DEVELOPMENT WORKS ON A FAST PACE AT VONTIMITTA_ ఒంటిమిట్టలో శ్రీ కోదండరామస్వామివారి బ్రహ్మూెత్సవాలకు విస్తృత ఏర్పాట్లు : టిటిడి తిరుపతి జెఈవో శ్రీ బి.లక్ష్మీకాంతం

COMPLETED WITHIN A SPECIFIC TIME FRAME

DEVOTEES ARE OUR TOP PRIORITY

TTD JEO SRI B LAKSHMIKANTHAM

Vontimitta, 14 February 2019: All the developmental works at Sri Kaodanda Rama Swamy temple in Vontimitta at Kadapa district will be completed with a specific time frame, said TTD JEO for Tirupati Sri B Lakshmikantham.

Speaking to media persons after inspecting the ongoing development works in and around the temple on Thursday noon, the JEO said, as per the instructions of Honourable CM of AP Sri N Chandra Babu Naidu, Rs.100crores has been sanctioned towards the development of this ancient temple of Sri Rama in AP on the lines of Bhadrachalam temple in Telengana. “Our top priority is providing amenities and hassle free darshanam to devotees”, he asserted.

Adding further, JEO said, “The works are categorised into two with those to be completed for annual brahmotsavams and others as per some time line till December. Among these works some need to be done by Archaeological Survey of India, some by irrigation department, some by Tourism and rest by TTD”.

“The erection of temporary pandals, plastering, flooring, construction of toilets, vahana mandapam, setting up of sub-station etc.will be completed before brahmotsavams. Apart from these works some issues like land settlement disputes in four mada streets are still pending which will be resolved soon by taking up with district officials”, he maintained.

JEO said that in the next two months we will go ahead with comprehensive development strategy in solving the issues. “We will have weekly review meetings on progress of works”, he added.

Later he reviewed with various heads of TTD on various activities like anna prasadam, civil works, greenery etc.with concerned HoDs in Haritha Rest House.

Smt Goutami, DyEO and Incharge senior officer for Vontimitta temple, SEs Sri Ramesh Reddy, Sri Venkateswarulu, DFO Sri Phani kumar Naidu, Estate Officer Sri Vijaya saradhi, VGO Sri Ashok Kumar Goud, CMO Dr Nageswara Rao, Additional Health Officer Dr Sunil and other officers were also present.

ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER, TTDs, TIRUPATI

ఒంటిమిట్టలో శ్రీ కోదండరామస్వామివారి బ్రహ్మూెత్సవాలకు విస్తృత ఏర్పాట్లు : టిటిడి తిరుపతి జెఈవో శ్రీ బి.లక్ష్మీకాంతం

ఒంటిమిట్ట, 2019 ఫిబ్రవరి 14: టిటిడికి అనుబంధంగా ఉన్న ప్రముఖ పుణ్యక్షేత్రమైన ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామివారి బ్రహ్మూెత్సవాలకు విచ్చేసే భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా విస్తృత ఏర్పాట్లు చేయాలని టిటిడి తిరుపతి జెఈవో శ్రీ బి.లక్ష్మీకాంతం అధికారులను ఆదేశించారు. ఒంటిమిట్ట శ్రీ కోదండరామాలయాన్ని గురువారం జెఈవో సందర్శించారు. ఆలయ పరిసరాలు, ఉద్యానవన పనులు, పుష్కరిణి, కల్యాణవేదిక ప్రాంతాలను పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు.

ఈ సందర్భంగా జెఈవో మీడియాతో మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు గౌ|| శ్రీనారా చంద్రబాబునాయుడు ఆదేశాల మేరకు భద్రాచలం తరహాలో ఒంటిమిట్ట రామాలయాన్ని అభివృద్ధి చేసేందుకు చర్యలు చేపట్టామన్నారు. ఇందుకోసం రూ.100 కోట్లతో మాస్టర్‌ప్లాన్‌ రూపొందించామన్నారు. టిటిడి ఎంతో ప్రతిష్టాత్మకంగా ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామివారి ఆలయాన్ని అభివృద్ధి చేస్తున్నట్లు తెలిపారు. ఇందులో భాగంగా వాహనమండపం, మాడవీధులలో సిసి రోడ్లు, మరుగుదొడ్లు తదితర పనులు దాదాపు పూర్తికావచ్చాయని, మరికొన్ని పనులు వివిధ దశల్లో ఉన్నాయని వివరించారు. ఆలయం వద్ద భక్తుల సౌకర్యార్థం క్యూలైన్లు, వేచి ఉండే గదులు, కార్యాలయ భవనం, విశ్రాంతిగృహం పనులు త్వరగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. భక్తుల కొరకు టిటిడి అనే నినాదంతో ముందుకు వెలుతున్నట్లు తెలిపారు.

గత అనుభవాలను దృష్టిలోఉంచుకుని శాశ్వత ప్రాతిపదికన కల్యాణవేదిక నిర్మించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. అదేవిధంగా పార్కింగ్‌ ప్రాంతాన్ని మరింతగా అభివృద్ధి చేస్తున్నామన్నారు. భక్తులకు ఆధ్యాత్మిక, అహ్లాదకర వాతావరణం కల్పించేందుకు మొక్కలను విరివిగా నాటాలని డిఎఫ్‌వోను ఆదేశించారు. విద్యుత్‌ ఉపకేంద్రంను మార్చి మొదటి వారంలో ప్రారంభించనున్నట్లు తెలిపారు.

ఆలయ నిర్మాణం దెబ్బతినకుండా పోటు మరమ్మతులు, ఫ్లోరింగ్‌ పనులను భారత పురావస్తు శాఖ చేపట్టేలా ఒప్పందం కుదుర్చుకున్నామని జెఈవో తెలిపారు. శ్రీ సీత లక్ష్మణ సమేత శ్రీ కోదండరామస్వామివారి ఊరేగింపుకు ఇబ్బందిలేకుండా మాడ వీధుల విస్తరణ చేపట్టేందుకు ప్రభుత్వ అధికారులతో చర్చించి ప్రణాళికలు రూపొందించామన్నారు. ఒంటిమిట్టకు విచ్చేసే భక్తుల వసతి కొరకు కల్యాణ వేదిక వద్ద నిర్మించిన వసతి సమూదాయం అందుబాటులో ఉన్నట్లు తెలిపారు.

ఒంటిమిట్ట బ్రహ్మూెత్సవాలకు ఏప్రిల్‌ 12న వ్యాసాభిషేకంతో బ్రహ్మూెత్సవాలు ప్రారంభమవుతాయన్నారు. ఏప్రిల్‌ 13న ధ్వజారోహణం, ఏప్రిల్‌ 18న శ్రీరాములవారి కల్యాణం, ఏప్రిల్‌ 22వ తేదీ పుష్పయాగం నిర్వహిస్తామన్నారు. ప్రతి ఏడాదిలాగానే శ్రీరాములవారి కల్యాణం నిర్వహించే ప్రాంతంలోని కల్యాణ వేదిక వద్ద ఈ ఏడాది కూడా తాత్కాలిక పందిళ్లు వేయనున్నట్లు తెలిపారు. అదేవిధంగా బ్రహ్మూెత్సవాలలో విచ్చేసే లక్షలాది మంది భక్తులకు అవసరమైన తాత్కాలిక ఏర్పాట్లను పటిష్టంగా చేయనున్నట్లు తెలియజేశారు.

అధికారులతో సమీక్ష

అనంతరం హరిత అతిథి భవంలో శ్రీ కోదండరామస్వామివారి ఆలయం, కల్యాణ వేదిక వద్ద జరుగుతున్న అభివృద్ధి పనులపై వివిధ విభాగాలకు చెందిన టిటిడి, ప్రభుత్వ అధికారులతో జెఈవో సమీక్షించారు. స్వామివారి బ్రహ్మూెత్సవాలకు విచ్చేసే వేలాది మంది భక్తులకు అన్నప్రసాదాలు అందించేందుకు ముందస్తు ఏర్పాట్లపై అధికారులతో చర్చించారు. ప్రతివారం ఒంటిమిట్టలో జరుగుతున్న అభివృద్ధి పనులపై వారం వారం నివేదిక అందించాలని అధికారులను ఆదేశించారు.

ఈ కార్యక్రమంలో డెప్యూటీ ఈవో మరియు ఆలయ ప్రత్యేకాధికారి శ్రీమతి గౌతమి, ఐ.ఏ.స్‌, ఎస్‌ఇ శ్రీ రమేష్‌రెడ్డి, ఎస్‌ఇ (ఎలక్ట్రికల్‌) శ్రీ వేంకటేశ్వర్లు, అన్నప్రసాదం ప్రత్యేకాధికారి శ్రీ వేణుగోపాల్‌, సిఎమ్‌వో శ్రీ నాగేశ్వరరావు, విజివో శ్రీ అశోక్‌కుమార్‌గౌడ్‌, డిఎఫ్‌వో శ్రీ ఫణికుమార్‌ నాయుడు, డెప్యూటీ ఈవో శ్రీ నటేష్‌ బాబు, ఇఇ శ్రీ జగన్‌మోహన్‌రెడ్డి, ఏఈవో శ్రీ రామరాజు, ఇతర అధికారులు పాల్గొన్నారు.

టి.టి.డి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.