GOPALA KRISHNA ON CHINNA SESHA VAHANAM _ చిన్నశేష వాహనంపై శ్రీ గోపాల కృష్ణుడి అలంకారంలో శ్రీ ప‌ద్మావ‌తి అమ్మ‌వారి అభ‌యం

TIRUPATI, 20 NOVEMBER 2022: As a part of the ongoing annual Bramhotsavam in Tiruchanur on Sunday evening, Sri Padmavathi Devi in the guise of Sri Gopalakrishna Alankaram took a celestial ride on Chinna Sesha vahanam.

Devotees took the pot with religious ecstasy to witness the goddess on the first Vahana Seva during the ongoing nine-day bramhotsavam.

HH Sri Tirumala Pedda Jeeyar, HH Sri Tirumala Chinna Jeeyar, TTD Board member Sri P Ashok Kumar, JEO Sri Veerabrahmam, DyEO Sri Lokanatham, VGOs Sri Manohar, Sri Bali Reddy, AEO Sri Prabhakar Reddy, and others participated.

ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI

చిన్నశేష వాహనంపై శ్రీ గోపాల కృష్ణుడి అలంకారంలో శ్రీ ప‌ద్మావ‌తి అమ్మ‌వారి అభ‌యం

 తిరుపతి, 2022 న‌వంబ‌రు 20 ; తిరుచానూరు శ్రీ ప‌ద్మావ‌తి అమ్మ‌వారి కార్తీక బ్రహ్మోత్సవాల మొదటిరోజైన ఆదివారం రాత్రి శ్రీ పద్మావతి అమ్మవారు శ్రీ గోపాల కృష్ణుడి అలంకారంలో పిల్లనగ్రోవి ధరించి చిన్న‌శేష‌వాహ‌నంపై అభ‌య‌మిచ్చారు. రాత్రి 7 గంటల నుంచి అమ్మవారు నాలుగు మాడ వీధుల్లో విహరించి భక్తులకు దర్శనభాగ్యం కల్పించారు. వాహనం ముందు గజరాజులు నడుస్తుండగా, భక్తజన బృందాలు చెక్కభజనలు, కోలాటాలు , మంగళవాయిద్యాల నడుమ వాహనసేవ కోలాహలంగా జరిగింది. భక్తులు అడుగడుగునా కర్పూరహారతులు సమర్పించి అమ్మవారిని దర్శించుకున్నారు.

మొదటి వాహనం చిన్నశేషుడు. చిన్నశేష వాహనంపై అమ్మవారు జీవకోటిని ఉద్ధరించే లోకమాతగా దర్శనమిచ్చారు . శేషభూతమైన

ఈ ప్రపంచం సిరులతల్లి రక్షణలో సుఖాన్ని పొందుతోంది. ఈ వాహనంపై అమ్మవారి ద‌ర్శ‌నం వ‌ల్ల యోగసిద్ధి చేకూరుతుందని భక్తుల విశ్వాసం.

వాహనసేవలో శ్రీశ్రీశ్రీ పెద్దజీయ‌ర్ స్వామి, శ్రీశ్రీశ్రీ చిన్నజీయ‌ర్ స్వామి, టీటీడీ బోర్డు సభ్యులు శ్రీ పోకల అశోక్ కుమార్, జెఈవో శ్రీ వీర‌బ్ర‌హ్మం దంప‌తులు, ఆలయ డెప్యూటీ ఈవో శ్రీ‌ లోకనాథం, విజివోలు శ్రీ మనోహర్, శ్రీ బాల్ రెడ్డి, ఏఈవో శ్రీ ప్ర‌భాక‌ర్ రెడ్డి, ఆల‌య అర్చ‌కులు శ్రీ బాబుస్వామి, సూపరింటెండెంట్‌ శ్రీ మధు ఆర్జితం ఇన్స్పెక్టర్ శ్రీ దాము పాల్గొన్నారు.

టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.