CULTURAL TROUPES STEAL THE SHOW_ శ్రీవారి హ‌నుమంత వాహనసేవలో భక్తులను విశేషంగా ఆకట్టుకున్న కళాప్రదర్శనలు

Tirumala, 15 October 2018: The versatile artistes hailing from Haryana, Karnataka, Tamilnadu, Maharashtra apart from Telugu states have been attracting pilgrims with their variety display of art during vahana sevas in the ongoing Navarathri Brahmotsavams.

On Monday during Hanumantha Vahana seva, Ring dance, Tuludance, folk art Pillanagrovulu performed by artistes hailing from Coastal Karnataka, Andhra Pradesh stood as show stoppers.

Tulu dance is a traditional form of art often performed the fishermen community of Coastal Karnataka. They perform episodes of Ramayana, Mahabharata with the help of this dance and educate rural masses.

While Pillanagrovulu is yet another traditional art form of Ramakuppam of Chittoor district of Andhra Pradesh. The pilgrims in the galleries too dance to the tunes of the folklores.


ISSUED BY PUBLIC RELATIONS OFFICER, TTD, TIRUPATI

శ్రీవారి హ‌నుమంత వాహనసేవలో భక్తులను విశేషంగా ఆకట్టుకున్న కళాప్రదర్శనలు

తిరుమల, 15 అక్టోబరు 2018: శ్రీవారి న‌వ‌రాత్రిబ్రహ్మోత్సవాలలో భాగంగా 6వ రోజైన సోమ‌వారం ఉద‌యం హ‌నుమంత వాహ‌న‌సేవ‌లో వివిధ రాష్టాలకు చెందిన కళాబృందాల ప్రదర్శనలు భక్తులను విశేషంగా ఆకట్టుకున్నాయి. టిటిడి హిందూ ధర్మప్రచార పరిషత్‌, అన్నమాచార్య ప్రాజెక్టు, దాససాహిత్య ప్రాజెక్టు కళాకారుల ప్రదర్శనలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.

ఇందులో భాగంగా హిందూ ధ‌ర్మ ప్ర‌చార ప‌రిష‌త్ ఆధ్వార్యంలో క‌ర్ణాట‌క రాష్ట్రం బెంగుళూరుకుచెందిన 5 క‌ళా బృందాల్లో 60 మంది కళాకారులు వచ్చారు. వీరు కంగిలు కుణిత‌, డొల్లు కుణిత, చిలి పిలి గొంబె, యక్షగానం, సోమన కుణితలు భ‌క్తుల‌ను విశేషంగా ఆక‌ట్టుకున్నాయి. అదేవిధంగా విజ‌య‌న‌గ‌రం జిల్లా బొబ్బిలికి చెందిన 15 మంది క‌ళాకారుల బృందం త‌ప్పిడిగుళ్లు, మొద‌టిసారిగా వైజాగ్‌కు చెందిన ” శ్రీ హ‌రినామ కోలాట బృందం”లోని 30 మంది కళాకారుల కోలాటాలు మ‌రింత శోభ‌ను చేకుర్చింది.

అన్న‌మాచార్య ప్రాజెక్టు ఆధ్వ‌ర్యంలో కాకినాడ‌కు చెందిన ” శ్రీ శ్రీ‌నివాస అన్న‌మాచార్య భ‌జ‌న కొలాట సేవా స‌మితి”కి చెందిన 30 మంది కళాకారుల బృందం కోలాటాలు భక్తులను తన్మయులను చేస్తున్నారు. వీరు గత 12 సం|| లుగా శ్రీవారి బ్రహ్మోత్సవాలలో పాల్గొంటున్నారు.

దాస సాహిత్య ప్రాజెక్టు ఆధ్వ‌ర్యంలో రాజ‌మండ్రికి చెందిన ” శ్రీ శ్రీ‌నివాస నాసిక్ డోళ్లు వాయిధ్యా స‌మాజం”కి చెందిన 42 మంది క‌ళాకారులు శ్రీ సీతా రామ ల‌క్ష్మ‌ణ స‌మేత హ‌నుమంత స్వామివారు అలంకారాలు, శ్రీ‌రామ భ‌జ‌న‌లతో మాడ వీధులు మార్మోగాయి. ఉడిపికి చెందిన 11 మంది క‌ళాకారుల బృందం ఉడిపి వాయిధ్యంలో భాగంగా పంచ వాయిధ్యాలు భ‌క్తుల‌ను విశేషంగా ఆక‌ర్షించాయి. గుంటూరుకు చెందిన ” శ్రీ హ‌య‌గ్రీవ‌ భ‌జ‌న మండ‌లి”కి చెందిన 30 మంది క‌ళాకారుల కోయ‌డాన్స్ భ‌క్తుల‌ను ఆక‌ట్టుకున్నాయి. ఇందులో 12 సం|| నుండి 15 సం||ల మధ్య వయస్సు ఉన్న కళాకారులు ఉన్నారు. వీరు గ‌త 10 సం|| ల నుండి శ్రీ‌వారి వాహ‌న సేవ‌ల‌లో ప్ర‌ద‌ర్శ‌న‌లు ఇస్తున్నారు. అదేవిధంగా తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి బ్రహ్మోత్సవాలలోను భజన మండలి కళాకారులు ప్రదర్శనలు ఇస్తున్నారు.

తిరుమ‌ల‌కు చెందిన స్థానిక క‌ళాకారులు

తిరుమ‌ల బాలాజి న‌గ‌ర్‌కు చెందిన శ్రీ ఎమ్‌.గోవింద‌స్వామి నాయ‌క‌త్వంలోని ” శ్రీ హ‌రి రామ భ‌జ‌న మండ‌లి”కి చెందిన 25 మంది కళాకారులు కోలాటం ప్ర‌ద‌ర్శ‌న‌లు ఇస్తున్నారు. వీరు బ్ర‌హోత్స‌వాల‌లో ఉద‌యం, రాత్రి వాహ‌న సేవ‌ల‌లో ప్ర‌ద‌ర్శ‌న‌లు ఇస్తున్నారు. ఇందులో తిరుమ‌ల‌కు చెందిన స్థానిక గృహిణులు, ఎస్‌.వి.హైస్కూలుకు చెందిన విద్యార్థులు పాల్గొంటున్నారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.