SKILL DEVELOPMENT FOR STUDENTS TO EXCEL IN THEIR CAREER-JEO_ విద్యార్థులకు నైపుణ్యాభివృద్ధి శిక్షణతో ఉజ్వల భవిష్యత్తు -టిటిడి తిరుపతి జెఈవో శ్రీ బి.లక్ష్మీకాంతం

Tirupati, 14 February 2019: For the students to excel in their career, they need to be trained in skill development, opinioned Tirupati JEO Sri B Lakshmikantham.

The JEO took part in the Skill Development Training programme held at SPWDPG college in Tirupati on Thursday evening in coordination with Art of Living experts team from Bengaluru.

Speaking on this occasion, the JEO said, the students should be trained in such a way that as soon as they complete their Degree, they should get and settle in a job.

DEO Sri Ramachandra, along with principals, students of SPW, SV Arts, SGS colleges of TTD who underwent skill development training took part in this programme.

ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER, TTDs, TIRUPATI

విద్యార్థులకు నైపుణ్యాభివృద్ధి శిక్షణతో ఉజ్వల భవిష్యత్తు -టిటిడి తిరుపతి జెఈవో శ్రీ బి.లక్ష్మీకాంతం

తిరుపతి, 2019 ఫిబ్రవరి 14: టిటిడి విద్యా సంస్థలలో చదువుతున్న విద్యార్థిని, విద్యార్థులకు చదువుతో పాటు నైపుణాభివృద్ధిలో శిక్షణ ఇవ్వడం ద్వారా మంచి భవిష్యత్తు కలుగుతుందని టిటిడి తిరుపతి జెఈవో శ్రీ బి.లక్ష్మీకాంతం అన్నారు. తిరుపతిలోని శ్రీ పద్మావతి డిగ్రీ మరియు పిజి కళాశాలలో గురువారం సాయంత్రం జెఈవో బెంగుళూరుకు చెందిన ఆర్ట్‌ అఫ్‌ లివింగ్‌ నిపుణులతో సమన్వయ సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా జెఈవో మాట్లాడుతూ చదువు పూర్తికాగానే విద్యార్థులు ఉపాధి పొందేందుకు వీలుగా నైపుణాభివృద్ధిలో ప్రత్యేక శిక్షణ ఇవ్యాలన్నారు. తద్వారా విద్యార్థులు డిగ్రీ పూర్తికాగానే, ఉపాధి పొంది జీవితంలో స్థిరపడటానికి ఉపయోగపడుతుందన్నారు. గత ఏడాది 2017-18 విద్యాసంవత్సరంలో తిరుపతిలోని ఎస్‌జిఎస్‌ ఆర్ట్స్‌ కళాశాల, ఎస్వీ ఆర్ట్స్‌ కళాశాల, ఎస్‌పిడబ్ల్యు డిగ్రీ కళాశాలలో విద్యార్థులకు నైపుణాభివృద్ధిలో శిక్షణ కార్యక్రమం ప్రారంభించినట్లు తెలిపారు.

ఈ కార్యక్రమంలో టిటిడి డిఈవో శ్రీ రామచంద్ర, కళాశాలల ప్రిన్సిపాల్స్‌, విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.