BY THE OF 2020 SV MUSEUM TO ACHIEVE GLOBAL STANDARDS-CMO _ భక్తులను మరింత విశేషంగా ఆకట్టుకునేలా తిరుమల ఎస్వీ మ్యూజియం : టిటిడి మ్యూజియం అధికారి కల్నల్ చంద్రశేఖర్

Tirumala, 6 October 2019: The Chief Museum Officer Sri Col. Chandrasekhar Manda asserted that the Sri Venkateswara Museum at Tirumala will achieve global level standards before the end of 2020.

Briefing media persons on SV Museum development activities at Media Centre on Sunday,  he said,  the development of works are underway in Museum. “Very soon the devotees are going to experience the 3D technology of all the 16 sevas performed in Tirumala temple”,  he added.

He also said,  the SV Museum will have a “Techno Guide” with world-class standards to give a unique look and feel to pilgrims.

ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

భక్తులను మరింత విశేషంగా ఆకట్టుకునేలా తిరుమల ఎస్వీ మ్యూజియం  : టిటిడి మ్యూజియం అధికారి కల్నల్ చంద్రశేఖర్

 తిరుమల, అక్టోబర్ 06, 2019:   శ్రీవారి భక్తులను మరింత విశేషంగా ఆకట్టుకునేలా టిటిడి తిరుమల ఎస్వీ మ్యూజియంను తీర్చిదిద్దుతున్నామని టిటిడి మ్యూజియం అధికారి కల్నల్ చంద్రశేఖర్ తెలిపారు. తిరుమలలోని రాంభగీచా-2లో గల మీడియా సెంటర్‌లో ఆదివారం ఆయన మీడియా సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బ్రహ్మోత్సవాలలో భాగంగా మహాప్రదర్శనలో ఎస్వీ మ్యూజియం విభాగం నుండి త్రీడి ప్రొజెక్షన్ మ్యాపింగ్, సూక్ష్మకళా చిత్ర ప్రదర్శన, స్వామివారి వైభవాన్ని తెలియజేసేలా  సేవలు,  వివిధ రాజుల కాలంలో స్వామివారికి అందించిన నాణేలు తదితరాలను పొందుపరిచామన్నారు. భక్తుల నుండి విశేష స్పందన లభిస్తోందన్నారు.

అదేవిధంగా, టిటిడి ఈవో శ్రీ అనిల్ కుమార్ సింఘాల్, తిరుమల అదనపు ఈవో శ్రీ ఏవీ ధర్మారెడ్డి ఆదేశాల మేరకు తిరుమ‌ల‌కు విచ్చేసే భ‌క్తులకు ఆధ్యాత్మిక అనుభూతిని మ‌రింత పెంచేలా ఎస్వీ మ్యూజియంలో మాస్ట‌ర్‌ప్లాన్ అమ‌లు చేస్తున్నామ‌న్నారు.  శ్రీ‌వారి ఆల‌యాన్ని ప్ర‌త్య‌క్షంగా ద‌ర్శించిన అనుభూతి పొందేలా వ‌ర్చువ‌ల్ రియాలిటి 3డి ఆగుమెంటేష‌న్ టెక్నాల‌జీతో మ్యూజియంలోని గ్రౌండ్ ఫ్లోర్‌లో ఏర్పాటు చేసేందుకు చర్యలు చేపట్టామన్నారు. గొల్ల‌మండ‌పం, మ‌హ‌ద్వారం, తులాభారం, రంగ‌నాయ‌కుల మండ‌పం, ధ్వ‌జ‌స్తంభం, వెండివాకిలి, బంగారు వాకిలి, గ‌రుడాళ్వార్‌, గ‌ర్భాల‌యం, వ‌కుళామాత స‌న్నిధి, యాగ‌శాల‌, విమాన వేంక‌టేశ్వ‌ర‌స్వామి, స‌బేరా, భాష్య‌కార్లు, శ్రీ యోగ‌న‌ర‌సింహ‌స్వామి, శ్రీ వ‌ర‌ద‌రాజ‌స్వామి, పోటు, క‌ల్యాణ‌మండ‌పం త‌దిత‌ర ప్ర‌దేశాల‌ను వీక్షించేలా చర్యలు చేపట్టామన్నారు. శ్రీ‌వారి నిత్య కైంక‌ర్యాలు, వాహ‌న‌సేవ‌ల విశిష్ట‌త‌, తిరుమ‌ల‌లోని తీర్థాలు విశిష్ట‌త‌ను తెలుసుకునేలా ఏర్పాట్లు చేప‌ట్ట‌ామన్నారు.

మ్యూజియంలో గ్యాల‌రీల‌ను మ‌రింత ఆక‌ర్ష‌ణీయంగా తీర్చిదిద్దేందుకు లైటింగ్‌, ఇత‌ర సివిల్ ప‌నుల‌ను చేప‌ట్టేందుకు ప్ర‌ణాళిక‌లు రూపొందించామన్నారు. తిరుమల, తిరుపతిలలో ఉన్న టిటిడి ఎస్వీ మ్యూజియాలకు ఆధునిక సాంకేతికతను జోడించి ఏడాదిలోపు భక్తులకు అందుబాటులోకి తీసుకురానున్నట్లు తెలియజేశారు. 

ఈ స‌మావేశంలో టిటిడి ప్ర‌జాసంబంధాల అధికారి డా.టి.ర‌వి, స‌హాయ  ప్ర‌జాసంబంధాల అధికారి కుమారి పి.నీలిమ‌, ఇత‌ర అధికారులు పాల్గొన్నారు. 

తితిదే ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.