SUNDARARAJA SWAMY UTSAVAM COMMENCES _ హనుమంత వాహనంపై శ్రీ సుందరరాజస్వామివారి కటాక్షం

TIRUPATI, 27 JUNE 2024: The second day of Sundararaja Swamy Avatara Utsavams at Tiruchanoor on Friday witnessed the utsava deity of Sri Sundararaja Swamy blessing His devotees on Hanumanta Vahanam.

DyEO Sri Govindarajan, AEO Sri Ramesh and others, devotees were present.

ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI

హనుమంత వాహనంపై శ్రీ సుందరరాజస్వామివారి కటాక్షం

తిరుపతి, 2024, జూన్ 28: తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయానికి అనుబంధంగా ఉన్న శ్రీ సుందరరాజ స్వామివారి అవతార మహోత్సవాల్లో భాగంగా రెండో రోజు శుక్రవారం రాత్రి హనుమంత వాహనంపై స్వామివారు భక్తులను కటాక్షించారు.

ఈ సందర్భంగా మధ్యాహ్నం శ్రీ కృష్ణ‌స్వామివారి ముఖ మండపంలో శ్రీ సుందరరాజ స్వామివారికి వైభవంగా అభిషేకం చేశారు. ఇందులో పాలు, పెరుగు, తేనె, కొబ్బ‌రినీళ్ళు, పసుపు, చందనాల‌తో వేడుకగా అభిషేకం నిర్వ‌హించారు.

సాయంత్రం శ్రీకృష్ణస్వామివారి ముఖమండపంలో ఊంజల్‌ సేవ నిర్వహించారు. రాత్రి స్వామివారి హనుమంత వాహన సేవ వైభవంగా జరిగింది.

కాగా శనివారం రాత్రి స్వామివారు గరుడ వాహనాన్ని అధిరోహించి భక్తులకు దర్శనమిస్తారు.

ఈ కార్యక్రమంలో ఆల‌య డిప్యూటీ ఈవో శ్రీ గోవింద రాజన్, సూపరిటెండెంట్ శ్రీ మధు, టెంపుల్ ఇన్స్పెక్టర్లు శ్రీ సుభాష్, శ్రీ గణేష్, అర్చ‌కులు శ్రీ బాబుస్వామి, ఇతర అధికారులు పాల్గొన్నారు.

టీటీడీ ముఖ్య ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయడమైనది.