DHWAJAROHANAM MARKS COMMENCEMENT OF ANNUAL BRAHMOTSAVAMS _ ధ్వజారోహణంతో ప్రారంభమైన శ్రీ ప్ర‌స‌న్న వేంక‌టేశ్వ‌ర‌స్వామివారి బ్ర‌హ్మోత్స‌వాలు

Tirupati, 19 Jun. 21: The ceremonial Dhwajrohanam marked the commencement of the annual Brahmotsavams at Appalayagunta on Saturday in Ekantam amidst Covid guidelines.

The holy Garuda flag was hoisted on the temple Dhwajam in the auspicious Simha Lagnam.

Temple DyEO Smt Kasturi Bai, AEO Sri Prabhakar Reddy, Superintendent Sri Gopalakrishna Reddy, Temple Inspector Sri Srinivasa Raju were also present.

ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI

ధ్వజారోహణంతో ప్రారంభమైన శ్రీ ప్ర‌స‌న్న వేంక‌టేశ్వ‌ర‌స్వామివారి బ్ర‌హ్మోత్స‌వాలు

తిరుపతి, 2021 జూన్ 19: అప్ప‌లాయ‌గుంట‌ శ్రీ ప్ర‌స‌న్న వేంక‌టేశ్వ‌ర‌స్వామివారి బ్ర‌హ్మోత్స‌వాలు శనివారం ఉదయం ధ్వజారోహణంతో ప్రారంభమయ్యాయి.
కోవిడ్ -19 వ్యాప్తి నేప‌థ్యంలో ఈ కార్య‌క్ర‌మాన్ని ఆల‌యంలో ఏకాంతంగా నిర్వ‌హించారు. జూన్ 19 నుండి 27వ తేదీ వ‌ర‌కు వార్షిక బ్ర‌హ్మోత్స‌వాలు ఏకాంతంగా జ‌రుగ‌నున్నాయి.

శ‌నివారం ఉదయం 10.45 నుంచి 11.15 గంటల మ‌ధ్య‌ అర్చకులు శాస్త్రోక్తంగా ధ్వజారోహణం నిర్వహించారు. బ్రహ్మోత్సవాలకు ముక్కోటి దేవతలను ఆహ్వానిస్తూ గరుడ చిత్ర పటాన్ని ధ్వజస్తంభం మీద ఎగురవేశారు.
బ్రహ్మోత్సవాలలో భాగంగా ప్రతిరోజు ఉదయం 8 నుండి 9 గంటల‌ వరకు, సాయంత్రం 6 నుండి 7 గంటల‌ వరకు ఆల‌య ప్రాంగణంలో తిరుచ్చి ఉత్సవం, ఆస్థానం నిర్వహిస్తారు.

ఈ కార్య‌క్ర‌మంలో డెప్యూటీ ఈఓ శ్రీమతి కస్తూరి బాయి, ఏఇఓ శ్రీ ప్రభాకర్ రెడ్డి, ఆల‌య సూప‌రింటెండెంట్ శ్రీ గోపాలకృష్ణారెడ్డి, టెంపుల్ ఇన్‌స్పెక్ట‌ర్ శ్రీ శ్రీ‌నివాస‌రాజు త‌దిత‌రులు పాల్గొన్నారు.

టి.టి.డి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.