CULTURAL PROGRAMMES AS PART OF SRI VARI ANNUAL BRAHMOTSAVAMS CONCLUDED IN TIRUMALA _ ముగిసిన బ్రహ్మోత్సవ ధార్మిక, సంగీత కార్యక్రమాలు
Tirumala, 15 Oct. 21: The elixir of dharmic and cultural programs organised by the TTD at Nada Niranjanam platform and Vasantha Mandapam as part of the ongoing Srivari annual Brahmotsavam concluded on Friday.
Following are details of devotee friendly programs held on Friday.
AT NADA NEERAJANAM PLATFORM
* Sri Vishnu Sahasranama Stotra parayanams
The Soundarya Lahiri Mahila Samakhya of Tirupati performed the Sri Vishnu Sahasranama Stotra parayanams in the morning between 09.00-09.45 hours.
DHARMIC DISCOURSES
Sri P V SS Maruti, Veda pundit at Dharmagiri Veda vijnan peetham spoke on “Bhakti-Reva- Gariyasi”.
HARIKATHA
Sri Chandrasekhar Bhagavatar team of TTD Annamacharya project presented Harikatha parayanams from 2.00-3.150 pm.
ANNAMAIAH SANKEERTAN LAHIRI
Sri Uday Bhaskar team of Tirupati rendered melodic Annamaiah sankeetans from 3.30-4.30 pm.
AT VASANTHA MANDAPAM
The Annamacharya project director Dr Akella Vibhishana Sharma lectured on Venkatachala Mahatyam
As a final act 12 TTD Vedic pundits prompted devotees to perform parayanams of some shlokas of Venkatachala Mahatyam.
ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI
2021 శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు
ముగిసిన బ్రహ్మోత్సవ ధార్మిక, సంగీత కార్యక్రమాలు
తిరుమల, 2021 అక్టోబరు 15: శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల సందర్భంగా టిటిడి హిందూ ధార్మిక ప్రాజెక్టుల ఆధ్వర్యంలో తిరుమల నాదనీరాజనం వేదికపై జరుగుతున్న ధార్మిక, సంగీత కార్యక్రమాలు శుక్రవారం ముగిశాయి. బ్రహ్మోత్సవాల చివరిరోజు జరిగిన కార్యక్రమాల వివరాలు ఇలా ఉన్నాయి.
శ్రీ విష్ణుసహస్రనామ స్తోత్ర పారాయణం
తిరుపతికి చెందిన సౌందర్యలహరి మహిళా సమాఖ్య సభ్యులు ఉదయం 9 నుండి 9.45 గంటల వరకు శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణం చేశారు.
ఆధ్యాత్మిక ప్రవచనం
తిరుమల ధర్మగిరి వేద విజ్ఞానపీఠం శాస్త్ర పండితులు శ్రీ పివిఎస్ఎస్.మారుతి ఉదయం 10 నుండి 11.30 గంటల వరకు ” భక్తిరేవ గరీయసి ” అనే అంశంపై ఉపన్యసించారు.
హరికథ
టిటిడి అన్నమాచార్య ప్రాజెక్టు కళాకారుడు శ్రీ చంద్రశేఖర భాగవతార్ బృందం మధ్యాహ్నం 2 నుండి 3.15 గంటల వరకు హరికథ పారాయణం చేశారు.
అన్నమయ్య సంకీర్తన లహరి
తిరుపతికి చెందిన శ్రీ కె.ఉదయభాస్కర్ బృందం మధ్యాహ్నం 3.30 నుండి సాయంత్రం 4.30 గంటల వరకు అన్నమయ్య సంకీర్తన లహరి పేరిట పలు అన్నమయ్య సంకీర్తనలను వీనులవిందుగా ఆలపించారు.
వసంత మండపంలో ….
వసంత మండపంలో నిర్వహిస్తున్న వేంకటాచల మహత్యం, వాహనసేవల వైశిష్ట్యంపై ఉపన్యాస కార్యక్రమం శుక్రవారం ముగిసింది.
ఇందులో భాగంగా అన్నమాచార్య ప్రాజెక్టు సంచాలకులు డా. ఆకెళ్ల విభీషణశర్మ వేంకటాచల మహత్యంపై ఉపన్యసించారు. చివరగా వేంకటాచల మహత్యంలోని స్తోత్రాలను 12 మంది టిటిడి వేదపండితులు భక్తులచే పారాయణం చేయించారు.
తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.
|
|