SHAMI PUJA PERFORMED AT SV VEDIC UNIVERSITY _ ఎస్వీ వేద వర్సిటీలో శాస్త్రోక్తంగా శమీ పూజ
Tirupati, 15 Oct. 21:As part of Dasara celebrations TTD organised Shami puja (Ayudha puja) at the SV Vedic University on Friday evening.
In this connection, the utsava idols of Sri Malayappa and his consorts were seated at the Shami tree at the Maha Vishnu yagashala of the university and special pujas were performed.
Sri P Narayana Charyulu narrated the significance of Shami puja ahead of conducting Sankalp Vishwakarma puja Punya Havachanam and Shami puja, Shami Shlokas and Mangala Harati.
ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI
ఎస్వీ వేద వర్సిటీలో శాస్త్రోక్తంగా శమీ పూజ
తిరుపతి, 2021 అక్టోబరు 15: దసరా పర్వదినాన్ని పురస్కరించుకుని తిరుపతిలోని శ్రీ వేంకటేశ్వర వేద విశ్వవిద్యాలయంలో శుక్రవారం శమీపూజ(ఆయుధపూజ) శాస్త్రోక్తంగా జరిగింది. ఈ సందర్భంగా మహావిష్ణు యాగశాలలో శమీ వృక్షాన్ని ఏర్పాటు చేసి శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ మలయప్పస్వామివారి ఉత్సవర్లను వేంచేపు చేసి ప్రత్యేక పూజలు చేశారు.
ఈ సందర్భంగా శమీ పూజ వైశిష్ట్యాన్ని శ్రీ పరాశరం భావ నారాయణాచార్యులు తెలియజేశారు. అనంతరం సంకల్పం, విష్వక్సేనపూజ, పుణ్యాహవచనం, శమీపూజ చేశారు. శమీ స్తోత్రం పఠించారు. మంగళహారతితో ఈ కార్యక్రమం ముగిసింది.
తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.