AP HIGH COURT CJ OFFERS PRAYERS AT SRIVARI TEMPLE _ శ్రీవారి సేవలో రాష్ట్ర హైకోర్టు ప్ర‌ధాన న్యాయ‌మూర్తి శ్రీ ప్ర‌శాంత్ కుమార్ మిశ్రా

Tirumala, 15 Oct. 21:  Chief Justice of Andhra Pradesh High court Justice Sri Prashant Kumar Mishra along with family members offered prayers at Srivari temple on Friday morning.

 

He was received at the Mahadwaram by TTD EO Dr KS Jawahar Reddy and Additional EO Sri AV Dharma Reddy. Later the Chief Justice was offered traditional Istikaphal honours by temple chief Archaka Sri Venugopal Dikshitulu and other Archakas.

 

After Srivari Darshan Sri Mishra and entourage were rendered Veda Ashirvachanam by TTD Vedic pundits. Thereafter the TTD EO & Additional EO presented Srivari Thirtha Prasadam, portrait, TTD agarbatti’s and 2022 diary and calendars.

 

The Justice Mishra couple performed ritual of coconut breaking and camphor lighting at Akhilandam and also offered prayers at Bedi Anjaneya Temple.

 

Supreme Court judges Justice KK Maheswari, Justice Hima Kohli, AP high court judges Justice Lalita Kumari, Justice Sathyanarayana Murthy, Chattisgarh high court judge Justice PP Sahoo, Justice Narender Kumar VYAS, Kerala high court judge Justice P Somarajan, CVsO Sri Gopinath Jatti and others were present.

 

ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

శ్రీవారి సేవలో రాష్ట్ర హైకోర్టు ప్ర‌ధాన న్యాయ‌మూర్తి శ్రీ ప్ర‌శాంత్ కుమార్ మిశ్రా

తిరుమల, 2021 అక్టోబ‌రు 15: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హైకోర్టు ప్ర‌ధాన న్యాయ‌మూర్తి శ్రీ ప్ర‌శాంత్ కుమార్ మిశ్రా శుక్రవారం ఉదయం తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి వారిని దర్శించుకున్నారు. సతీసమేతంగా ఆలయం వద్దకు వచ్చిన జస్టిస్ ప్ర‌శాంత్ కుమార్ మిశ్రాకు ఈవో డాక్టర్ కె ఎస్ జవహర్ రెడ్డి, అద‌న‌పు ఈవో శ్రీ ఎవి.ధ‌ర్మారెడ్డి క‌లిసి స్వాగతం పలికారు. ప్రధాన అర్చకులు శ్రీ వేణుగోపాల దీక్షితులు ఇతర అర్చకులు ఆయనకు ఇస్తికఫాల్ స్వాగతం పలికారు. స్వామివారి దర్శనం అనంతరం రంగనాయకుల మండపంలో చీఫ్ జస్టిస్ కు పండితులు వేద ఆశీర్వాదం చేశారు.

అనంత‌రం ఈవో, అదనపు ఈవోలు కలిసి శ్రీ ప్ర‌శాంత్ కుమార్ మిశ్రాకు స్వామివారి తీర్థ ప్రసాదాలు, చిత్ర పటం, అగరబత్తులు, 2022 డైరీ క్యాలెండరు అందజేశారు.

శ్రీవారి దర్శనం అనంతరం జస్టిస్ ప్ర‌శాంత్ కుమార్ మిశ్రా దంపతులు అఖిలాండం వద్ద కర్పూరం వెలిగించి కొబ్బరికాయ కొట్టారు. తరువాత శ్రీ బేడీ ఆంజనేయ స్వామి వారిని దర్శించుకున్నారు.

ఈ కార్యక్రమంలో సుప్రీంకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ జేకే మహేశ్వరి, జస్టిస్ హిమా కోహ్లీ, ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ ల‌లిత‌కుమారి, జస్టిస్ స‌త్య‌నారాయ‌ణ మూర్తి, ఛత్తీస్‌గఢ్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ పార్త్ ప్రతీం సాహు, జస్టిస్ నరేంద్ర కుమార్ వ్యాస్, కేరళ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ పి.సోమరజన్, సివిఎస్వో శ్రీ గోపినాథ్ జెట్టి, ఇత‌ర అధికారులు పాల్గొన్నారు.

టిటిడి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయడమైనది