DOORS OF ALL LOCAL TEMPLES CLOSES FOR SOLAR ECLIPSE _ సూర్య గ్రహణం కారణంగా రాత్రి 11 గంట‌ల‌కు టిటిడి స్థానిక ఆలయాల మూత

Tirupati, 25 Dec. 19: Ahead of the solar eclipse on Thursday, all the TTD local temples were closed on Wednesday evening after ekantha seva of respective temples.

All the TTD temples including Sri Padmavati Ammavari temple at Tiruchanoor, Sri Govindaraja Swamy temple and Sri Kodandarama Swamy temple at Tirupati, Sri Kalyana Venkateswara Swamy temple at Srinivasa Mangapuram and Sri Prasanna Venkateswara Swamy temple at Appalayagunta were closed after ekantha seva rituals.

After the eclipse period from 8.08 am to 11.16 am on Thursday the temples will be opened and Suddhi will be performed. After these traditional agamic cleansing rituals, the devotees will be allowed for darshan 

Sri PAT – closing: 9pm(25-12-19), Opening: 12 pm (26-12-19), Darshan: 3.15 pm.

Sri GT- closing: 9.30 pm (25-12-19), Opening: 12 pm (26-12-19), Darshan: 2pm.

Sri KRT- closing: 9pm(25-12-19), Opening: 12 pm (26-12-19), Darshan: 2pm.

SKVST- closing 8:30pm (25-12-19), Opening: 12.30pm (26-12-19), Darshan: 3.30pm 

Sri Prasanna Venkageswara temple, Appalayagunta 

Closing 8pm(25-12-19), Opening: 12noon(26-12-19), Darshan: 2pm 

ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI

సూర్య గ్రహణం కారణంగా రాత్రి 11 గంట‌ల‌కు టిటిడి స్థానిక ఆలయాల  మూత  

తిరుపతి, 2019 డిసెంబ‌రు 25: సూర్య‌గ్రహణం కారణంగా డిసెంబ‌రు 25వ తేదీన బుధవారం రాత్రి 11.00 గంట‌ల‌కు టిటిడి అనుబంధ ఆలయాలైన తిరుచానూరులోని శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయం, తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయం, శ్రీ కోదండరామస్వామివారి ఆలయం, శ్రీనివాసమంగాపురంలోని శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి ఆలయం, అప్పలాయగుంటలోని శ్రీ ప్రసన్న వేంకటేశ్వరస్వామివారి ఆలయాలను మూసివేస్తారు.

గురువారం ఉదయం 8.08 గంట‌ల నుండి ఉదయం 11.16 గంట‌ల వరకు సూర్యగ్రహణం పూర్తవుతుంది. గ్రహణ సమయానికి 6 గంటలు ముందుగా ఆలయం తలుపులు మూసివేయడం ఆనవాయితీగా వస్తోంది. ఆలయశుద్ధి అనంత‌రం భ‌క్తుల‌కు స‌ర్వ‌ద‌ర్శ‌నం ప్రారంభ‌మ‌వుతుంది.

తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో

తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో బుధ‌వారం రాత్రి 9.00 గంటల నుంచి  డిసెంబ‌రు 26వ తేదీ గురువారం మ‌ధ్యాహ్నం 12.00 గంటల వరకు శ్రీపద్మావతి అమ్మవారి ఆలయం తలుపులు మూసివేస్తారు. ఆనంత‌రం మ‌ధ్యాహ్నం 3.15 గంట‌ల నుండి భ‌క్తుల‌ను అమ్మ‌వారి ద‌ర్శ‌నానికి అనుమ‌తిస్తారు.

తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో

తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో రాత్రి  9.00 గంటల నుంచి గురువారం మ‌ధ్యాహ్నం 12.000  గంటల వరకు ఆలయం తలుపులు మూసివేస్తారు. ఆనంత‌రం మ‌ధ్యాహ్నం 2.00 గంట‌ల నుండి భ‌క్తుల‌ను స్వామివారి ద‌ర్శ‌నానికి అనుమ‌తిస్తారు.

తిరుపతిలోని శ్రీ కోదండరామస్వామివారి ఆలయంలో

తిరుపతిలోని శ్రీ కోదండరామస్వామివారి ఆలయంలో రాత్రి  9.00 గంటల నుంచి గురువారం మ‌ధ్యాహ్నం 12.000  గంటల వరకు ఆలయం తలుపులు మూసివేస్తారు. ఆనంత‌రం మ‌ధ్యాహ్నం 2.00 గంట‌ల నుండి భ‌క్తుల‌ను స్వామివారి ద‌ర్శ‌నానికి అనుమ‌తిస్తారు.

శ్రీనివాసమంగాపురంలోని శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో

శ్రీనివాసమంగాపురంలోని శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో రాత్రి  8.30 గంటల నుంచి గురువారం మ‌ధ్యాహ్నం 12.000  గంటల వరకు ఆలయం తలుపులు మూసివేస్తారు. ఆనంత‌రం మ‌ధ్యాహ్నం 3.30 గంట‌ల నుండి భ‌క్తుల‌ను స్వామివారి ద‌ర్శ‌నానికి అనుమ‌తిస్తారు.

అప్పలాయగుంటలోని శ్రీ ప్రసన్న వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో

అప్పలాయగుంటలోని శ్రీ ప్రసన్న వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో  రాత్రి  8.00 గంటల నుంచి గురువారం మ‌ధ్యాహ్నం 12.00  గంటల వరకు ఆలయం తలుపులు మూసివేస్తారు. ఆనంత‌రం మ‌ధ్యాహ్నం 2.00 గంట‌ల నుండి భ‌క్తుల‌ను స్వామివారి ద‌ర్శ‌నానికి అనుమ‌తిస్తారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.