌వారి సేవ‌కుల సేవ‌ల‌ను టిటిడి అద‌న‌పు ఈవో శ్రీ ఎ.వి.ధ‌ర్మారెడ్డి అభినందనలు తెలియజేశారు. తిరుమలలోని ఆస్థాన మండ‌పంలో ఆదివారం ఉద‌యం దాదాపు 3,500 మంది శ్రీ‌వారి సేవ‌కుల‌తో అద‌న‌పు ఈవో సమావేశం నిర్వహించారు.

ఈ సంద‌ర్భంగా అద‌న‌పు ఈవో మాట్లాడుతూ శ్రీ‌వారి సేవ‌కులు టిటిడి సిబ్బందితో స‌మ‌న్వ‌యం చేసుకుని గ‌రుడ‌సేవను విజ‌య‌వంతం చేశార‌ని తెలిపారు. నాలుగు మాడ వీధుల‌లోని గ్యాల‌రీల‌లో వేచివున్న భ‌క్తుల‌కు ఎలాంటి ఆసౌక‌ర్యం క‌లుగ‌కుండా నాణ్యమైన అన్నప్రసాదాలు, మంచినీరు, మ‌జ్జిగ‌ అందించార‌న్నారు. శ్రీవారి సేవకులు, స్కౌట్స్ అండ్ గైడ్స్‌ భక్తులకు విశేషసేవలు అందించారని కొనియాడారు. వాహనసేవను దర్శించుకున్న అనంతరం భక్తులు ఎలాంటి అసౌకర్యానికి గురికాకుండా నిర్దేశిత మార్గాల ద్వారా వెలుపలికి వెళ్లేందుకు భద్రతా సిబ్బంది, పోలీసులతో  శ్రీ‌వారి సేవ‌కులు సమన్వయంతో వ్యవహరించారని తెలిపారు. టిటిడిలోని అన్ని విభాగాల‌లో శ్రీ‌వారి సేవ‌కులు విశేష సేవ‌లు అందిస్తున్నార‌న్నారు.
 
 ఈ సమావేశంలో టిటిడి సివిఎస్‌వో శ్రీ గోపినాధ్ జెట్టి, అన్నప్రసాదం ప్రత్యేకాధికారి శ్రీ వేణుగోపాల్‌, క్యాట‌రింగ్ అధికారి శ్రీ శాస్త్రీ, ఇతర అధికారులు పాల్గొన్నారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.