PANCHAGAVYADHISVASAM FETE HELD IN SRI VENKATESWARA TEMPLE AT AMARAVATI _ అమ‌రావ‌తిలో శాస్త్రోక్తంగా పంచగవ్యాధివాసం

Tirupati, 05 June 2022: As part of Maha Samprokshanam festivities of the newly constructed Sri temple of Venkateswara at Amaravati, the Agamic ritual of Panchagavyadhivasam was performed in a religious manner on Sunday.

 

In connection with this fete, the traditional rituals of Punyahavachanam, Raksha bandhanam, Akalmasha Homam and Akshi Mochanam was performed.

 

Thereafter the Abhishekam to Vigraha was performed with milk, curd, ghee, cow dung, urine was observed followed by Agni Pratista, Kalasha Sthapana in the evening. Later Kumbha Aradhana and Ukta Homa were conducted.

 

Chief Archaka of Srivari temple Sri Venugopala Dikshitulu, Vaikhanasa Agama Advisor Dr Vedantam  Vishnu Bhattacharyulu, DyEO Sri Gunabhushana Reddy, Chief of Dharmic Projects of TTD Sri Vijayasaradhi, AEO Sri Doraiswamy Naik were also present.

 

ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

అమ‌రావ‌తిలో శాస్త్రోక్తంగా పంచగవ్యాధివాసం

తిరుపతి, 2022 జూన్ 05: అమ‌రావ‌తిలో టిటిడి నిర్మించిన శ్రీ వేంక‌టేశ్వ‌ర‌స్వామివారి ఆల‌య మ‌హాసంప్రోక్ష‌ణ కార్య‌క్ర‌మాల్లో మొదటి రోజు ఆదివారం శాస్త్రోక్తంగా పంచగవ్యాధివాసం నిర్వ‌హించారు.

ఇందులో భాగంగా ఉదయం పుణ్యాహ‌వ‌చ‌నం, ర‌క్షాబంధ‌నం, అక‌ల్మ‌ష‌ హోమం, అక్షిమోచ‌నం చేపట్టారు. అనంతరం పంచగవ్యాలైన గోక్షీరం(పాలు), గోదధి(పెరుగు), నెయ్యి, గోమయం, పంచితంతో శిలావిగ్రహాన్ని శుద్ధి చేశారు. సాయంత్రం అగ్నిప్ర‌తిష్ట‌, క‌ల‌శ‌స్థాప‌న‌ చేస్తారు. కుంభావాహ‌నంలో భాగంగా స్వామివారి శక్తిని కుంభాల్లోకి ప్రవేశింపచేసి కుంభారాధ‌న‌ నిర్వహిస్తారు. ఆ తరువాత ఉక్త హోమాలు చేపడతారు.

ఈ కార్య‌క్ర‌మంలో తిరుమల శ్రీవారి ఆలయ ప్రధానార్చకుల్లో ఒకరైన శ్రీ వేణుగోపాలదీక్షితులు, వైఖాన‌స ఆగ‌మ స‌ల‌హాదారు శ్రీ వేదాంతం విష్ణుభ‌ట్టాచార్యులు, డెప్యూటీ ఈవో శ్రీ గుణ‌భూష‌ణ్‌రెడ్డి, ధార్మిక ప్రాజెక్టుల అధికారి శ్రీ విజ‌య‌సార‌థి, ఎఈవో శ్రీ దొరస్వామి నాయక్ త‌దిత‌రులు పాల్గొన్నారు.

టిటిడి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.