EO AIMS AT TASTY FOOD WITH REASONABLE RATES IN TIRUMALA HOTELS _ తిరుమల హోటల్స్‌లో సరసమైన ధరలతో నాణ్యమైన, రుచికరమైన ఆహారాన్ని అందించాలి – టీటీడీ ఈవో జె.శ్యామల రావు
TIRUMALA, 28 JUNE 2024: Providing tasty and hygienic food to the multitude of visiting pilgrims to Tirumala at reasonable prices is the objective of TTD, asserted TTD EO Sri J Syamala Rao.
As a part of the departmental review meeting in Gokulam Rest House at Tirumala on Friday evening, the EO along with JEO Sri Veerabrahmam discussed in detail about the Big and Janata Hotels in Tirumala.
He invited suggestions from Sri Challeswara Rao, Faculty, Indian Culinary Institute and Sri Chowdary, GM, Taj Hotels on how to shortlist the branded hotels to provide best quality food at affordable prices.
Earlier Tirumala Estates Special Officer Sri Mallikharjuna explained about the hotels in Tirumala through a Power Point Presentation.
Annaprasadam DyEO Sri Rajendra, Catering Special Officer Sri Sastry and others were also present.
TTD EO also held review meeting with JIO Team about the various IT services provided in TTD and with Temple staff on Organic Prasadams.
JIO team representatives Sri Moshin Abbas, Sri Vijay Kumar, Sri Manjeet, GM Transport Sri Sesha Reddy, IT Manager Sri Nadamuni, Tirumala temple DyEO Sri Lokanatham and potu workers were present.
ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI
తిరుమల హోటల్స్‌లో సరసమైన ధరలతో నాణ్యమైన, రుచికరమైన ఆహారాన్ని అందించాలి – టీటీడీ ఈవో జె.శ్యామల రావు
తిరుమల, 28 జూన్ 2024: తిరుమలకు విచ్చేసే భక్తులకు మరింత నాణ్యమైన, రుచికరమైన, పరిశుభ్రమైన ఆహారాన్ని సరసమైన ధరలకు అందించడమే టీటీడీ లక్ష్యమని ఈవో శ్రీ జె శ్యామలరావు తెలిపారు. తిరుమలలోని గోకులం విశ్రాంతి భవనంలో శుక్రవారం సాయంత్రం ఈవో, జేఈవో శ్రీ వీరబ్రహ్మంతో కలిసి తిరుమలలోని పెద్ద, జనతా హోటళ్లపై సమీక్షా సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఈవో మాట్లాడుతూ, సరసమైన ధరలకు నాణ్యమైన ఆహారాన్ని అందించడానికి ప్రముఖమైన హోటళ్లతో జాబితా రూపొందించడానికి
ఇండియన్ క్యులినరీ ఇన్‌స్టిట్యూట్ అధ్యాపకులు శ్రీ చలేశ్వరరావు మరియు తాజ్ హోటల్స్ (జిఎం) శ్రీ చౌదరి, సూచనలను ఆహ్వానించినట్లు తెలిపారు.
ముందుగా తిరుమల ఎస్టేట్స్ స్పెషల్ ఆఫీసర్ శ్రీ మల్లిఖార్జున పవర్ పాయింట్ ప్రజంటేషన్ ద్వారా తిరుమలలోని హోటళ్ల గురించి వివరించారు.
టిటిడి ఐటి విభాగంపై సమీక్ష:
టీటీడీ ఐటి విభాగము భక్తులకు అందిస్తున్న వివిధ సేవల గురించి జియో బృందంతో ఆయన సమీక్షించారు. అనంతరం ఆలయ సిబ్బంది, పోటు కార్మికులతో సేంద్రియ ప్రసాదాలపై సమావేశం నిర్వహించారు.
ఈ సమావేశంలో డిప్యూటీ ఈవోలు శ్రీ లోకనాథం, శ్రీ రాజేంద్ర, క్యాటరింగ్ ప్రత్యేక అధికారి శ్రీ శాస్త్రి, ట్రాన్స్‌పోర్ట్ (జిఎం) శ్రీ శేషారెడ్డి, ఐటీ మేనేజర్ శ్రీ నాదముని, జియో సంస్థ ప్రతినిధులు శ్రీ మోషిన్ అబ్బాస్, శ్రీ విజయ్ కుమార్, శ్రీ మంజీత్, పోటు కార్మికులు తదితరులు పాల్గొన్నారు.
టీటీడీ ముఖ్య ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.