EFFICIENT SERVICES TO DEVOTEES AT KALYAN KATTAS _ కల్యాణకట్టల్లో భక్తులకు సత్వర సేవలు

1189 BARBERS ROPED IN FOR SRIVARI BRAHMOTSAVAMS

 

INCLUDES 214 WOMEN BARBERS

 

Tirumala, 11 September 2022: TTD is fully geared up to provide comfortable and quick services to devotees for the ensuing Srivari annual Brahmotsavam with 1189 barbers including 214 lady hair cutters round the clock.

 

Since the celestial fete is set to be held openly with vahana sevas along Mada streets after a gap of 2 years, TTD is anticipating a massive turnout of footfalls and made every arrangements for their convenience.

 

With one main Kalyanakatta and 10 Mini Kalyanakattas, TTD has plans to deploy 1189 barbers that included 337 permanent (336 men and 1 lady barber) and 852 piece rate workers (639 men and 213 women). They operate in 3 shifts with 20 regular maistries, 3 assistants and another 46 supporting staff.

 

Besides the main Kalyana katta there are mini Kalyanakattas at PAC-1, PAC-2, PAC-3, SV rest house and Sri Padmavati rest house that functions on 24×7 basis. The Kalyanakattas at GNC, Nandakam rest house, HVC, Kaustubham and Sapthagiri rest houses work from early morning 3am to 9pm.

 

All Kalyanakattas are provided with solar heater hot water systems for devotees benefit of devotees besides adequate bathroom facilities.

 

TTD also supplies Blades, Dettol, aprons, hand gloves, uniforms, PPE kits and masks besides anti-septic lotions to all barbers to safeguard them against hygiene issues and skin diseases. At all Kalyana Katta the devotees are given free computerized tokens.

 

TTD has also deployed adequate sanitary staff to keep all the halls continuously clean and hygienic.

 

ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

కల్యాణకట్టల్లో భక్తులకు సత్వర సేవలు

– శ్రీ‌వారి బ్ర‌హ్మోత్స‌వాల‌కు అందుబాటులో 1189 మంది క్షురకులు

– వీరిలో 214 మంది మ‌హిళా క్షురకులు

తిరుమల, 2022 సెప్టెంబ‌రు 11: శ్రీవారి సాల‌క‌ట్ల‌ బ్రహ్మోత్సవాల్లో తలనీలాలు సమర్పించేందుకు విచ్చేసే భక్తులకు స‌త్వ‌ర సేవ‌లు అందించేందుకు టిటిడి ఏర్పాట్లు చేప‌ట్టింది. ఎక్క‌డా ఆల‌స్యం లేకుండా మొత్తం 1189 మంది క్షుర‌కులు మూడు షిఫ్టుల్లో భ‌క్తుల‌కు సేవ‌లందించేలా ఏర్పాట్లు చేప‌ట్టారు. వీరిలో 214 మంది మ‌హిళా క్షురకులు ఉన్నారు.

రెండేళ్ల త‌రువాత ఆల‌య మాడ వీధుల్లో వాహ‌న‌సేవ‌లు జ‌రుగ‌నుండ‌డంతో విశేషంగా భ‌క్తులు విచ్చేసే అవ‌కాశ‌ముంద‌ని టిటిడి అంచ‌నా వేస్తోంది. ఇందుకు అనుగుణంగా విస్తృతంగా ఏర్పాట్లు చేప‌డుతోంది.

తిరుమలలో ప్రధాన కల్యాణకట్టతోపాటు 10 మినీ కల్యాణకట్టలు ఉన్నాయి. మొత్తం రెగ్యులర్ క్షురకులు 337 మంది కాగా వీరిలో 336 మంది పురుషులు, ఒక‌ మహిళ ఉన్నారు. మొత్తం పీస్ రేటు క్షుర‌కులు 852 మంది కాగా వీరిలో 639 మంది పురుషులు, 213 మంది మహిళలు ఉన్నారు. మొత్తం 1189 మంది క్షుర‌కులు, ముగ్గురు సూపరింటెండెంట్‌లు, ముగ్గురు అసిస్టెంట్‌లు, 20 మంది రెగ్యులర్ మేస్త్రీలు, 46 మంది సహాయక సిబ్బంది మూడు షిఫ్టుల ద్వారా విధులు నిర్వ‌హిస్తున్నారు.

ప్రధాన క‌ల్యాణ‌క‌ట్ట‌తోపాటు, పిఏసి-1, పిఏసి-2, పిఏసి-3, శ్రీ వేంక‌టేశ్వ‌ర విశ్రాంతి గృహం, శ్రీ ప‌ద్మావ‌తి విశ్రాంతి గృహం వ‌ద్ద‌గ‌ల మినీ క‌ల్యాణ‌క‌ట్ట‌లు 24/7 పని చేస్తున్నాయి. జిఎన్‌సి, నంద‌కం విశ్రాంతి గృహం, హెచ్‌విసి, కౌస్తుభం, స‌ప్త‌గిరి విశ్రాంతి గృహం మినీ కల్యాణకట్టలు ఉదయం 3 నుండి రాత్రి 9 గంటల వరకు పనిచేస్తాయి. వీటిలో సోలార్ వాటర్ హీటర్‌తో వేడినీటి సౌక‌ర్యం ఉంది. యాత్రికులు స్నానం చేయడానికి స్నాన‌పు గ‌దులు అందుబాటులో ఉన్నాయి.

క్షుర‌కుల‌కు బ్లేడ్లు, డెటాల్, అప్రాన్‌లు, హ్యాండ్ గ్లౌజ్‌లు, యూనిఫాం, పిపిఇ కిట్లు, మాస్కులు అందిస్తున్నారు. చర్మ సంబంధిత వ్యాధులు వ్యాప్తి చెందకుండా నిరోధించడానికి యాంటీ సెప్టిక్ లోషన్ వినియోగిస్తున్నారు. అన్ని కళ్యాణకట్టల్లో యాత్రికులకు ఉచితంగా కంప్యూటరైజ్డ్ టోకెన్ అంద‌జేస్తారు. త‌గినంత మంది పారిశుద్ధ్య సిబ్బంది ద్వారా కల్యాణకట్టల్లోని హాళ్లన్నింటినీ నిరంత‌రం ప‌రిశుభ్రంగా ఉంచుతున్నారు.

టిటిడి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.