DAKSHINAMURTHY HOMAM CONCLUDES _ శ్రీ కపిలేశ్వరాలయంలో ఘ‌నంగా శ్రీ ద‌క్షిణామూర్తిస్వామివారి హోమం

Tirupati,4 Nov. 19: The sacred Yagam proposed to invoke the blessings of Sri Dakshinamurthy Swamy concluded on a grand celestial note in Sri Kapileswara Swamy temple at Tirupati on Monday.

From November 5 to 13, for a period of nine days, the Homam for Sri Kamakshi Ammavaru will be observed in the temple. 

TTD local temple DyEO Sri Subramanyam,superintendent Sri Bhupathi, Temple inspector Sri Reddy Sekhar, Temple Archakas etc participat.

ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI  

శ్రీ కపిలేశ్వరాలయంలో ఘ‌నంగా శ్రీ ద‌క్షిణామూర్తిస్వామివారి హోమం

తిరుపతి, 2019 న‌వంబ‌రు 04: తిరుపతిలోని శ్రీ కపిలేశ్వరస్వామివారి ఆలయంలో నెల రోజుల పాటు జరుగుతున్న హోమ మహోత్సవాల్లో భాగంగా సోమ‌వారం శ్రీ ద‌క్షిణామూర్తిస్వామివారి హోమం ఘ‌నంగా జరిగింది.

 ఇందులో భాగంగా యాగశాలలో ఉదయం శ్రీ ద‌క్షిణామూర్తిస్వామివారి హోమం, మ‌హాపూర్ణాహుతి, కలశ ఉద్వాసన, మహాశాంతి అభిషేకం, కలశాభిషేకం నిర్వహించారు. సాయంత్రం శ్రీ కామాక్షి అమ్మ‌వారి కలశస్థాపన చేపట్టనున్నారు.

న‌వంబ‌రు 5 నుండి 13వ తేదీ వర‌కు శ్రీ కామాక్షి అమ్మ‌వారి హోమం

          హోమ మహోత్సవాల్లో భాగంగా న‌వంబ‌రు 5 నుండి 13వ తేదీ వ‌ర‌కు 9 రోజుల పాటు శ్రీ కామాక్షి అమ్మ‌వారి హోమం(చండీయాగం) జ‌రుగ‌నుంది. గృహస్తులు రూ.500/- చెల్లించి ఒక రోజు హోమంలో పాల్గొనవచ్చు. గృహస్తులకు ఒక ఉత్తరీయం, ఒక రవికె, అన్నప్రసాదం అందజేస్తారు.

ఈ కార్యక్రమంలో టిటిడి స్థానిక ఆలయాల డెప్యూటీ ఈవో శ్రీ సుబ్రమణ్యం, సూప‌రింటెండెంట్ శ్రీ భూప‌తి, టెంపుల్‌ ఇన్‌స్పెక్టర్ శ్రీ రెడ్డి శేఖ‌ర్‌, ఆలయ అర్చకులు, ఇతర అధికారులు, విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.