“DOSHA NIVARANOTSAVAM” OFF TO A COLOURFUL START IN TIRUMALA TEMPLE_ శ్రీవారి ఆలయంలో ఘనంగా పవిత్రోత్సవాలు ప్రారంభం

Tirumala, 3 August 2017: The annual Sin-free festival or Dosha Nivaranotsavam which is popularly known as Pavitrotsavams is off to a colourful start in Tirumala temple on Thursday.

The Snapana Tirumanjanam was performed between 9am to 11am to the utsava murthies in Sampangi Prakaram.

Later in the evening Visesha Samarpana was rendered to utsava murthies. This was followed by the celestial procession of the utsava murthies along the four-mada streets.

Meanwhile TTD has cancelled Tiruppavada, Kalyanotsavam, Unjal Seva, Arjitha Brahmotsavam, Vasanthotsavam and Sahasra Deepalankara Seva in connection with this festival.

TTD EO Sri AK Singhal, Tirumala JEO Sri KS Sreenivasa Raju, Deputy EO Sri Kodanda Rama Rao were also present.


ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER, TTDs, TIRUPATI

శ్రీవారి ఆలయంలో ఘనంగా పవిత్రోత్సవాలు ప్రారంభం

తిరుమల, 03 ఆగస్టు 2017: తిరుమల శ్రీవారి ఆలయంలో సాలకట్ల పవిత్రోత్సవాలు గురువారం ఘనంగా ప్రారంభమయ్యాయి. మొదటిరోజు శాస్త్రోక్తంగా పవిత్ర ప్రతిష్ట నిర్వహించారు.

ఈ సందర్భంగా ఉదయం శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ మలయప్పస్వామివారిని పవిత్ర మండపంలోని యాగశాలకు వేంచేపుచేశారు. అక్కడ హోమాలు తదితర వైదిక కార్యక్రమాలు చేపట్టారు. ఉదయం 9 నుంచి 11 గంటల వరకు సంపంగి ప్రాకారంలో వేడుకగా స్నపన తిరుమంజనం నిర్వహించారు. ఇందులో పాలు, పెరుగు, తేనె, చందనం, పసుపు తదితర సుంగంధద్రవ్యాలతో విశేషంగా అభిషేకం చేశారు. సాయంత్రం 4 గంటలకు స్వామి, అమ్మవార్లకు విశేష సమర్పణ చేశారు.

సాయంత్రం 6 నుంచి 8 గంటల వరకు శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ మలయప్పస్వామివారు ఆలయ నాలుగు మాడ వీధుల్లో ఊరేగి భక్తులకు దర్శనమివ్వనున్నారు. ఈ సందర్భంగా ప్రత్యేక ఆభరణాలతో సళ్లింపు నిర్వహిస్తారు. రాత్రి 8 నుంచి 11 గంటల వరకు యాగశాలలో వైదిక కార్యక్రమాలు జరుగనున్నాయి. పవిత్రోత్సవాల కారణంగా తిరుప్పావడ సేవ, కల్యాణోత్సవం, ఊంజల్‌సేవ, బ్రహ్మూెత్సవం, వసంతోత్సవం, సహస్రదీపాలంకారసేవలు రద్దయ్యాయి.

ఈ కార్యక్రమంలో టిటిడి ఈవో శ్రీ అనిల్‌కుమార్‌ సింఘాల్‌, జెఈవో శ్రీకె.ఎస్‌.శ్రీనివాసరాజు, శ్రీవారి ఆలయ డెప్యూటీ ఈవో శ్రీ కోదండరామారావు, పేష్కార్‌ శ్రీ రమేష్‌బాబు ఇతర అధికారులు పాల్గొన్నారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.