DEEPAVALI ASTANAM HELD _ శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో దీపావళి ఆస్థానం

Tirupati, 14 Nov. 20: Deepavali Asthanam was held at Sri Govindaraja Swamy temple at Tirupati on Saturday.

Speaking on  this occasion, the JEO Sri P Basanth Kumar said, traditional Green Deepavali is being observed in the temple by litting ghee lamps in the temple. It is completely a pollution free festival that is being observed in a soulful manner”, he added.

Spl.Gr.DyEO Sri Rajendrudu and others also participated.

ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI

శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో దీపావళి ఆస్థానం

తిరుపతి, 2020 నవంబరు 14: తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో దీపావళి సందర్భంగా శనివారం సాయంత్రం ఆస్థానం జ‌రిగింది. ఆలయ ప్రాంగణంలోని శ్రీ పుండరీకవళ్ళి అమ్మవారి ఆలయం నుండి నూతన వస్త్రాలు, దీపాలు తీసుకువచ్చి శ్రీవారికి సమర్పించారు. అనంతరం ఆలయంలో దీపావళి ఆస్థానం నిర్వహించారు.

ఈ సంద‌ర్భంగా జెఈవో శ్రీ పి.బ‌సంత్‌కుమార్ మాట్లాడుతూ నేతిదీపాల వెలుగులతో ఆలయంలో దీపావళి ఆస్థానం నిర్వహించినట్టు తెలిపారు. ప్రభుత్వ విజ్ఞప్తి మేరకు భ‌క్తులు పొగ లేని, శబ్దం లేని టపాసులు కాల్చాలని కోరారు. చెడుపై మంచి సాధించిన విజయానికి గుర్తుగా దీపావళి పర్వదినాన్ని జరుపుకుంటారని తెలిపారు. స్వామివారి ఆశీస్సులతో ఈ దీపావళి అందరి జీవితాల్లో వెలుగులు నింపాలని, అందరూ సుఖశాంతులతో ఉండాలని ఆకాంక్షించారు.

ఈ కార్య‌క్ర‌మంలో ఆల‌య ప్రత్యేక శ్రేణి డెప్యూటీ ఈవో శ్రీ‌ రాజేంద్రుడు, సూపరింటెండెంట్ శ్రీ వెంకటాద్రి, టెంపుల్ ఇన్ స్పెక్టర్ శ్రీ మునీంద్రబాబు త‌దిత‌రులు పాల్గొన్నారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.