WITNESS ALMIGHTY AMONG DEVOTEES AND RENDER SERVICE-TTD EO _ భక్తులకు భ‌క్తి శ్ర‌ద్ధ‌ల‌తో సేవలు అందించండి – ⁠ ⁠టీటీడీ ఈవో శ్రీ జె.శ్వామ‌ల‌రావు

TIRUMALA, 04 OCTOBER 2024: The Srivari Seva volunteers should feel the presence of Sri Venkateswara in every devotee and offer their best possible services to them with utmost devotion, dedication and discipline, asserted TTD EO Sri J Syamala Rao.

While addressing the huge gathering of Srivari Sevaks at the Asthana Mandapam in Tirumala on Friday, the EO said, TTD has invited nearly 4000 Srivari Sevaks to offer services to the pilgrims at various designated places during the annual brahmotsavams. Lauding their services to the pilgrims especially while distributing Annaprasadam, water, Laddu Prasadams, managing queue lines in Tirumala temple, Kalyanakatta, outside places and many more activities he said, the Srivari Sevaks have become a supporting arm to TTD in offering best amenities to the multitude of visiting pilgrims.

Without the blessings of Sri Venkateswara Swamy, it is not possible for all the 4000 Brahmotsavam slot Srivari Sevaks to come here for offering services to pilgrims. Make use of this divine opportunity provided by Srivaru and offer services to the devotees with commitment.

Earlier, in his address, the Additional EO Sri Ch Venkaiah Chowdary said, the Srivari Seva volunteers are hailing from different states across the country to render services to the pilgrims. As a token of appreciation for their valuable and selfless services, TTD has recently restored Srivari Darshan facility through Supatham entry and also provided an exclusive vehicle for commuting the sevaks to their duty points. 

WHISTLE WHIZARD PERFORMANCE MESMERIZES

At the beginning of the meeting, a special programme by renowned Whistle Artist, Dr K Siva Prasad from Bapatla, was organised. The whistle masestro who showcased his rare talent for over an hour singing Annamacharya Sankeertans and Bhajans through whistle mesmerized the audience. 

Both the TTD EO and Additional EO appreciated the versatile artist who has to his credit having performed in over 30 countries giving 16000 odd performances in the last 45years.

Chief PRO Dr T Ravi, PRO(FAC) Ms P Neelima, Srivari Seva staff, senior sevaks, srivari sevaks hailing from AP, TS, TN, Karnataka and Maharastra were also present. 

ISSUED BY THE TTD CHIEF PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

భక్తులకు భ‌క్తి శ్ర‌ద్ధ‌ల‌తో సేవలు అందించండి – ⁠ ⁠టీటీడీ ఈవో శ్రీ జె.శ్వామ‌ల‌రావు

తిరుమల, 2024 అక్టోబ‌రు 04: శ్రీవారి సేవకులు ప్రతి భక్తునిలో శ్రీవేంకటేశ్వర‌స్వామివారిని ద‌ర్శిస్తూ, అత్యంత భక్తి, అంకితభావంతో, క్రమశిక్షణతో ఉత్తమమైన సేవలను అందించాలని టీటీడీ ఈవో శ్రీ జె శ్యామలరావు కోరారు.

తిరుమల ఆస్థాన మండపంలో శుక్రవారం శ్రీవారి సేవకులను ఉద్దేశించి ఈవో మాట్లాడుతూ, వార్షిక బ్రహ్మోత్సవాల సందర్భంగా భక్తులకు సేవలందించేందుకు దాదాపు 4 వేల‌ మంది శ్రీవారి సేవకులను టీటీడీ ఆహ్వానించిందన్నారు. భక్తులకు శ్రీ‌వారి సేవ‌కులు అందిస్తున్న సేవ‌లు, ప్రత్యేకంగా అన్నప్రసాదం, తాగునీరు, లడ్డూ ప్రసాదాల పంపిణీ, శ్రీ‌వారి ఆలయం, కల్యాణకట్ట, బయటి ప్రదేశాల్లో క్యూ లైన్ల నిర్వహణ, అనేక కార్యక్రమాలలో శ్రీవారి సేవకుల సేవలను కొనియాడారు.

శ్రీవేంకటేశ్వరస్వామి అనుగ్ర‌హం లేకుండా, 4 వేల‌ మంది శ్రీవారి సేవకులు బ్రహ్మోత్సవంలో భ‌క్తుల‌కు సేవలు అందించడం కోసం ఇక్కడకు రావడం సాధ్యం కాద‌న్నారు. శ్రీవారు అందించిన ఈ దివ్య అవకాశాన్ని వినియోగించుకొని భక్తులకు నిబద్ధతతో సేవలు అందించాలని పిలుపునిచ్చారు.

అంతకుముందు అద‌న‌పు ఈవో శ్రీ సిహెచ్ వెంకయ్య చౌదరి ప్రసంగిస్తూ, దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల నుంచి శ్రీవారి సేవా వలంటీర్లు యాత్రికులకు సేవలు అందిస్తున్నారన్నారు. వారి విలువైన మరియు నిస్వార్థ సేవలకు గుర్తింపుగా, టీటీడీ ఇటీవల సుపథం ప్రవేశం ద్వారా శ్రీవారి దర్శన సౌకర్యాన్ని వారికి పునరుద్ధరించింద‌ని చెప్పారు. అదేవిధంగా సేవకులను, సుదూరంగా ఉండే వారి డ్యూటీ పాయింట్‌లకు తరలించడానికి ప్రత్యేక వాహనాన్ని కూడా ఏర్పాటు చేసిన‌ట్లు తెలిపారు.

“ఈలపాట మాంత్రికుడు” అద్భుత ప్రదర్శన…

సభ ప్రారంభంలో ప్రముఖ విజిల్‌ ఆర్టిస్ట్‌, బాపట్లకు చెందిన డాక్టర్‌ కె. శివప్రసాద్‌ ప్రత్యేక సంగీత కార్యక్రమం నిర్వహించారు. గంటకు పైగా అన్నమాచార్య సంకీర్తనలు, భజనలను విజిల్ ద్వారా ఆలపిస్తూ తన అరుదైన ప్రతిభను ప్రదర్శించ ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేశారు.

గత 45 ఏళ్లలో 30కి పైగా దేశాల్లో 16 వేల‌కు పైగా ప్రదర్శనలు అందించిన బహుముఖ కళాకారుడిని టిటిడి ఇఓ మరియు అడిషనల్ ఇఓ ఇద్దరూ అభినందించారు.

చీఫ్ పిఆర్‌ఓ డాక్టర్ టి రవి, పిఆర్‌ఓ (ఎఫ్‌ఎసి) కుమారి పి నీలిమ, శ్రీవారి సేవా సిబ్బంది, సీనియర్ సేవకులు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక మరియు మహారాష్ట్రలకు చెందిన శ్రీవారి సేవకులు కూడా పాల్గొన్నారు.

టీటీడీ ముఖ్య‌ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది