COTTAGE ALLOTMENT TO SELF DONORS ONLY DURING SRIVARI BRAHMOTSAVAMS _ శ్రీవారి బ్రహ్మోత్సవాల రోజుల్లో స్వయంగా వచ్చే కాటేజి దాతలకు గదుల కేటాయింపు

NO ALLOTMENT ON RECOMMENDATION LETTERS

Tirumala, 08 September 2023: TTD has reiterated that due to anticipated huge crowds for Srivari twin Brahmotsavams this year, rooms and cottages will be allocated to self-donors and not on their recommendation letters.

In view of Twin Brahmotsavams this year beginning from September 18-26 and  October 15-23 TTD has appealed to all donors to book their room/ cottage requirements in advance on  TTD website tirupatibalaji.ap.gov.in 

There would be no special allocation to donors from September 20-22 in view of Garuda Seva on September 22. Similarly during Navaratri Brahmotsavam, there will be no privileged allotments to donors from October 17-19 in view of Garuda Seva on October 19.

TTD also clarified that devotees who donated more than two rooms in a cottage would be allocated two rooms for two days on self-visit. Similarly for donors of only one room in a cottage, the allocation during Brahmotsavam will be just one room for two days on self-visits.

ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI

శ్రీవారి బ్రహ్మోత్సవాల రోజుల్లో స్వయంగా వచ్చే కాటేజి దాతలకు గదుల కేటాయింపు

తిరుమల, 2023 సెప్టెంబ‌రు 08: శ్రీవారి సాలకట్ల, నవరాత్రి బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని ఆయా రోజుల్లో స్వయంగా వచ్చే కాటేజి దాతలకు మాత్రమే గదులు కేటాయించడం జరుగుతుంది. దాత‌ల సిఫార్సుపై ఇత‌రుల‌కు గ‌దుల కేటాయింపు ఉండ‌దు. తిరుమలలో సెప్టెంబరు 18 నుండి 26వ తేదీ వరకు శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు, అక్టోబరు 15 నుండి 23వ తేదీ వరకు నవరాత్రి బ్రహ్మోత్సవాలు జరుగనున్నాయి. దాతలు tirupatibalaji.ap.gov.in వెబ్‌సైట్‌ ద్వారా గదులను రిజర్వు చేసుకోవాల్సి ఉంటుంది.

సెప్టెంబరు 18 నుండి 26వ తేదీ వరకు జరుగనున్న శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో సెప్టెంబరు 22న గరుడసేవ సందర్భంగా భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని సెప్టెంబరు 20 నుండి 22వ తేదీ వరకు కాటేజి దాతలకు ఎలాంటి గదుల కేటాయింపు ఉండదు.

అదేవిధంగా, అక్టోబరు 15 నుండి 23వ తేదీ వరకు జరుగనున్న నవరాత్రి బ్రహ్మోత్సవాల్లో అక్టోబరు 19న గరుడసేవ సందర్భంగా అక్టోబరు 17 నుండి 19వ తేదీ వరకు కాటేజి దాతలకు ఎలాంటి గదుల కేటాయింపు ఉండదు.

ఒకే కాటేజిలో రెండు గదుల కంటే ఎక్కువగా విరాళం ఇచ్చిన దాతలు స్వ‌యంగా వ‌స్తే రెండు గదులను రెండు రోజుల పాటు కేటాయిస్తారు. ఒకే కాటేజిలో ఒక గదిని విరాళంగా ఇచ్చిన దాతలు స్వ‌యంగా వ‌స్తే ఒక గదిని రెండు రోజులపాటు కేటాయించడం జరుగుతుంది. ఈ విషయాన్ని కాటేజి దాతలు గమనించాలని టీటీడీ కోరుతోంది.

టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.