SRI RAMA CHANDRA ON HANUMANTHA BLESS DEVOTEES_ హనుమంతునిపై వేంకటాద్రిరాముడు

Tirumala, 15 October 2018: On the sixth day morning on Monday, the Lord Malayappa Swamy in the guise of Venkatadri Sri Ramachandra Murthy took celestial ride on His humble and noble devotee Hanumantha Vahana on Monday.

IMPORTANCE

With regard to character, strength and ability, Hanuman was far superior to even humans. His surrender to the divine cause and his devotion to Lord Rama was unique, exemplary and unconditional. Even today devotees say that wherever the name of Lord Rama is chanted or mentioned, this sacred being would be present there listening to the chanting of his name and absorbed in his thoughts.

SYMBOL OF PURE DEVOTION

Lord Hanuman symbolically stands for pure devotion, complete surrender and absence of ego. His character tells us what we can do in our lives by becoming pure, humble and surrender outselves to the almighty (saranagati).

Supreme Court Judge Justice NV Ramana, TTD EO Sri Anil Kumar Singhal, Tirumala JEO Sri KS Sreenivasa Raju, Incharge CVSO Sri Sivakumar Reddy, Temple DyEO Sri Haridranath, Peishkar Sri Ramesh, VGOs Sri Raveendra Reddy, Smt Sadalakshmi, Temple Staff and devotees took part.


ISSUED BY PUBLIC RELATIONS OFFICER, TTD, TIRUPATI

హనుమంతునిపై వేంకటాద్రిరాముడు

తిరుమల, 2018 అక్టోబరు 15: శ్రీవారి న‌వ‌రాత్రి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆరో రోజైన సోమ‌వారం ఉదయం 9.00 నుండి 11.00 గంటల వరకు శేషాచలాధీశుడు శ్రీరాముని అవతారంలో తన భక్తుడైన హనుమంతునిపై ఊరేగి భక్తులకు దర్శనమిచ్చాడు. వాహనం ముందు భక్తజన బృందాలు చెక్కభజనలు, కోలాటాలతో స్వామివారిని కీర్తిస్తుండగా, మంగళవాయిద్యాల నడుమ స్వామివారి వాహనసేవ కోలాహలంగా జరిగింది. భక్తులు అడుగడుగునా కర్పూరహారతులు సమర్పించి స్వామివారిని దర్శించుకున్నారు.

హనుమంతుడు భగవత్‌ భక్తులలో అగ్రగణ్యుడు. రామాయణంలో మారుతి స్థానం అద్వితీయం. చతుర్వేద నిష్ణాతుడుగా, నవవ్యాకరణ పండితుడుగా, లంకాభీకరుడిగా ప్రసిద్ధుడైన ఆంజనేయుడు వేంకటాద్రివాసుని మూపున వహించి తిరువీధులలో దర్శనమివ్వడం భక్తులను ఆనందపరవశులను చేసింది. గురు శిష్యులై శ్రీరామ హనుమంతులు తత్త్వ వివేచనగావించిన మహనీయుడు కనుక వాహ్య వాహకరూపంలో ఈ ఇరువురినీ చూసిన వారికి వేదాలతత్త్వం ఒనగూరుతుంది.

ఈ కార్యక్రమంలో శ్రీశ్రీశ్రీ పెద్ద జీయ్యంగార్‌, శ్రీశ్రీశ్రీ చిన్న జీయ్యంగార్‌, సుప్రీంకోర్టు న్యాయ‌మూర్తి శ్రీ ఎన్‌.వి.ర‌మ‌ణ‌, ఈవో శ్రీ అనిల్‌కుమార్‌ సింఘాల్‌, తిరుమ‌ల జెఈవో శ్రీ కె.ఎస్‌.శ్రీ‌నివాస‌రాజు, ఇతర అధికారులు పాల్గొన్నారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.