GREEN TIRUMALA IS OUR PRIME FOCUS-TTD EO _ పచ్చదనం అభివృద్ధి ద్వారా తిరుమలను అత్యంత సుందరంగా తీర్చిదిద్దాలి- టీటీడీ ఈవో శ్రీ జె.శ్యామల రావు
TIRUMALA, 30 AUGUST 2024: Enhancing greenery in Tirumala by taking up a wide range of plantation activity is one of our prime mottos, said TTD EO Sri J Syamala Rao.
The EO along with the TTD Additional EO Sri Ch Venkaiah Chowdary participated in the Vana Mahotsavam fete observed by the TTD Forest wing and planted the “Sthala Vriksha” of Tirumala, Manu Sampangi at Sri Padmavathi Rest House area. Speaking to media on the occasion the EO said, on the occasion a total of 12 thousand plants will be planted out of which 2000 in TTD Forest cover while the remaining in the reserve forest area. The plantation programme will be made perpetual with the advance technology of “Seed Bowl Concept” in Tirumala. Since we also have a huge Ayurvedic College and hospital, medicinal plants required for these institutions will also be developed near the cottages in Tirumala by taking up a special drive programme”, he asserted.
Meanwhile, TTD Forest Wing has planted hundreds of Manu Sampangi(Magnolia champaca), Sandalwood (Santalum album) and Sita Ashoka(Saraca asoca) at different places in Tirumala which comes under the purview of TTD Forest.
TTD Deputy Conservator of Forest Sri Srinivasulu, DyEOs Sri Bhaskar, Smt Asha Jyothi, Health Officer Sri Madhusudhan Prasad, other forest wing officials were also present.
పచ్చదనం అభివృద్ధి ద్వారా తిరుమలను అత్యంత సుందరంగా తీర్చిదిద్దాలి- టీటీడీ ఈవో శ్రీ జె.శ్యామల రావు
తిరుమల, 2024 ఆగస్టు 30: భూలోక వైకుంఠమైన తిరుమలలో భక్తులకు మరింత ఆహ్లాదకర ఆధ్యాత్మిక వాతావరణాన్ని కల్పించేందుకు పచ్చదనాన్ని పెంపొందించి దేశంలోనే అత్యంత సుందరంగా తీర్చిదిద్దాలని టీటీడీ ఈవో శ్రీ జె.శ్యామల రావు పిలుపునిచ్చారు.
టీటీడీ అటవీ విభాగం ఆధ్వర్యంలో శుక్రవారం నాడు జరిగిన వన మహోత్సవంలో ఈవో, అదనపు ఈవో శ్రీ సిహెచ్ వెంకయ్య చౌదరితో కలిసి తిరుమల శ్రీ పద్మావతి విశ్రాంతి భవనం ప్రదేశంలో తిరుమల ”స్థలవృక్ష”మైన మాను సంపంగి మొక్కలను నాటారు.
ఈ సందర్భంగా ఈవో మీడియాతో మాట్లాడుతూ, టీటీడీ ఫారెస్ట్ పరిధిలో రెండు వేలు, రిజర్వ్ ఫారెస్ట్ ఏరియాలో 10వేలు మొత్తం 12 వేల మొక్కలు నాటనున్నట్లు తెలిపారు. “సీడ్ బౌల్ కాన్సెప్ట్” అమలు చేస్తూ ఆధునిక సాంకేతికత సహాయంతో ప్లాంటేషన్ కార్యక్రమం శాశ్వతంగా నిర్వహించనున్నట్లు చెప్పారు. టీటీడీ ఆయుర్వేద కళాశాల మరియు ఆసుపత్రి ఉన్నందున, ఈ సంస్థలకు అవసరమైన ఔషధ మొక్కలను ప్రత్యేకంగా తిరుమలలోని కాటేజీల సమీపంలో అభివృద్ధి చేస్తాం, ”అని ఆయన తెలిపారు.
ఇదిలా ఉండగా, టీటీడీ ఫారెస్ట్ విభాగం తిరుమలలోని వివిధ ప్రదేశాలలో వందలాది మను సంపంగి (మాగ్నోలియా చంపాకా), శాండల్ వుడ్ (సంతాలమ్ ఆల్బమ్) మరియు సీతా అశోక (సరకా అసోకా) మొక్కలను నాటింది.
ఈ కార్యక్రమంలో టీటీడీ డిప్యూటీ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ శ్రీ శ్రీనివాసులు, డిప్యూటీ ఈవోలు శ్రీ భాస్కర్, శ్రీమతి ఆశాజ్యోతి, హెల్త్ ఆఫీసర్ శ్రీ మధుసూధన్ ప్రసాద్, ఇతర అటవీశాఖ అధికారులు పాల్గొన్నారు.
టీటీడీ ముఖ్య ప్రజా సంబంధాల అధికారిచే విడుదల చేయడమైనది