EO INSPECTS PARAKAMANI BUILDING _ పరకామణి భవనాన్ని తనిఖీ చేసిన టీటీడీ ఈవో

TIRUMALA, 30 AUGUST 2024: TTD EO Sri J Syamala Rao along with the TTD Additional EO Sri Ch Venkaiah Chowdary and CVSO Sri Sridhar, inspected the Parakamani Building at Tirumala on Friday.

As a part of this, he inspected and thoroughly observed the lifting of the hundis, the process of segregation of coins and currencies, the manpower involved in the counting and accounting of Parakamani, dress code and checking process. The EO also verified the CCTV room.

Earlier, he discussed with the officers concerned about the process of transfer of the hundis from Tirumala temple to the Parakamani building amidst tight security. Later the EO was also briefed on the Tirupati Parakamani, utilizing the services of Parakamani Sevaks, Bank Employees besides employees, role of appraisers when donations of gold and other precious items are being received in the hundis and other related information.

SE2 Sri Satyanarayana, DyEO I/C Parakamani Smt Vijayalakshmi and other officials belonging to Parakamani, Engineering, Vigilance departments were also present.

ISSUED BY THE TTD CHIEF PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

పరకామణి భవనాన్ని తనిఖీ చేసిన టీటీడీ ఈవో

తిరుమల, 2024 ఆగస్టు 30: తిరుమలలోని పరకామణి భవనాన్ని టీటీడీ ఈవో శ్రీ జె శ్యామలరావు, అదనపు ఈవో శ్రీ సిహెచ్ వెంకయ్య చౌదరి, సీవీఎస్వో శ్రీ శ్రీధర్‌తో కలిసి శుక్రవారం పరిశీలించారు.

ఇందులో భాగంగా హుండీల తరలింపు, నాణేలు, కరెన్సీల విభజన ప్రక్రియ, పరకామణి లెక్కింపు, లెక్కింపు ప్రక్రియ, డ్రెస్‌ కోడ్‌లను ఆయన క్షుణ్ణంగా పరిశీలించారు. తరువాత ఈవో సీసీటీవీ గదిని కూడా పరిశీలించారు.

అంతకుముందు కట్టుదిట్టమైన భద్రత నడుమ తిరుమల ఆలయం నుంచి పరకామణి భవనానికి హుండీల తరలింపు ప్రక్రియపై సంబంధిత అధికారులతో చర్చించారు. అనంతరం తిరుపతి పరకామణి, పరకామణి సేవకులు, ఉద్యోగులతో పాటు బ్యాంకు అధికారులతో చర్చించారు. హుండీల్లో బంగారం, ఇతర విలువైన వస్తువులు, విరాళాల వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం అధికారులు, ఇతర సంబంధిత సమాచారాన్ని ఈవోకు వివరించారు.

ఈవో వెంట ఏస్ ఈ-2 శ్రీ సత్యనారాయణ, డిప్యూటీ ఈవో ఇంచార్జ్ పరకామణి శ్రీమతి విజయలక్ష్మి, పరకామణి, ఇంజనీరింగ్, విజిలెన్స్ విభాగాలకు చెందిన అధికారులు పాల్గొన్నారు.

టీటీడీ ప్రజా సంబంధాల అధికారిచే విడుదల చేయడమైనది