EFFECTIVE ARRANGEMENTS FOR CHAKRASNANAM- CVSO _ చ‌క్ర‌స్నానానికి ప‌టిష్ట భ‌ద్ర‌తా ఏర్పాట్లు

DEVOTEES URGED TO COOPERATE IN HOLY BATHING

 

HOLINESS OF PUSHKARINI WATERS THROUGH DAY

 

Tirumala, 4, October 2022: TTD CVSO Sri Narasimha Kishore said on Tuesday that Srivari Brahmotsavam was 80% complete and TTD had made effective arrangements for the concluding fete of holy Chakra Snanam as well with which the annual fete culminates.

 

Addressing reporters at the Media Center in Rambagicha 2 Rest House, the CVSO said the Chakra Snanam fete would be held between 6am and 9am on Wednesday.

 

He said arrangements were made for devotees to take holy dip in Swamy Pushkarini. About forty swimmers, Two boats, 100 APF, and vigilance staff will be present to ensure safety and peaceful bathing for devotees.

 

He said arrangements were made for the entry of TTD employees, police, and media on North Mada street while common devotees would be allowed through East, West and Southern gates.

 

He appealed to devotees to make way for other devotees to take a holy dip.TTD has made arrangements of temporary change rooms for devotees to change dress after bathing in Pushkarini.

 

Commenting about Brahmotsavam arrangements he said the luggage counters at Srivari Seva Sadan were very convenient for devotees.

 

DEVOTEES EXPRESSED HAPPINESS

 

The CVSO said the conduction of Srivari Brahmotsavam was a rich experience with devotional flair and the devotees expressed happiness with TTD arrangements.

 

He attributed the successful experience of special lines in three corners of Mada streets which enabled Garuda Vahana Darshan to more devotees to TTD EO Sri AV Dharma Reddy. He also said that all the departments especially Srivari Seva volunteers had made coordinated efforts for ensuing hassle-free Brahmotsavam experience for devotees.

 

VGO Sri Bali Reddy, TTD PRO Dr. Ravi, APRO Kumari Neelima and AVSO Sri Surendra were present.

 
 
 
ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI
 

2022 శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు

చ‌క్ర‌స్నానానికి ప‌టిష్ట భ‌ద్ర‌తా ఏర్పాట్లు

– పుష్క‌రిణిలో రోజంతా ప‌విత్ర‌త

– భ‌క్తులు సంయ‌మ‌నంతో స్నానం చేయాలి

– మీడియా స‌మావేశంలో టిటిడి సివిఎస్వో శ్రీ న‌ర‌సింహ కిషోర్‌

తిరుమల, 2022 అక్టోబరు 04: శ్రీ‌వారి సాల‌క‌ట్ల బ్ర‌హ్మోత్స‌వాలు 80 శాతం ముగిశాయ‌ని, బుధ‌వారం జ‌రుగ‌నున్న ప్ర‌ధాన ఘ‌ట్ట‌మైన చ‌క్ర‌స్నానానికి విజిలెన్స్‌, పోలీసు స‌మ‌న్వ‌యంతో ప‌టిష్ట భ‌ద్ర‌తా ఏర్పాట్లు చేప‌ట్టామ‌ని టిటిడి సివిఎస్వో శ్రీ న‌ర‌సింహ కిషోర్ తెలిపారు.

తిరుమ‌ల రాంభ‌గీచా -2లోని మీడియా సెంట‌ర్‌లో మంగ‌ళ‌వారం ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ బుధ‌వారం ఉదయం 6 నుంచి 9 గంటల నడుమ శ్రీ భూవరాహస్వామి ఆలయ ముఖ మండపంలో శ్రీదేవి, భూదేవి సమేత శ్రీమలయప్పస్వామివారికి, శ్రీ సుదర్శన చక్రత్తాళ్వార్లకు స్నపనతిరుమంజనం, చ‌క్ర‌స్నానం జ‌రుగుతాయ‌ని చెప్పారు. ఇందుకోసం భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పుష్కరిణిలో గ్యాలరీలు, స్నానఘట్టాలు ఏర్పాటుచేశామ‌న్నారు. భ‌ద్ర‌తాప‌రంగా ఇబ్బందులు లేకుండా టిటిడి భ‌ద్ర‌తా సిబ్బందితోపాటు 100 మంది ఎస్‌పిఎఫ్ సిబ్బంది, 40 మంది ఈత‌గాళ్లు అందుబాటులో ఉంటార‌ని చెప్పారు. చక్రస్నానం ప‌విత్ర‌త రోజంతా ఉంటుంద‌ని, భ‌క్తులు సంయమనం పాటించి పుష్కరిణిలో స్నానం చేయాల‌ని కోరారు.

పుష్క‌రిణి తూర్పు, ప‌డ‌మ‌ర‌, ద‌క్షిణ గేట్ల ద్వారా సామాన్య భ‌క్తులు ప్ర‌వేశించేందుకు అవ‌కాశం క‌ల్పిస్తామ‌ని, ఉత్త‌రం వైపు గ‌ల గేట్ల ద్వారా టిటిడి ఉద్యోగులు, పోలీసులు, మీడియా ప్ర‌తినిధులను లోనికి పంపుతామ‌ని చెప్పారు. భ‌క్తులు స్నానం చేసిన త‌రువాత వెలుప‌లికి వెళ్లి ఇత‌ర భ‌క్తుల‌కు అవ‌కాశం క‌ల్పించాల‌ని కోరారు. భ‌క్తులు దుస్తులు మార్చుకునేందుకు ఏర్పాట్లు చేశామ‌న్నారు. శ్రీ‌వారి సేవా స‌ద‌న్ వ‌ద్ద ఏర్పాటుచేసిన అద‌న‌పు ల‌గేజి కౌంట‌ర్లు భ‌క్తుల‌కు ఎంతో సౌక‌ర్య‌వంతంగా ఉన్నాయ‌ని చెప్పారు.

ఇది గొప్ప అనుభ‌వం

శ్రీ‌వారి బ్ర‌హ్మోత్స‌వాల్లో విధులు నిర్వ‌హించ‌డం గొప్ప అనుభ‌వ‌మ‌ని, త‌న‌కు ఎంతో ఆధ్యాత్మిక అనుభూతి క‌లిగింద‌ని సివిఎస్వో చెప్పారు. టిటిడి ఏర్పాట్ల‌పై భ‌క్తులు పూర్తి సంతృప్తి వ్య‌క్తం చేశార‌ని తెలిపారు. మూల‌మూర్తి ద‌ర్శ‌నంతోపాటు వాహ‌న‌సేవ‌ల వైభ‌వాన్ని భ‌క్తుల‌కు అందించేందుకు అన్ని విభాగాలు స‌మ‌న్వ‌యంతో ప‌నిచేశాయ‌ని, మీడియా స‌హ‌కారం మ‌రువ‌లేనిద‌ని చెప్పారు. చిన్న చిన్న లోటుపాట్లను రానున్న బ్ర‌హ్మోత్స‌వాల‌కు స‌రి చేసుకుంటామ‌న్నారు.

మీడియా స‌మావేశంలో విజివో శ్రీ బాలిరెడ్డి, టిటిడి ప్ర‌జాసంబంధాల అధికారి డా.టి.ర‌వి, స‌హాయ ప్ర‌జాసంబంధాల అధికారి కుమారి పి.నీలిమ, ఎవిఎస్వో శ్రీ సురేంద్ర‌ పాల్గొన్నారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.