SRIVARI SEVA EMERGING STRONGER DAY BY DAY_ ప్రజాసంబంధాల విభాగం ద్వారా బ్రహోత్సవ వైభవం వ్యాప్తి సేవాభావంతో శ్రీవారి సేవకులు సేవలందిస్తున్నారు — డా.టి.రవి

Tirumala, 15 October 2018: The Srivari Seva voluntary service is emerging stronger day by day and the volunteers are rendering impeccable services to multitude of visiting pilgrims in vital areas, said the Public Relations Officer and Srivari Seva Head, Dr T Ravi.

Addressing the lensmen at media centre in Tirumala on Monday, he said commenced with just 195 volunteers in the year 2000, the voluntary service touched 10lakh man hours this year. Volunteers from almost a dozen states across the country are taking part in the service apart from Telugu speaking states. The orientation and satsang programme by Sri Satya Sai Seva Organisation is also moulding sevakulu to offer services with more commitment”, he added.

Later he said, 3-day, 4-day, 7-day online service has also been introduced by TTD this year to encourage NRIs, more youth and employees to take part in voluntary service.

Assistant PRO Ms.P Neelima, Liaison Officer Sri Vara prasad were also present.


ISSUED BY PUBLIC RELATIONS OFFICER, TTD, TIRUPATI

ప్రజాసంబంధాల విభాగం ద్వారా బ్రహోత్సవ వైభవం వ్యాప్తి సేవాభావంతో శ్రీవారి సేవకులు సేవలందిస్తున్నారు — డా.టి.రవి

అక్టోబ‌రు 15, తిరుమల 2018: శ్రీవారి వార్షిక, నవరాత్రి బ్రహ్మోత్సవాలలో టిటిడి ప్రజాసంబంధాల విభాగం ద్వారా బ్రహ్మోత్సవ వైభవాన్ని మరింత వ్యాప్తి చేశామని పీఆర్వో డా.టి.రవి తెలిపారు. తిరుమలలోని రాంభగీచా-2లో గల మీడియా సెంటర్‌లో సోమవారం ఆయన మీడియా సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా పీఆర్వో మాట్లాడుతూ టిటిడి ఈవో శ్రీ అనిల్ కుమార్ సింఘాల్ ఆదేశాల మేరకు భక్తులకు టిటిడి చేపడుతున్న సౌకర్యాలు, ఏర్పాట్లు, ఉత్సవాలు, తదితర కార్యక్రమాలను ఎప్పటికప్పుడు మీడియాకు అందించి విస్తృతంగా ప్రచారం చేస్తున్నామని అన్నారు. టిటిడికి సంబంధించి ప్రత్యేక కథనాలు, టిటిడి ఈవో, తిరుమల జెఈవో, తిరుపతి జెఈవో ఇతర ఉన్నతాధికారుల సమీక్షలు, తనిఖీలు, శ్రీవారి ఆలయ కార్యక్రమాలతోపాటు టిటిడి అనుబంధ ఆలయాల రోజువారి కార్యక్రమాలను మీడియాకు అందిస్తున్నామన్నారు. బ్రహ్మోత్సవాల పై కరపత్రాలు, గోడపత్రికలు, అడ్వర్టైజ్మెంట్ లు, సామాజిక మాధ్యమాలు తదితర మార్గాల ద్వారా సమాచారాన్ని అందించామన్నారు. బ్రహ్మోత్సవాలలో భాగంగా టిటిడి భక్తులకు కల్పించిన సౌకర్యాల వివరాలను ఆయా విభాగాల ఉన్నతాధికారుల ద్వారా మీడియా సెంటర్ ద్వారా తెలియజేస్తున్నామని తెలిపారు.

సేవాభావంతో శ్రీవారి సేవకులు, స్కౌట్స్ అండ్ గైడ్స్ సేవలందిస్తున్నారు

శ్రీవారి దర్శనం కోసం వచ్చే భక్తులకు శ్రీవారి సేవకులు, స్కౌట్స్ అండ్ గైడ్స్ సేవాభావంతో సేవలు అందిస్తున్నారని శ్రీవారి సేవా విభాగ అధిపతి డా.టి.రవి తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శ్రీవారి సేవకులు అద్భుతమైన సేవలందిస్తూ భక్తులతో మమేకమవుతున్నారని తెలిపారు. బ్రహ్మోత్సవాల రోజులతోపాటు ఇతర రోజులలో శ్రీవారి ఆలయం, అన్నప్రసాదం, విజిలెన్స్‌, కల్యాణకట్ట, ఆరోగ్యశాఖ తదితర విభాగాలలో శ్రీవారి సేవకులు సేవలందిస్తున్నారని చెప్పారు. శ్రీవారి వార్షిక, నవరాత్రి బ్రహ్మోత్సవాలకు వచ్చిన భక్తులకు అన్నప్రసాదం, కాఫీ, టీ, పాలు, మజ్జిగ‌ అందిస్తున్నారన్నారు. ఈ బ్రహ్మోత్సవాలలో దాదాపు 4 వేల మంది శ్రీవారి సేవకులు, స్కౌట్స్ అండ్ గైడ్స్ సేవ చేస్తున్నారని అన్నారు. శ్రీవారి సేవకు నమోదు చేసుకునేందుకు ఆఫ్‌లైన్‌తోపాటు ఆన్‌లైన్‌ సౌకర్యం కూడా కల్పించామన్నారు. శ్రీవారి సేవ చేసేందుకు ఇటీవల 3 రోజులు, 4 రోజుల స్లాట్లను భక్తులకు అందుబాటులోకి తీసుకువచ్చామని తెలిపారు. సేవకులకు నైతిక విలువలు, ధర్మ చింతన పై తరచూ శిక్షణ ఇస్తున్నామన్నారు. ఇప్పటి వరకు ఐఎఎస్ లు, ఐపీఎస్ లు, న్యాయమూర్తులు, రాజకీయ నేతలు, సినీ, మీడియారంగాల వారు సేవాభావంతో సేవ చేశారని తెలిపారు.

శ్రీవారి సేవ ఓఎస్డీ కుమారి నీలిమ మాట్లాడుతూ టిటిడిలో శ్రీవారిసేవను 2000 సంవత్సరంలో 195 మంది సేవకులతో ప్రారంభించారని, ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా 10లక్షల మంది శ్రీవారి సేవకులు టిటిడిలో సేవలందించారని తెలిపారు. మానవసేవే మాధవసేవగా శ్రీవారి భక్తుల సేవలో సేవకులు సేవలందిస్తున్నారని చెప్పారు.

ఈ మీడియా స‌మావేశంలో శ్రీవారి సేవ విభాగం ఏఈ శ్రీ వ‌ర‌ప్ర‌సాద్ పాల్గొన్నారు.

టిటిడి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.