CORRUPTION STALLING OUR DEVELOPMENT – TTD CVSO_దేశాభివృద్ధికి అవినీతే అడ్డంకి_టీటీడీ సీవీఎస్వో శ్రీ గోపీనాథ్ జెట్టి

Tirupati, 27 October 2021: TTD Chief Vigilance & Security Officer Sri Gopinath Jatti said corruption in public life was the major handicap towards the development of society and appealed to every citizen to give his mite to eradicate corruption.

Earlier the CVSO flagged off a Walkathon rally from TTD Administrative Building to Alipiri toll gate as part of National Vigilance Week celebrations held under the directives of the Central Vigilance Commission from October 26 to November 01.

Speaking on the occasion at Alipiri toll gate the CVSO urged the devotees to approach the officials in case of corruption noticed at Darshan, accommodation, and Prasadam distribution and directed vigilance officials and staff to provide corruption-free services to devotees.

He served as a pledge of the fight against corruption to all TTD vigilance officers and staff. The National Vigilance Week celebrations would conclude on November 01 with the Jayanti fete of Sardar Vallabhai Patel.

ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI

దేశాభివృద్ధికి అవినీతే అడ్డంకి- టీటీడీ సీవీఎస్వో శ్రీ గోపీనాథ్ జెట్టి

తిరుపతి 27 అక్టోబరు 20 21 ; దేశం అన్ని రంగాల్లో సమగ్ర అభివృద్ధి సాధించడానికి ప్రభుత్వాలు చేస్తున్న కృషి కి అవినీతి అడ్డంకిగా మారిందని టిటిడి సివిఎస్వో శ్రీ గోపీనాథ్ జెట్టి అన్నారు. అవినీతిని నిర్మూలించడానికి ప్రతి ఒక్కరు వారి స్థాయిలో పనిచేయాలని ఆయన పిలుపునిచ్చారు.
సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ పిలుపుమేరకు మంగళవారం ప్రారంభమైన విజిలెన్స్ అవగాహన వారోత్సవాల్లో భాగంగా బుధవారం టిటిడి పరిపాలనా భవనం నుంచి అలిపిరి టోల్ గేట్ వరకు వాక థాన్ ర్యాలీ నిర్వహించారు.

శ్రీ గోపీనాథ్ జెట్టి జెండా ఊపి ర్యాలీని ప్రారంభించారు. అనంతరం అలిపిరి టోల్ గేట్ వద్ద జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. టిటిడి లో భక్తులకు దర్శనం, వసతి, ప్రసాదాల పంపిణీ విషయాల్లో ఎక్కడైనా అవినీతి జరిగితే భక్తులు అధికారులకు తెలియజేయాలన్నారు. భక్తులకు అవినీతి రహిత సేవలు అందేలా విజిలెన్స్ అధికారులు, సిబ్బంది పని చేయాలన్నారు. నవంబర్ ఒకటవ తేదీ స్వర్గీయ సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి సందర్భంగా ఈ వారోత్సవాలు ముగుస్తాయని ఆయన తెలిపారు. విజిలెన్స్ అధికారులు, సిబ్బంది చేత అవినీతి వ్యతిరేక ప్రతిజ్ఞ చేయించారు.

అదనపు సివిఎస్వో శ్రీ శివ కుమార్ రెడ్డి, విజీవోలు శ్రీ బాలి రెడ్డి, శ్రీ మనోహర్, ఏవిఎస్వో లు శ్రీ సాయి గిరిధర్, శ్రీమతి కళావతి పాల్గొన్నారు.


టిటిడి ప్రజా సంబంధాల అధికారి చే విడుదల చేయడమైనది