V-DAY ARRANGEMENTS COMMENCE BY NOVEMBER 25-TTD EO_ డయల్‌ యువర్‌ ఈవో ముఖ్యాంశాలు

Tirumala, 2 November 2018: The arrangements for the big religious event, Vaikunta Ekadasi and Dwadasi scheduled on Decemebr 18 and 19 will commence from Novemeber 25 onwards, said TTD EO Sri Anil Kumar Singhal.

After Dial you EO programme, addressing media persons at Annamaiah Bhavan in Tirumala, the EO said, this year micro level planning has been made for Vaikuntha Ekadasi and the temporary sheds will be laid in four mada streets to manage the pilgrims in an orderly manner with defined entry and exit gates. The engineering works will commence from 25th of this month and JEO Tirumala Sri KS Sreenivasa Raju will be continuously monitoring the arrangements, he added.

He said, the special darshan for 4000 numbers of aged and physically challenged persons will be allotted on November 20 and 27 while parents with infants below the age of 5years on November 21 and 28 since the season is a slag period.

The EO said, Karthika Pournami Managudi will be observed across the twin Telugu states from November 20 to 23. While the annual Karthika Brahmotsavams in Sri Padmavathi Ammavari temple will be observed from December 4 to 12. The arrangements for both the events are taking place under the supervision of Tirupati JEO Sri P Bhaskar, he added.

He said, to increase the visit of pilgrims to sub temple, the overall development of each temple has been handed over to one senior officer. Now, in Sri Govinda Raja Swamy temple in Tirupati, we did inspection recently to sort out the long pending parking problem. Similarly, Rs.5crores worth developmental works will be taken up in Srinivasa Mangapuram temple and we are awaiting permission from Arcahelogical department, he maintained.

ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER TTDs, TIRUPATI

డయల్‌ యువర్‌ ఈవో ముఖ్యాంశాలు

తిరుమల, 02 నవంబర్‌ 2018: తిరుమలలోని అన్నమయ్య భవనంలో శుక్రవారం జరిగిన డయల్‌ యువర్‌ ఈవో కార్యక్రమంలో టిటిడి ఈవో శ్రీ అనిల్‌కుమార్‌ సింఘాల్‌ భక్తులను ఉద్దేశించి ప్రసంగించారు. ఆ తరువాత మీడియాతో మాట్లాడారు. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.

శ్రీవారి బ్రహ్మోత్సవాలను విజయవంతం చేసినందుకు ధన్యవాదాలు : శ్రీవారి వార్షిక, నవరాత్రి బ్రహ్మోత్సవాల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా విజయవంతం చేసిన టిటిడి అధికారులకు, సిబ్బందికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. బ్రహ్మోత్సవాల్లో ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు, కేరళ, గుజరాత్‌, హర్యానా, ఛత్తీస్‌ఘడ్‌ రాష్ట్రాలకు చెందిన కళాబృందాల ప్రదర్శనలు భక్తులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఎంతో సుదూర ప్రాంతాల నుండి తిరుమలకు విచ్చేసి లక్షలాది మంది భక్తులను ఆకట్టుకునేలా ప్రదర్శనలు ఇచ్చిన కళాకారులకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం.

తిరుచానూరులోని శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలు : తిరుచానూరులోని శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో డిసెంబరు 4 నుండి 12వ తేదీ వరకు కార్తీక బ్రహ్మోత్సవాలు జరుగనున్నాయి. ఇందులో డిసెంబరు 4న ధ్వజారోహణం, డిసెంబరు 8న గజవాహనం, డిసెంబరు 9న గరుడవాహనం, డిసెంబరు 11న రథోత్సవం, డిసెంబరు 12న పంచమీతీర్థం జరుగనున్నాయి. అమ్మవారి బ్రహ్మోత్సవాలకు విచ్చేసే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా దర్శనం, అన్నప్రసాదాలు, తాగునీరు తదితర వసతులు కల్పించేందుకు ఏర్పాట్లు చేపట్టాం.

– బ్రహ్మోత్సవాల వాహనసేవలతోపాటు, తిరుచానూరులోని ఆస్థానమండపం, మహతి ఆడిటోరియం, శిల్పారామంలో ఆకట్టుకునేలా సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటుచేస్తాం.

పోస్టల్‌ ద్వారా తిరుచానూరులోని శ్రీ పద్మావతి అమ్మవారి ”ఆశీర్వచనం” : తిరుమల శ్రీవారి ఆలయానికి తపాలా శాఖ ద్వారా విరాళాలు అందిస్తున్న దాతలకు అమలుచేస్తున్న ఆశీర్వచనం పథకాన్ని తిరుచానూరులోని శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయానికి కూడా వర్తింపచేశాం.

– ఈ ప్రకారం శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయానికి తపాలాశాఖ ద్వారా రూ.500/- పైబడి హుండీ కానుకలు పంపే దాతలకు రశీదుతో పాటు శ్రీవారు, శ్రీపద్మావతి అమ్మవారి చిత్రపటం, అక్షింతలు, అమ్మవారి కుంకుమను తపాలా శాఖ ద్వారా భక్తులకు అందిస్తున్నాం.

– అక్టోబరు 29వ తేదీన ఈ కార్యక్రమాన్ని ప్రారంభించాం. అక్టోబరు 31వ తేదీ వరకు 250 మందికిపైగా అమ్మవారి ఆశీర్వచనాన్ని అందించాం.

ప్రత్యేక దర్శనాలు : వృద్ధులు, దివ్యాంగులు, 5 ఏళ్ల లోపు చంటిపిల్లల తల్లిదండ్రులకు నెలలో 2 రోజుల పాటు కల్పించే ప్రత్యేక దర్శన సౌకర్యాన్ని తిరిగి అమలుచేస్తున్నాం. ఇందులో భాగంగా నవంబరు 20, 27వ తేదీల్లో వృద్ధులు, దివ్యాంగులకు, నవంబరు 21, 28వ తేదీల్లో 5 ఏళ్లలోపు చంటిపిల్లలకు, వారి తల్లిదండ్రులకు దర్శనం కల్పిస్తాం.

– ఈ అవకాశాన్ని వృద్ధులు, దివ్యాంగులు, 5 ఏళ్లలోపు చంటిపిల్లల తల్లిదండ్రులు సద్వినియోగం చేసుకోవాలని కోరుతున్నాం.

డిసెంబరు 18న వైకుంఠ ఏకాదశికి విస్తృత ఏర్పాట్లు : డిసెంబర్‌ 18న వైకుంఠ ఏకాదశి పర్వదినానికి తిరుమల శ్రీవారి దర్శనార్థం విశేషంగా విచ్చేసే భక్తుల సౌకర్యార్థం విస్తృతంగా ఏర్పాట్లు చేపడతాం. పటిష్టంగా క్యూలైన్లు, ఆలయ మాడ వీధుల్లో, ఆళ్వార్‌ ట్యాంక్‌ వద్ద, నారాయణగిరి ఉద్యానవనాలలో షెడ్లు ఏర్పాటుచేస్తాం.

నవంబరు 20 నుండి 23వ తేదీ వరకు మనగుడి : కార్తీక పౌర్ణమిని పురస్కరించుకుని నవంబరు 20 నుండి 23వ తేదీ వరకు తెలుగు రాష్ట్రాల్లో మనగుడి కార్యక్రమాన్ని నిర్వహిస్తాం. ఇందులో భాగంగా నవంబరు 20న మంగళ కైశిక ద్వాదశి, 21న ఆలయ శోభ, 22, 23వ తేదీల్లో ధార్మిక కార్యక్రమాలు చేపడతారు. ఆయా ప్రాంతాల్లోని భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని కోరుతున్నాం.

టిటిడి స్థానికాలయాల అభివృద్ధి : తిరుపతి, పరిసర ప్రాంతాల్లోని స్థానికాలయాలను అభివృద్ధి చేసేందుకు చర్యలు చేపడుతున్నాం. ఇందులో భాగంగా టిటిడి సీనియర్‌ అధికారులకు ఆయా ఆలయాల పర్యవేక్షణ బాధ్యతలను అప్పగించాం.

శ్రీనివాసమంగాపురంలోని శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి ఆలయం : శ్రీనివాసమంగాపురంలోని శ్రీకల్యాణ వేంకటేశ్వరస్వామివారి ఆలయానికి విశేషమైన పౌరాణిక ప్రాశస్త్యముంది.

– ఈ ఆలయాన్ని రోజుకు దాదాపు 3 వేల మంది, శనివారం 8 వేల మంది భక్తులు దర్శించుకుంటున్నారు.

– తిరుపతి నుండి దాదాపు 12 కి.మీ దూరంలో ఈ ఆలయం ఉంది.

– తిరుపతి నుండి ఆర్‌టిసి బస్సు సౌకర్యం ఉంది.

– నెలకు సుమారు రూ.30 లక్షల హుండీ ఆదాయం లభిస్తోంది.

అభివృద్ధి పనులు : రూ.3.90 కోట్లతో ఆలయం చుట్టూ ప్రహరీ, రూ.47 లక్షలతో ఆలయ పుష్కరిణి విస్తరణ తదితర అన్ని అభివృద్ధి పనులను రూ.7 కోట్లతో చేపట్టాం.

– ప్రతి ఏడాదీ ఆలయంలో చలువపందిళ్లు, తాత్కాలిక షెడ్లు, పర్వదినాల సమయంలో క్యూలైన్ల ఏర్పాటు తదితర పనులకు రూ.88 లక్షలు ఖర్చు చేస్తున్నాం.

– భారత పురావస్తు శాఖ వారి అనుమతి వచ్చాక ఆలయంలో నూతనంగా పోటు, ఉగ్రాణం, వాహన మండపం, యాగశాల, కల్యాణమండపం విస్తరణ, డార్మెటరీ హాలు, నూతన కార్యాలయ భవనం తదితర అభివృద్ధి పనులను రూ.5 కోట్లతో చేపట్టేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాం.

– ఈ ఆలయాన్ని మరింత అభివృద్ధి చేసేందుకు భక్తుల నుండి సలహాలు, సూచనలు కోరుతున్నాం.

శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయం వద్ద పార్కింగ్‌ ఏర్పాట్లు : తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయం వద్ద దక్షిణ మాడ వీధిలోని ఖాళీ స్థలంలో పార్కింగ్‌ ఏర్పాట్లు చేస్తున్నాం.

దర్శనం :

– గతేడాది అక్టోబరులో 23.77 లక్షల మంది భక్తులు స్వామివారిని దర్శించుకోగా ఈ ఏడాది అక్టోబరులో 24 లక్షల మంది భక్తులు దర్శించుకున్నారు.

హుండీ ఆదాయం :

– శ్రీవారి హుండీ ఆదాయం గతేడాది అక్టోబరులో రూ.82.04 కోట్లు కాగా, ఈ ఏడాది అక్టోబరులో రూ.85.16 కోట్లు వచ్చింది.

అన్నప్రసాదం :

– గతేడాది అక్టోబరులో 55.19 లక్షల మంది భక్తులకు అన్నప్రసాదాలు అందివ్వగా, ఈ ఏడాది అక్టోబరులో 57.51 లక్షల మంది భక్తులకు అందజేయడం జరిగింది.

లడ్డూ లు :

– గతేడాది అక్టోబరులో 93.54 లక్షల లడ్డూలు అందించగా, ఈ ఏడాది అక్టోబరులో 1.05 కోట్లు లడ్డూలను అందించాం.

తలనీలాలు :

– గతేడాది అక్టోబరులో 11.09 లక్షల మంది భక్తులు తలనీలాలు సమర్పించగా, ఈ ఏడాది అక్టోబరులో 9.97 లక్షల మంది తలనీలాలు సమర్పించారు.

తితిదే ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.