COWS BY TTD IS A BOON TO ORGANIC FARMERS – MINISTER _ సేంద్రియ రైతులు గోవిందుని వరప్రసాదంగా గోవులను స్వీకరించాలి

TIRUPATI, 05 JUNE 2022:  The organic farmers should consider the cows donated by TTD to them as a gift of Blessing from Sri Venkateswara Himself, said AP Minister Sri P Ramachandra Reddy.

 

The minister who took part in the donation fete to 20 organic farmers at Punganuru on Sunday said, the innovative program mulled by TTD aims at developing organic farming technique. He said TTD is also giving training to farmers on the same with two from each district. ”Govinduniki Go Adharita Naivedyam” by TTD has earned kudos from all corners of the country.

       

Speaking on the occasion, TTD Board member Sri Pokala Ashok Kumar said, so far TTD has donated 955 cows and 750 oxen to the organic farmers to encourage natural farming. TTD is currently procuring seven tonnes of groceries in a year from natural farmers who produced from Desi cow based organic farming.

       

The Collector of Chittoor Sri Harinarayana said organic farming is the best technique to produce healthy products. 

 

TTD run SV Gosala Director Dr Harnath Reddy said, apart from encouraging farmers on organic training techniques, TTD is also giving awareness to young farmers on Panchagavya Products uses, production and sales.

 

MP Sri Reddeppa, RySS District Project Manager Sri Vadu, Agriculture Joint Director Sri Muralikrishna were also present. 

 

ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

సేంద్రియ రైతులు గోవిందుని వరప్రసాదంగా గోవులను స్వీకరించాలి

– రాష్ట్ర మంత్రివర్యులు శ్రీ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి

– పుంగనూరులో 20 మందికి పంపిణీ

తిరుపతి, 2022 జూన్ 05: తిరుమల తిరుపతి దేవస్థానం అందిస్తున్న గోవులను గోవిందుని వరప్రసాదంగా భావించి సేంద్రియ రైతులు స్వీకరించాలని, గో ఆధారిత వ్యవసాయం చేసి పోషక విలువలతో కూడిన ఆహార ఉత్పత్తులు పండించాలని రాష్ట్ర మంత్రివర్యులు శ్రీ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పిలుపునిచ్చారు. టిటిడి, రాష్ట్ర రైతు సాధికార సంస్థ కలిసి ఎంపిక చేసిన 20 మంది సేంద్రియ వ్యవసాయ రైతులకు ఆదివారం పుంగనూరులో మంత్రివర్యుల చేతులమీదుగా ఉచితంగా గోవులను పంపిణీ చేశారు.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన మంత్రివర్యులు శ్రీ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మాట్లాడుతూ పుంగ‌నూరు ప్రాంత రైతుల‌కు ఆవులను ఉచితంగా అందిస్తున్నామని, రైతులు వీటిని చ‌క్క‌గా పోషించుకుని వ్య‌వ‌సాయ అవ‌స‌రాల‌కు ఉప‌యోగించుకోవాల‌ని కోరారు. దేశీయ గోజాతుల సంర‌క్ష‌ణ‌, గో ఆధారిత వ్య‌వ‌సాయంపై రైతుల‌కు అవ‌గాహ‌న క‌ల్పించ‌డమే ల‌క్ష్యంగా ” గోశాల నిర్వ‌హ‌ణ-గో ర‌క్ష‌ణ‌-గో ఆధారిత వ్య‌వ‌సాయం-పంచ‌గ‌వ్య ఉత్ప‌త్తుల ”  పై రాష్ట్రంలోని ప్ర‌తి జిల్లా నుండి రెండు గోశాలల ప్ర‌తినిధులకు టిటిడి శిక్ష‌ణ ఇచ్చి ఆద‌ర్శ గో శాల‌లుగా రూపొందించ‌డం జ‌రుగుతోందన్నారు.

టిటిడి ధర్మకర్తల మండలి సభ్యులు శ్రీ పోకల అశోక్ కుమార్ మాట్లాడుతూ గో ఆధారిత వ్యవసాయాన్ని ప్రోత్సహించడం కోసం రైతు సాధికార సంస్థ , ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో చేసుకున్న ఒప్పందం మేరకు రాయ‌ల‌సీమ, నెల్లూరు, ప్ర‌కాశం జిల్లాల‌తో పాటు తెలంగాణ‌లోని నాగ‌ర్‌క‌ర్నూల్ జిల్లాలోని గో ఆధారిత వ్య‌వ‌సాయం చేస్తున్న రైతుల‌కు పాలివ్వని 955 ఆవులు, 750 ఎద్దులను ఉచితంగా ఇవ్వ‌డం జ‌రిగిందన్నారు. గో ఆధారిత ప్రకృతి వ్యవసాయం చేస్తున్న రైతుల నుంచి ఏడాదికి 7 వేల టన్నుల సెనగలతో పాటు బియ్యం, బెల్లం త‌దిత‌ర ఉత్ప‌త్తులు సేకరిస్తున్నామని తెలిపారు

చిత్తూరు జిల్లా కలెక్టర్ శ్రీ హరినారాయణ మాట్లాడుతూ ప్రభుత్వ, టిటిడి భాగస్వామ్యంతో అందిస్తున్న గోవులను సేంద్రియ వ్యవసాయం చేస్తున్న రైతులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఎరువులు, పురుగుమందులతో వ్యవసాయ భూమి జీవం కోల్పోయిందని, గో ఆధారిత వ్యవసాయం ద్వారా మళ్లీ జీవం పోయాలని అన్నారు.

టిటిడి ఎస్వీ గోశాల డైరెక్టర్ డాక్టర్ హరనాథ్ రెడ్డి మాట్లాడుతూ ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశాన్ని వివరించారు. వట్టిపోయిన దేశవాళీ పశువులను వ్యవసాయానికి అనుబంధంగా వినియోగించుకోవాలని తద్వారా భూసారం పెరుగుతుందని విలువైన పోషకాలతో కూడిన ఆహార ఉత్పత్తుల పండుతాయని తెలిపారు. తద్వారా గో సంరక్షణ కూడా సాధ్యమవుతుందన్నారు. ప్రకృతి వ్యవసాయంతో పండించిన పంటలు, పంచ‌గ‌వ్య ఉత్ప‌త్తుల త‌యారీ, మార్కెటింగ్ చేసుకునేందుకు రైతులకు , గ్రామీణ ప్రాంత యువతకు అవ‌గాహ‌న క‌ల్పిస్తున్నామన్నారు.

ఈ కార్యక్రమంలో పార్లమెంటు సభ్యులు శ్రీ ఎన్.రెడ్డెప్ప, రైతు సాధికార సంస్థ జిల్లా ప్రాజెక్టు మేనేజర్ శ్రీ జి.వాసు, వ్యవసాయ శాఖ జాయింట్ డైరెక్టర్ శ్రీ మురళీకృష్ణ తదితరులు పాల్గొన్నారు.

టిటిడి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.