COMPLETE JAMMU SV TEMPLE WORKS ON TIME- TTD ADDITIONAL EO _ ఉత్తరాయణానికి జమ్మూ ఆలయనిర్మాణం పూర్తి చేయాలి – నిర్మాణ పనులు పరిశీలించిన అదనపు ఈవో శ్రీ ధర్మారెడ్డి

Tirumala, 30 March 2022: TTD Additional EO Sri AV Dharma Reddy has directed officials to expedite construction works of the SV temple at Majin village near Jammu and ensure its completion by year end.

 

Along with the Chair Person of Delhi Local Advisory Committee President Smt Prashanti Reddy, the TTD Additional EO on Wednesday inspected the temple development works during which the engineering officials explained that works up to basement level were completed.

 

TTD officials said they were awaiting some materials being transported from Kotappakonda in AP and many others were locally procured.

 

Additional EO who went round the site along with TTD Chief Engineer Sri Nageswar Rao instructed them to complete all works by year-end.

 

ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

ఉత్తరాయణానికి జమ్మూ ఆలయనిర్మాణం పూర్తి చేయాలి
– నిర్మాణ పనులు పరిశీలించిన అదనపు ఈవో శ్రీ ధర్మారెడ్డి

తిరుమల 30 మార్చి 2022: జమ్మూ సమీపంలోని మజీన్ గ్రామంలో నిర్మిస్తున్న శ్రీ వేంకటేశ్వర స్వామి వారి ఆలయ నిర్మాణం వచ్చే ఉత్తరాయణానికి పూర్తి చేయాలని టీటీడీ అదనపు ఈవో శ్రీ ధర్మారెడ్డి అధికారులను ఆదేశించారు.

ఢిల్లీ స్థానిక సలహా మండలి చైర్ పర్సన్ శ్రీమతి ప్రశాంతి రెడ్డి తో కలసి బుధవారం ఆయన ఆలయ నిర్మాణ పనులు పరిశీలించారు. ఆలయ నిర్మాణం.పనులు బేస్మెంట్ వరకు పూర్తి అయ్యాయని ఇంజినీరింగ్ అధికారులు అదనపు ఈవో కు వివరించారు. ఆంధ్రప్రదేశ్ లోని కోటప్పకొండ లో తయారవుతున్న కొన్ని మెటీరియల్ ను మజీన్ కు రవాణా చేయాల్సి ఉందన్నారు. మరికొన్ని మెటీరియల్స్ ను స్థానికంగా సమీకరించడానికి ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. వచ్చే ఉత్తరాయణానికి పనులు పూర్తి చేయడానికి అవసరమైన చర్యలు తీసుకోవాలని అదనపు ఈవో ఆదేశించారు. టీటీడీ చీఫ్ ఇంజినీర్ శ్రీ నాగేశ్వరరావు పాల్గొన్నారు.

టీటీడీ ప్రజా సంబంధాల అధికారిచే విడుదల చేయడమైనది