KODANDARAMA RIDES SIMHA VAHANA AT VONTIMITTA _ సింహ వాహనంపై ఒంటిమిట్ట కోదండరాముడు

Vontimitta, 12 April 2022: As part of the ongoing annual Brahmotsavam of Sri Kodandarama Swamy temple at Vontimitta in YSR Kadapa district on the third day evening, Sri Kodandarama rode on Simha vahana on Tuesday night.

The fete was marked by the bhajan, kolata and Mangala Vaidyam teams as Kodandaramaswami went around the temple in the Mada streets and blessed His devotees.

The devotees offered harati, dry fruits and flowers all along with the Vahana Seva.

Lion is often considered as an icon of braveness, towering domination and its commanding status.

By riding such a vahana Sri Kodandarama sent a signal that the victory over sluggishness and His commitment and dedication to eliminate evil forces.

DyEO Dr Ramana Prasad, AEO Sri Subramaniam, Superintendent Sri Venkateshaiah, temple inspector Sri R Dhananjay were also present.

ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER TTDs, TIRUPATI 

సింహ వాహనంపై ఒంటిమిట్ట కోదండరాముడు

ఒంటిమిట్ట‌, 2022 ఏప్రిల్ 12: ఒంటిమిట్టలోని శ్రీ కోదండరామస్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా మూడో రోజు మంగ‌ళ‌వారం రాత్రి 8 గంట‌ల‌కు సింహ వాహ‌నంపై స్వామివారు ద‌ర్శ‌న‌మిచ్చారు. రాత్రి 8 గంటలకు వాహనసేవ ప్రారంభమైంది. రాత్రి 9.30 గంటల వరకు వాహనసేవ జరుగనుంది. భక్తజన బృందాలు చెక్కభజనలు, కోలాటాలతో స్వామివారిని కీర్తిస్తుండగా, మంగళవాయిద్యాల నడుమ స్వామివారి ఊరేగింపు కోలాహలంగా జరిగింది. భక్తులు అడుగడుగునా కర్పూరహారతులు సమర్పించి స్వామివారిని దర్శించుకున్నారు.

సింహం పరాక్రమానికి, ధైర్యానికి, తేజస్సుకు, ఆధిపత్యానికి, మహాధ్వనికి సంకేతం. ఉదయం నిద్ర లేవగానే దర్శించే వస్తువుల్లో ‘సింహదర్శనం’ అతి ముఖ్యమయింది. సింహ రూప దర్శనంతో పైన పేర్కొన్న శక్తులన్నీ చైతన్యమవుతాయి. సోమరితనం నశించి పట్టుదలతో ప్రవర్తించి సర్వత్రా విజయులమై ఆధిపత్యంతో రాణించే స్ఫూర్తి సిద్ధిస్తుంది. అజ్ఞానంతో ప్రవర్తించే దుష్టులను హరించడంలో నేను, నా వాహనమైన సింహమూ సమాన ప్రయత్నంతో ఉంటామని ఈ సింహ వాహనోత్సవం ద్వారా స్వామివారు నిరూపిస్తున్నారు.

ఈ కార్యక్రమంలో డెప్యూటీ ఈఓ డా. రమణప్రసాద్, ఏఈఓ శ్రీ సుబ్రహ్మణ్యం, సూపరింటెండెంట్ శ్రీ పి.వెంకటేశయ్య, టెంపుల్ ఇన్స్పెక్టర్ శ్రీ ఆర్.ధనుంజయ తదితరులు పాల్గొన్నారు.

టి.టి.డి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.