EO AND ADD.EO INAUGURATES EXHIBITION STALLS _ కల్యాణవేదిక వద్ద ప్రదర్శనశాలల‌ను ప్రారంభించిన టీటీడీ ఈవో, అద‌న‌పు ఈవో

TIRUMALA, 04 OCTOBER 2024: TTD EO Sri J Syamala Rao along with the Additional EO Sri Ch Venkaiah Chowdary inaugurated the exhibition stalls in Tirumala on Friday.

As a part of it they visited the Duryodhana Parabhavam episode placed in the entrance of the expo followed by the Seshachala ranges diorama arranged by the Forest wing, different sculptures including wood, cement, stone and metal by the students of TTD-run Sri Venkateswara Institute of Traditional Sculpture and Architecture(SVITSA) college, the photo exhibition by the TTD Public Relations Wing with the concept of Nadu-Nedu, a rare collection of photos, with a comparison at the past and in the present about Tirumala, temple and other important places.

The EO, Additional EO appreciated the range of stalls placed by different departments.

JEO Smt Goutami, CVSO Sri Sridhar, HoDs of Garden, Sri Srinivasulu, Forest Sri Srinivasulu, SVITSA Principal Sri Venkatramana Reddy, CPRO Dr T Ravi and others were also present.

ISSUED BY THE TTD CHIEF PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

కల్యాణవేదిక వద్ద ప్రదర్శనశాలల‌ను ప్రారంభించిన టీటీడీ ఈవో, అద‌న‌పు ఈవో

•⁠ ⁠భ‌క్తుల‌ను ఆక‌ట్టుకుంటున్న ఫ‌ల‌పుష్ప‌, అట‌వీ, శిల్ప‌, ఆయుర్వేద‌, ఫొటో ప్ర‌ద‌ర్శ‌న‌శాల‌లు

తిరుమల, 2024 అక్టోబ‌రు 04: శ్రీవారి సాల‌క‌ట్ల బ్రహ్మోత్సవాలను పుర‌స్క‌రించుకుని తిరుమలలోని కల్యాణవేదిక వద్ద ఏర్పాటుచేసిన ఫ‌ల‌పుష్ప‌, అట‌వీ, శిల్ప‌, ఫొటో ప్ర‌ద‌ర్శ‌న‌శాల‌లను టీటీడీ ఈవో శ్రీ జె.శ్యామ‌ల‌రావు, అద‌న‌పు ఈవో శ్రీ సిహెచ్ వెంక‌య్య చౌద‌రి క‌లిసి ప్రారంభించారు.

ఇందులో భాగంగా ప్రవేశ ద్వారంలో ఉంచిన దుర్యోధన పరాభవం, అటవీశాఖ ఏర్పాటు చేసిన శేషాచల శ్రేణుల సెట్టింగ్‌, టీటీడీ ఆధ్వర్యంలోని శ్రీవేంకటేశ్వర సాంప్రదాయ శిల్పకళాశాల ఆధ్వర్యంలో విద్యార్థులు తయారుచేసిన చెక్క, సిమెంట్, లోహ శిల్పాలను సందర్శించారు.

నాడు-నేడు కాన్సెప్ట్‌తో టీటీడీ ప్రజాసంబంధాల విభాగంచే ఏర్పాటైన ఫోటో ఎగ్జిబిషన్లోని, తిరుమల, దేవాలయం మరియు ఇతర ముఖ్యమైన అంశాలకు సంబంధించిన
అరుదైన నాటి ఫోటోల సేకరణ, ప్రస్తుతం తిరుమల అభివృద్ధి చెందిన తీరును తెలిపే చిత్రాలు ఉన్నాయి.

వివిధ శాఖల వారీగా ఏర్పాటు చేసిన స్టాళ్లను ఈవో, అదనపు ఈవో అభినందించారు.

జేఈవో శ్రీమతి గౌతమి, సివిఎస్‌వో శ్రీ శ్రీధర్‌, ఉద్యానవన డెప్యూటీ డైరెక్టర్ శ్రీ శ్రీనివాసులు, ఫారెస్ట్‌ డిప్యూటీ కన్జర్వేటర్ శ్రీ
శ్రీనివాసులు, ఎస్వీ ప్రిన్సిపాల్‌ శ్రీ వెంకట్రమణా రెడ్డి, సీపీఆర్‌వో డాక్టర్ టి.రవి తదితరులు పాల్గొన్నారు.

టీటీడీ ముఖ్య‌ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది