SRINIVASA KALYANAM CASTS MAGICAL SPELL _ భక్తిరస భరితంగా శ్రీనివాస కళ్యాణం నాటకం

TIRUPATI, 04 OCTOBER 2022: As a part of the ongoing annual Brahmotsavams in Tirumala, the HDPP wing has organized Srinivasa Kalyanam in Mahati Auditorium which enthralled the spectators.

The dance ballet was performed by the Hyderabad-based Surabhi Arts Sri Vinayaka Natya Mandali.

Art lovers in Tirupati participated in the program.

ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

 

భక్తిరస భరితంగా  శ్రీనివాస కళ్యాణం  నాటకం
 
తిరుపతి  04 అక్టోబరు 2022 ; శ్రీవారి  బ్రహ్మోత్సవాల సందర్భంగా  మంగళవారం రాత్రి మహతి కళాక్షేత్రంలో  హైదరాబాద్ కు చెందిన సురభి ఆర్ట్స్ శ్రీ వినాయక నాట్య  మండలి శ్రీనివాస కల్యాణం పౌరాణిక నాటకం అద్భుతంగా ప్రదర్శించింది .

 

 
శ్రీ ఆర్.వేణుగోపాల్ బృందం 45 మంది మంది కళాకారులతో  నిర్వహించిన ప్రదర్శన ఆద్యంతం సభాసదులను భక్తిరస సాగరంలో ఓలలాడించింది .తిరుపతి పుర ప్రముఖులు, అధికారులు,  పెద్ద సంఖ్యలో ప్రేక్షకులు పాల్గొన్నారు. 

 

అలాగే అన్నమాచార్య కళా మందిరంలో  బెంగుళూరుకు చెందిన కుమారి  ఐశ్వర్య మహేష్ బృందం భక్తి సంగీత గానం భక్తులను ఆకట్టుకుంది .
       
ఈ కార్య్రమంలో కుమారి ఐశ్వర్య మహేష్ (గాత్రం ) శ్రీ చక్రపాణి (వయొలిన్ ) శ్రీ  బాలసుబ్రమణ్యం (మృదంగం) సహకరించారు.

 

ఈ కార్యక్రమంలో శ్రీ వేంకటేశ్వర సంగీత నృత్య కళాశాల ప్రిన్సిపాల్ శ్రీ తిరుపతి మృదంగ సుధాకర్,  ఎ ఈవో శ్రీ సత్యనారాయణ పాల్గొన్నారు. 
 
రామచంద్ర పుష్కరిణి వేదికలో తిరుపతికి చెందిన శ్రీ శరత్ చంద్ర  బృందం  ప్రదర్శించిన భరత నాట్యం ఆద్యంతం ఆహ్లాదకరంగా సాగింది.         
 
టీటీడీ ప్రజా సంబంధాల అధికారిచే విడుదల చేయడమైనది