ENTHRALLING CULTURAL PROGRAMS AT VONTIMITTA BTU _ ఒంటిమిట్టలో ఆక‌ట్టుకుంటున్న ధార్మిక‌, సాంస్కృతిక కార్యక్రమాలు

Vontimitta, 12 April 2022: The cultural, devotional and dharmic programs organised by TTD as part of the ongoing Sri Ramanavami Brahmotsavams of Vontimetta Sri Kodandarama Swamy temple in YSR Kadapa district have been enthralling the devotees.

On Tuesday, the morning began with the dharmic discourse by Sri Virajnananda Swami of Brahmamgari Matham on the theme of Sitayascharitam Mahat.

Later in the evening Bhakti sangeet by renowned artist Smt R Bullemma team from Annamacharya Project of Tirupati is all set to allure the audience.

This devotional musical fiesta will be followed by Harikatha ganam by Smt PM Nagamani in the night.

ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER TTDs, TIRUPATI 

ఒంటిమిట్టలో ఆక‌ట్టుకుంటున్న ధార్మిక‌, సాంస్కృతిక కార్యక్రమాలు

  తిరుపతి, 2022 ఏప్రిల్ 12: ఒంటిమిట్టలోని శ్రీ కోదండరామస్వామివారి ఆలయంలో శ్రీ‌రామ‌న‌వ‌మి బ్ర‌హ్మోత్స‌వాల్లో భాగంగా మంగ‌ళ‌వారం నిర్వ‌హించిన ధార్మిక‌, సాంస్కృతిక కార్యక్రమాలు ఆక‌ట్టుకున్నాయి.

ఇందులో భాగంగా  బ్ర‌హ్మంగారిమ‌ఠానికి చెందిన శ్రీ విర‌జానంద‌స్వామి సీతాయాశ్చ‌రితం మ‌హ‌త్ అనే అంశంపై ధార్మికోప‌న్యాసం ఇచ్చారు. సాయంత్రం సాయంత్రం 5 నుండి రాత్రి 7 గంట‌ల వ‌ర‌కు తిరుప‌తికి చెందిన శ్రీ‌మ‌తి ఆర్‌.బుల్లెమ్మ బృందం భ‌క్తి సంగీత కార్య‌క్ర‌మం జ‌రుగ‌నుంది. ఆ త‌రువాత రాత్రి 7 నుండి 9 గంట‌ల వ‌ర‌కు తిరుప‌తికి చెందిన శ్రీ‌మ‌తి పిఎం.నాగ‌మ‌ణి బృందం హ‌రిక‌థాగానం చేస్తారు.

టి.టి.డి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.