TTD EO INSPECTS ALONG WITH JEO AND CVSO IN TIRUMALA_ సెంట్రల్‌ కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌ను పరిశీలించిన టిటిడి ఈవో, జెఈవో

“VIDEO WALL” TO BE SET UP

Tirumala, 3 August 2017: In view of ensuing annual brahmotsavams of Lord Venkateswara Swamy, TTD EO Sri Anil Kumar Singhal along with Tirumala JEO Sri KS Sreenivasa Raju and CVSO Sri A Ravikrishna inspected various places at Tirumala on Thursday to monitor the ongoing arrangements.

The EO inspected Akshaya Hall, where the Annaprasadams are being prepared located opposite SV Museum. The EO also inspected the aged people token counter and verified the functioning of the counter.

Inspecting the Common Command Control Centre in PAC IV the EO instructed the concerned to renovate the structure in such a way to provide enhanced security cover to Tirumala. As a part of a proposal to construct a “Video Wall” has also come up which will have integrated network of all CC cameras erected in Tirumala from one point.

SE II Sri Ramachandra Reddy, VGO Sri Ravindra Reddy and other officers were also present.


ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER, TTDs, TIRUPATI

సెంట్రల్‌ కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌ను పరిశీలించిన టిటిడి ఈవో, జెఈవో

తిరుమల, 03 ఆగస్టు 2017: తిరుమలలోని పిఏసి-4లో గల సెంట్రల్‌ కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌ను టిటిడి ఈవో శ్రీఅనిల్‌కుమార్‌ సింఘాల్‌ గురువారం తిరుమల జెఈవో శ్రీ కె.ఎస్‌.శ్రీనివాసరాజుతో కలిసి పరిశీలించారు. అక్కడి సిసి కెమెరా వ్యవస్థపై సివిఎస్‌వో శ్రీ ఎ.రవికృష్ణ ఈ సందర్భంగా ఈవో, జెఈవోలకు వివరించారు.

అనంతరం పిఏసి-4లో గల లగేజి డిపాజిట్‌ కేంద్రాన్ని ఈవో తనిఖీ చేశారు. భక్తులకు ఆలస్యం కాకుండా లగేజి, సెల్‌ఫోన్లు అందించాలని అక్కడి సిబ్బందికి సూచించారు. ఆ తరువాత మ్యూజియం ఎదురుగా గల వృద్ధులు, దివ్యాంగుల టోకెన్‌ జారీ కేంద్రాన్ని పరిశీలించారు. వృద్ధులు, దివ్యాంగులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేపట్టాలని అక్కడి అధికారులను ఆదేశించారు. పక్కనే ఉన్న వంటశాలను పరిశీలించారు. బ్రహ్మూెత్సవాల సమయంలో ఎంపిక చేసిన ప్రాంతాల్లోని భక్తులకు ఈ వంటశాల నుంచి అన్నప్రసాదాల పంపిణీకి చర్యలు చేపట్టాలన్నారు.

ఈవో వెంట టిటిడి ఎస్‌ఇ-2 శ్రీ రామచంద్రారెడ్డి, శ్రీవారి ఆలయ డెప్యూటీ ఈవో శ్రీకోదండరామారావు, విజిఓ శ్రీ రవీంద్రారెడ్డి ఇతర అధికారులు ఉన్నారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.