EXHIBITION ALLURES PILGRIMS_ తిరుచానూరులో ప్రదర్శనశాలలను ప్రారంభించిన టిటిడి ఈవో

Tirupati, December 4: The floral expo set up by TTD is getting the accolades from pilgrims with its innovative mythological concepts.

TTD Executive officer Sri Anil Kumar Singhal and Joint Executive Officer Tirupati Sri Pola Bhaskar on Tuesday jointly inaugurated the bright and colourful exhibition of puranic episodes and display of Ayurveda products got up as part of Karthika Brahmotsavams in Tiruchanoor.

The flower display put up by the TTD garden department involving Goddess Padmavati and Lord Venkateswara, Anantalwar tying Goddess to a tree, Uniting Goddess with Lord by carrying Her in a basket, Annamacharya eating the laddu prasadam tasted by Lord offered by Goddess in the guise of an old lady, Bhasmasuravadha, Surpanakha Garva bhangam, Asta lakshmi Avirbhavam etc.

The exhibits also showcased Ayurvedic products from SV Ayurveda Pharmacy, display of herbs, free Ayurveda medical camp, and sculptures by different departments.

CVSO Sri Gopinath Jetti, Additional CVSO Sri K Sivakumar Reddy, VGO,Tirupati Sri Ashok Kumar Goud, Temple DyEO Smt Jhansi Rani, Dy.EO general Smt Gautami Garden Deputy Director Sri Srinivasulu and others participated in the event.

ISSUED BY PUBLIC RELATIONS OFFICER, TTDs, TIRUPATI

తిరుచానూరులో ప్రదర్శనశాలలను ప్రారంభించిన టిటిడి ఈవో

తిరుపతి, 2018 డిసెంబ‌రు 04: శ్రీ పద్మావతి అమ్మవారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా తిరుచానూరులోని శుక్రవారపుతోటలో ఏర్పాటుచేసిన ప్రదర్శనశాలలను టిటిడి ఈవో శ్రీ అనిల్‌కుమార్‌ సింఘాల్‌, తిరుపతి జెఈవో శ్రీ పోల భాస్కర్‌తో కలిసి ప్రారంభించారు.

ఇందులో టిటిడి ఉద్యానవన విభాగం ఆధ్వర్యంలో అనంతాళ్వారు తోట‌లో ఆడుకుంటున్న స‌మ‌యాన ప‌ద్మావ‌త‌మ్మ‌ను బంధించిన అనంతాళ్వారు…, శ్రీ‌వారి ఆదేశం మేర‌కు ప‌ద్మావ‌త‌మ్మ‌ను పూల‌బుట్ట‌లో పెట్టి స్వామికి స‌మ‌ర్పించి త‌న భ‌క్తిని, సేవ‌ను నిరూపిస్తున్న అనంతాళ్వారు…, శ‌క‌టాసురుడు అనే రాక్ష‌సుడిని సంహ‌రిస్తున్న చిన్నికృష్ణుడు…, వ‌ర‌మిచ్చిన శివునిపై వ‌ర ప్ర‌యోగం చేస్తున్న భ‌స్మాసురుడిని నృత్యంతో అంతం చేస్తున్న మోహినీ అవ‌తారంలో ఉన్న శ్రీ‌మ‌హావిష్ణువు…, అష్ట‌ల‌క్ష్మీ వైభ‌వం…, శ్రీ‌రామ వ‌న‌వాస స‌మ‌యాన త‌న‌ను వివాహం చేసుకోవాల‌ని కోరిన శూర్ప‌న‌ఖ ముక్కు చెవులు కోస్తున్న ల‌క్ష్మ‌ణుడు…, శ్రీ‌రామ‌, ల‌వ‌కుశుల మ‌ధ్య జ‌రుగుతున్న యుద్ధాన్ని ఆపుతున్న సీత‌మ్మ త‌ల్లి…, శ్రీ‌దేవి, భూదేవి స‌మేతంగా స్వామి ఆర‌గించిన ల‌డ్డూను ముస‌లి అవ్వ రూపంలో అన్న‌మ‌య్య‌కు అందిస్తున్న ప‌ద్మావ‌త‌మ్మ‌…, శ్రీ‌దేవి భూదేవి స‌మేత శ్రీ వేంక‌టేశ్వ‌రుని సైక‌త శిల్పం… తదితర పౌరాణిక అంశాలు, కూర‌గాయ‌ల‌తో రూపొందించిన దేవ‌తామూర్తుల మండ‌పం, పుష్పాలతో వివిధ జంతువులు, పక్షుల ఆకృతులు భక్తులను ఆకట్టుకుంటున్నాయి.

అదేవిధంగా, ఎస్వీ ఆయుర్వేద కళాశాల ఆధ్వర్యంలో ఆయుర్వేద ప్ర‌ద‌ర్శ‌న‌శాల‌, ఎస్వీ ఆయుర్వేద ఫార్మసి ఆధ్వర్యంలో వనమూలికా ప్రదర్శన, ఉచిత ఆయుర్వేద వైద్య శిబిరం, ఎస్వీ సంప్రదాయ ఆలయ శిల్ప శిక్షణ సంస్థ ఆధ్వర్యంలో కళల ప్రదర్శనశాల ఏర్పాటుచేశారు.

ఈ కార్యక్రమంలో టిటిడి సివిఎస్వో శ్రీ గోపినాథ్‌జెట్టి, అదనపు సివిఎస్వో శ్రీ శివకుమార్‌రెడ్డి, తిరుపతి విజివో శ్రీ అశోక్‌కుమార్‌ గౌడ్‌, ఆలయ డెప్యూటీ ఈవో శ్రీ‌మ‌తి ఝాన్సీరాణి, డెప్యూటీ ఈవో (జ‌న‌ర‌ల్‌) శ్రీ‌మ‌తి గౌత‌మి, గార్డెన్‌ సూపరింటెండెంట్‌ శ్రీ శ్రీనివాసులు, ఇతర అధికారులు, భక్తులు పాల్గొన్నారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.