TTD CHAIRMAN AND THE EO TAKES PART IN SKVST RITUAL _ సమృద్ధిగా వర్షాలు కురవాలని శ్రీనివాస మహాశాంతి వరుణయాగం- టీటీడీ ఛైర్మన్ శ్రీ భూమన కరుణాకరరెడ్డి

TIRUPATI, 09 SEPTEMBER 2023: Acharya Rutvik Varunam was performed on Friday morning as part of the Sri Srinivasa Ashtottara Satha Kundatmaka Maha Shanti Varuna Yagam initiated at Sri Kalyana Venkateswara Swamy Temple, Srinivasa Mangapuram.

TTD Chairman Sri Bhumana Karunakara Reddy and EO Sri AV Dharma Reddy participated in the ritual. Later they presented vastrams to Ritwiks on the occasion. The Ankurarpanam will be performed in the evening.

Later the TTD Chairman speaking to media persons said “With the divine blessings of Sri Venkateswara Swamy, TTD has decided to organize this unique Srinivasa Ashtottara Sata Kundatmaka Maha Shanti Varuna Yagam with the good will to bring abundant rains in the country and the state for the well-being of the people. 

He said that the yagam is being performed here from today till September 11.  He said that due to the Varuna yagam held on the hill last month, there was abundant rainfall. In the wake of the warnings of meteorologists that there will be less rainfall this year and next year as well this Yagam has been organised.

He stated that 60 priests from three states, more than 30 Vedic scholars and over 215 Rutviks are conducting this Homa.

He said soon TTD will be giving hand sticks to the devotees on the Srivari Mettu path near Chandragiri route also.

JEO Sri Veerabraham, Spl Gr DyEO Smt Varalakshmi participated in this program.

ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI

సమృద్ధిగా వర్షాలు కురవాలని శ్రీనివాస మహాశాంతి వరుణయాగం- టీటీడీ ఛైర్మన్ శ్రీ భూమన కరుణాకరరెడ్డి

తిరుప‌తి, 2023 సెప్టెంబ‌రు 08: దేవదేవుడైన శ్రీ వేంకటేశ్వర స్వామివారి దివ్యాశీస్సులతో దేశంలోనూ, రాష్ట్రంలోనూ సమృద్ధిగా వర్షాలు కురవాలని, ప్రజలందరికీ మంచి జరగాల‌నే సత్సంకల్పంతో శ్రీనివాస అష్టోత్తర శతకుండాత్మక మహాశాంతి వరుణయాగం తలపెట్టామ‌ని టీటీడీ ధ‌ర్మ‌క‌ర్త‌ల మండ‌లి అధ్య‌క్షులు శ్రీ భూమన కరుణాకరరెడ్డి తెలిపారు. శ్రీనివాసమంగాపురంలోని శ్రీ కల్యాణ వేంకటేశ్వర స్వామివారి ఆలయం వద్ద మహాశాంతి వరుణయాగంలో భాగంగా శుక్రవారం ఉదయం ఆచార్య రుత్విక్ వరణం జరిగింది. ఈ సంద‌ర్భంగా టీటీడీ ఛైర్మన్, ఈవో శ్రీ ఏవి.ధర్మారెడ్డి క‌లిసి అర్చకులకు పసుపు వస్త్రాలను బహూకరించారు.

ఈ సంద‌ర్భంగా ఛైర్మ‌న్ మీడియాతో మాట్లాడుతూ ఈరోజు నుంచి సాయంత్రం అంకురార్ప‌ణ నిర్వ‌హించి ఈ నెల 11వ తేదీ వరకు ఇక్కడ యాగం నిర్వహిస్తామ‌ని చెప్పారు. నెల క్రితం తిరుమ‌ల ధ‌ర్మ‌గిరిలో నిర్వహించిన వరుణయాగం వల్ల వర్షాలు బాగా కురిశాయ‌న్నారు. ఈ సంవత్సరంతో పాటు, వచ్చే సంవత్సరం కూడా తక్కువ వర్షపాతం నమోదవుతుందన్న వాతావరణ నిపుణుల సూచ‌న‌ల నేపథ్యంలో ప్రజల క్షేమం కోసం, వారికి సౌభాగ్యం క‌ల‌గాల‌ని కోరుకుంటూ టీటీడీ ఈ యాగాన్ని నిర్వహిస్తోందని వివరించారు. ఈ యాగం ఎంతో కష్టసాధ్యమైందని, ఎంతో ప్రాముఖ్యమైందని చెప్పారు. గతంలో ఎన్నడూ ఈ త‌రహాలో యాగం జరగలేదని తెలిపారు. మూడు రాష్ట్రాల నుంచి అర్చకులు, దాదాపు 60 మందికి పైగా వైఖానస ప్రముఖులు, 30 మందికి పైగా వేద పండితులు, 215 మందికి పైగా రుత్వికులు ఈ హోమాన్ని నిర్వహిస్తున్నారని వివ‌రించారు. ఈ యాగం వల్ల పరిపూర్ణంగా వర్షాలు కురుస్తాయన్న నమ్మకం ఉందన్నారు. అలిపిరి నడకదారిన వెళ్లే భక్తులకు కర్రలు ఇచ్చే కార్యక్రమాన్ని ప్రారంభినట్టే, త్వరలో చంద్రగిరి సమీపంలోని శ్రీవారిమెట్టు మార్గంలో భక్తులకు చేతికర్రలు ఇస్తామ‌ని తెలిపారు.

ఈ కార్యక్రమంలో జేఈవో శ్రీ వీరబ్రహ్మం, ఆల‌య ప్ర‌త్యేక‌శ్రేణి డెప్యూటీ ఈవో శ్రీ‌మ‌తి వరలక్ష్మి, ఏఈవో శ్రీ గోపినాథ్ త‌దిత‌రులు పాల్గొన్నారు.

టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.