SPECIAL QUEUE LINES ON G-DAY FOR THE FIRST TIME WON LAURELS  _ గ‌రుడ సేవ నాడు 3 ల‌క్ష‌ల మందికి ద‌ర్శ‌నం

Rs.6.50cr CIVIL AND ELECTRICAL ARRANGEMENTS FOR BRAHMOTSAVAMS-TTD CE

GERMAN SHEDS LAID TO HOUSE PILGRIMS 

Tirumala, 04 October 2022: TTD Chief Engineer, Sri Nageswara Rao said on Tuesday that TTD has operated special queue lines at three corners of four Mada streets providing darshan to nearly 15000 stranded pilgrims on Garuda Vahana Seva day for the first time on trial basis, which has won appreciation from devotees.

Addressing reporters at the Media center in  Rambagicha Rest House-2 the TTD CE said a total of 3 lakh devotees had a hassle-free Garuda Seva darshan this year. “Usually the holding capacity of all galleries is 2lakhs and with the innovative idea mulled by our Executive Officer Sri AV Dharma Reddy, we laid these special lines and enabled darshan for more number of pilgrims than usual”, he added.

Adding further, the CE said, an additional 5,000 devotees were provided accommodation in the German sheds which were laid at seven places in Tirumala along with toilets and drinking water facilities.

Among others, he said an additional parking for 2000 vehicles, additional 3 luggage counters at Srivari Seva Sadan have also enabled ease for parking and accommodation facilities to the visiting pilgrims. A total of 295 lakh gallons of water has been utilized by devotees in the last 7 days at over 40 lakh gallons per day, he maintained.

He said 20 small electrical cutouts, eight LED screens on Mada streets have been erected and the total cost for Civil and Electrical works was nearly ₹6.50 crore. All cultural teams were housed at Dharmagiri Veda Vignana Peetham while the police were accommodated at Octopus Bhavan. The vehicle parking was arranged at Bharathiya Vidya Bhavan and Devlok premises.

TTD SE-2 Sri Jagadeeshwar Reddy, EEs Sri Srihari, Sri Jaganmohan Reddy, Sri Surendra Reddy, DE Sri Ravi Shankar Reddy, TTD PRO Dr T Ravi were present.

ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI
 

2022 శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు

గ‌రుడ సేవ నాడు 3 ల‌క్ష‌ల మందికి ద‌ర్శ‌నం

– మాడ వీధుల్లో ప్ర‌త్యేక క్యూలైన్లు

– 5 వేల మందికి స‌రిప‌డా 7 జ‌ర్మ‌న్ షెడ్లు

– 20 ప్ర‌దేశాల్లో చిన్న విద్యుత్ క‌టౌట్లు

– మీడియా స‌మావేశంలో టిటిడి చీఫ్ ఇంజినీర్ శ్రీ నాగేశ్వ‌ర‌రావు

తిరుమల, 2022 అక్టోబరు 04: శ్రీవారి ఆల‌య మాడ వీధుల్లో ఈసారి ప్ర‌త్యేకంగా క్యూలైన్లు ఏర్పాటుచేసి మూడు ల‌క్ష‌ల మంది భ‌క్తులకు గ‌రుడ‌సేవ ద‌ర్శ‌నం చేయించామ‌ని టిటిడి చీఫ్ ఇంజినీర్ శ్రీ నాగేశ్వ‌ర‌రావు తెలిపారు. తిరుమ‌ల రాంభ‌గీచా -2లోని మీడియా సెంట‌ర్‌లో మంగ‌ళ‌వారం ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ గ‌రుడ‌సేవ నాడు భ‌క్తుల ర‌ద్దీని దృష్టిలో ఉంచుకుని ముంద‌స్తుగా దాదాపు 5 వేల మందికి స‌రిప‌డా వివిధ ప్రాంతాల్లో 7 జ‌ర్మ‌న్ షెడ్లు, వాటికి అనుగుణంగా మ‌రుగుదొడ్లు, తాగునీటి సౌక‌ర్యం క‌ల్పించామ‌ని తెలిపారు.

ప్ర‌స్తుతం ఉన్న‌వాటితోపాటు బాలాజి న‌గ‌ర్‌, సూరాపురంతోట‌, పాత డిపిడ‌బ్ల్యు స్టోర్స్‌, మ్యూజియం వెనుక వైపు క‌లిపి దాదాపు 2 వేల వాహ‌నాల‌కు స‌రిప‌డా అదనంగా పార్కింగ్ ఏర్పాట్లు చేశామ‌న్నారు. భ‌క్తుల‌ సౌక‌ర్యార్థం శ్రీ‌వారి సేవా స‌ద‌న్ వ‌ద్ద అదనంగా మూడు ల‌గేజి కౌంట‌ర్లు ఏర్పాటు చేసిన‌ట్టు చెప్పారు. సాధార‌ణ రోజుల్లో రోజుకు నీటి వినియోగం 30 ల‌క్ష‌ల గ్యాల‌న్లు కాగా, బ్ర‌హ్మోత్స‌వాల రోజుల్లో 40 ల‌క్ష‌ల గ్యాల‌న్ల‌కు చేరింద‌న్నారు. ఏడు రోజుల‌కు గాను 295 ల‌క్ష‌ల గ్యాల‌న్ల నీటి వినియోగం జ‌రిగింద‌న్నారు.

తిరుమ‌ల‌లోని వివిధ ప్రాంతాల్లో 20 చిన్న విద్యుత్ క‌టౌట్లు, మాడ వీధుల్లో 8 ఎల్ఇడి స్క్రీన్లు ఏర్పాటు చేశామ‌న్నారు. బ్ర‌హ్మోత్స‌వాల్లో సివిల్‌, ఎల‌క్ట్రిక‌ల్ ప‌నులు క‌లిపి రూ.6.50 కోట్ల వ్య‌యం చేసిన‌ట్టు తెలిపారు. సాధార‌ణ భ‌క్తుల‌కు ఇబ్బంది లేకుండా క‌ళాబృందాల‌కు ధ‌ర్మ‌గిరి వేద పాఠ‌శాల‌లో, పోలీసుల‌కు ఆక్టోప‌స్ భ‌వ‌నంలో వ‌స‌తి క‌ల్పించిన‌ట్టు తెలిపారు. గ‌రుడ సేవ కోసం తిరుప‌తిలోని దేవ్‌లోక్‌, భార‌తీయ విద్యాభ‌వ‌న్, ద్విచ‌క్ర వాహ‌నాల కోసం అలిపిరి వ‌ద్ద పార్కింగ్ ఏర్పాట్లు చేశామ‌న్నారు.

మీడియా స‌మావేశంలో ఎస్ఇ-2 శ్రీ జ‌గ‌దీశ్వ‌ర్‌రెడ్డి, ఇఇలు శ్రీ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి, శ్రీ శ్రీ‌హ‌రి, శ్రీ సురేంద్ర‌రెడ్డి, డిఇ శ్రీ ర‌విశంక‌ర్‌రెడ్డి, టిటిడి ప్ర‌జాసంబంధాల అధికారి డా.టి.ర‌వి, స‌హాయ ప్ర‌జాసంబంధాల అధికారి కుమారి పి.నీలిమ పాల్గొన్నారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.