DEVOTEES TREK SRI RAMAKRISHNA THEERTHA MUKKOTI _ వేడుక‌గా శ్రీ రామకృష్ణ తీర్థ ముక్కోటి

Tirumala, 9 February 2020: The torrent festival, Ramakrishna Theertha Mukkoti was observed in a grand manner at Tirumala with devotees making a beeline to this torrent located in green woods of Seshachala ranges on the celestial occasion of Magha Pournami day on Sunday.

Legends say that Maharshi Sri Ramakrishna created the holy spring with his powers for benefit of people and animals in the forests.

Archakas of Srivari temple left for the thirtham six kms away in a procession with all materials and performed special rituals for the majestic idols of Sri Ramachandra and Sri Krishnaswamy.

TTD organised Anna Prasadam packets of Sambar rice, curd rice, pulihora, drinking water, buttermilk etc. at the site 

The medical, engineering, vigilance and forest departments made arrangements of health camps, walkers ladders and forest path clearances up to the Sri Ramakrishna thirtham.

ISSUED BY PUBLIC RELATIONS OFFICER, TTDs, TIRUPATI  

 

 

వేడుక‌గా శ్రీ రామకృష్ణ తీర్థ ముక్కోటి

ఫిబ్రవరి 09, తిరుమల 2020: తిరుమల శేషాచ‌ల అడ‌వుల్లోని పుణ్య‌తీర్థాల్లో ఒక‌టైన శ్రీ రామ‌కృష్ణ‌తీర్థ ముక్కోటి ఆదివారం వేడుక‌గా జ‌రిగింది. ప్రతిఏటా మాఘ మాసంలో పౌర్ణమినాడు శ్రీరామకృష్ణ తీర్థ ముక్కోటి నిర్వహించడం ఆనవాయితీ. శ్రీరామకృష్ణ మహర్షి తపోబలంతో ఈ పుణ్యతీర్థాన్ని సృష్టించినట్టు పురాణాల ద్వారా తెలుస్తోంది.

శ్రీవారి ఆలయం నుంచి అర్చ‌క సిబ్బంది మంత్రోచ్ఛారణ చేసుకుంటూ ఊరేగింపుగా బయలుదేరి ఉదయం 10 గం||లకు శ్రీ రామకృష్ణ తీర్థానికి చేరుకున్నారు. అక్క‌డ కొలువై ఉన్న శ్రీరామచంద్రమూర్తి, శ్రీకృష్ణ భగవానుల విగ్రహాలకు పాలు, పెరుగు, చంద‌నం త‌దిత‌ర సుగంధ ద్ర‌వ్యాల‌తో విశేషంగా అభిషేకం చేశారు. ప్రత్యేక పూజలు నిర్వహించి నైవేద్యం స‌మ‌ర్పించారు.

రామ‌కృష్ణ తీర్థానికి వెళ్లే భక్తులకు పాపవినాశనం డ్యామ్‌ వద్ద పొంగళి, ఉప్మా, సాంబారన్నం, పెరుగన్నం, పులిహోర పొట్లాలు, తాగునీరు, మ‌జ్జిగ ప్యాకెట్లు పంపిణీ చేశారు. తీర్థం వ‌ద్ద టిటిడి వైద్య విభాగం ఆధ్వ‌ర్యంలో వైద్య శిబిరం ఏర్పాటుచేసి భ‌క్తుల‌కు మందులు పంపిణీ చేశారు. టిటిడి ఇంజినీరింగ్‌, అట‌వీ విభాగాల ఆధ్వ‌ర్యంలో మార్గమ‌ధ్యంలో ప‌లుచోట్ల భ‌క్తుల‌కు సౌక‌ర్య‌వంతంగా ఉండేలా కొయ్య నిచ్చెన‌లు ఏర్పాటుచేశారు. ఈ కార్య‌క్ర‌మంలో పెద్ద సంఖ్య‌లో భ‌క్తులు పాల్గొన్నారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.