DyCM OFFERS VASTRAMS _ శ్రీ పద్మావతి అమ్మవారికి రాష్ట్ర ప్రభుత్వం తరఫున పట్టు వస్త్రాలు సమర్పించిన ఉప ముఖ్యమంత్రి శ్రీ నారాయణ స్వామి

TIRUPATI, 20 NOVEMBER 2022: The DyCM of AP Sri Narayana Swami offered silk vastrams to Sri Padmavathi Ammavaru in Tiruchanoor on Sunday on behalf of the State Government of Andhra Pradesh on the occasion of the ongoing annual Karthika Brahmotsavams.

Speaking on the occasion, the DyCM said, he thanked the divine almighty and AP CM Sri YS Jaganmohan Reddy for providing him the opportunity and privilege to offer pattu vastrams. He appreciated TTD for making elaborate arrangements to the devotees for annual fete and prayed Goddess Sri Padmavathi Devi to bestow Her blessings on the entire humanity to lead a happy and prosperous life.

Earlier on his arrival, the DyCM was received by TTD JEO Sri Veerabrahmam and later had darshan of Sri Padmavathi Ammavaru.

DyEO Sri Lokanatham, AEO Sri Prabhakar Reddy and others were present.

ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI

శ్రీ పద్మావతి అమ్మవారికి రాష్ట్ర ప్రభుత్వం తరఫున పట్టు వస్త్రాలు సమర్పించిన ఉప ముఖ్యమంత్రి శ్రీ నారాయణ స్వామి

తిరుప‌తి, 2022 న‌వంబ‌రు 20: తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని ఆదివారం మ‌ధ్యాహ్నం రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఉప ముఖ్యమంత్రి శ్రీ నారాయణస్వామి పట్టువస్త్రాలు సమర్పించారు. ఆలయానికి చేరుకున్న ఉప ముఖ్యమంత్రికి టిటిడి జెఈవో శ్రీ వీర‌బ్ర‌హ్మం, ఆలయ అర్చకులు, అధికారులు సంప్రదాయబద్ధంగా స్వాగతం పలికారు. అమ్మవారి దర్శనానంతరం ప్రసాదాలు అందజేశారు.

అనంతరం గౌ|| ఉప ముఖ్య‌మంత్రి మీడియాతో మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం తరఫున అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించడం తన పూర్వ‌జ‌న్మ సుకృతంగా భావిస్తున్నట్టు చెప్పారు. ఈ అవకాశం కల్పించిన ముఖ్యమంత్రి గౌ. శ్రీ వైఎస్.జగన్ మోహన్ రెడ్డికి కృతజ్ఞతలు తెలియజేశారు. అమ్మవారి దర్శనానికి విచ్చేసే భక్తులకు టిటిడి విస్తృత ఏర్పాట్లు చేసిందన్నారు. రాష్ట్రం సస్యశ్యామలంగా ఉండాలని, రాష్ట్ర ప్రజలు సుఖసంతోషాలతో ఉండాలని అమ్మవారిని ప్రార్థించినట్టు తెలిపారు.

ఈ కార్యక్రమంలో ఆలయ డెప్యూటీ ఈవో శ్రీ లోకనాథం ఏఈవో శ్రీ ప్ర‌భాక‌ర్ రెడ్డి, ఆల‌య అర్చ‌కులు శ్రీ బాబు స్వామి, ఆర్జితం ఇన్స్పెక్టర్ శ్రీ దాము, ఇతర అధికారులు పాల్గొన్నారు.

టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.