EO INSPECTS SRI GT_ త్వరలో శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయ నగలు రికవరీకి చర్యలు చేపట్టాం- టిటిడి ఈవో శ్రీ అనిల్‌కుమార్‌ సింఘాల్‌

Tirupati, 3 February 2019: Following the theft of three crowns in the temple of Sri Govinda Raja Swamy (Sri GT) in Tirupati, TTD EO Sri Anil Kumar Singhal inspected the temple on Sunday evening.

Later speaking to media persons, the EO said, three crowns belonging to Sri Kalyana Venkateswara Swamy, the sub-shrine located in Sri GT. All three weighing approximately 1351grams costing around Rs.50lakhs”, he said.

The EO said, as soon as the duty archakas identified the missing of these crowns our senior officers including JEO Sri P Bhaskar and CVSO Sri Gopinath Jetti rushed to the temple and enquired the staffs. On total there were 15 cameras in the temple and all are functioning properly. The vigilance staff of TTD has also given CC TV footage to police for further investigation. In next two or three days we may get the final report of investigation”, EO added.

FACAO Sri Balaji, Chief Engineer Sri Chandrasekhar Reddy, Addl CVSO Sri Sivakumar Reddy, Temple DyEO Smt Varalakshmi, AEO Sri Uday Bhaskar Reddy, Suptd Engineer Sri Ramulu and others were present.

ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER TTDs TIRUPATI

త్వరలో శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయ నగలు రికవరీకి చర్యలు చేపట్టాం- టిటిడి ఈవో శ్రీ అనిల్‌కుమార్‌ సింఘాల్‌

తిరుపతి, 03 ఫిబ్రవరి 2019: తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో కనిపించకుండా పోయిన 3 బంగారు కిరీటాలను త్వరలో రికవరీ చేసేందుకు చర్యలు చేపట్టామని టిటిడి ఈవో శ్రీ అనిల్‌కుమార్‌ సింఘాల్‌ తెలిపారు. ఆదివారం సాయంత్రం టిటిడి జెఈవో శ్రీ పోల భాస్కర్ , సివిఎస్వో శ్రీ గోపినాథ్ జెట్టీ , పోలీస్‌ అధికారులతో కలిసి ఆలయాన్ని ఈవో పరిశీలించారు.

ఈ సందర్భంగా ఈవో మీడియాతో మాట్లాడుతూ శ్రీ గోవిదంరాజస్వామివారి ఆలయానికి అనుబంధంగా ఉన్న శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి ఆలయంలోని శ్రీదేవి భూదేవి సమేత శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి ఉత్సవర్లకు అలంకరించే 3 కిరీటాలు శనివారం సాయంత్రం నుండి కనబడుటలేదని అర్చకులు తెలియజేశారన్నారు. ఈ విషయమై టిటిడి విజిలెన్స్‌, పోలీస్‌ అదికారులు గత రెండు రోజుల సిసి టివి రికార్డును క్షుణ్ణంగా పరిశీస్తున్నారని తెలిపారు. ఆలయంలోని సిసిటీవీలు అన్ని సక్రమంగా పనిచేస్తున్నాయని, త్వరలో స్వామివారి నగలను రికవరీ చేసేందుకు టిటిడి విజిలెన్స్, తిరుపతి పోలీసులు దర్యాప్తు చేపట్టారని తెలిపారు.

ఈ కార్యక్రమంలో టిటిడి అదనపు సివిఎస్వో శ్రీ శివకుమార్‌ రెడ్డి,సిఈ శ్రీ చంద్రశేఖర్ రెడ్డి , ఎఫ్ ఏసిఏవో శ్రీ ఓ. బాలాజీ , స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ ఈవో శ్రీమతి వరలక్ష్మి, టిటిడి అధికారులు, తిరుపతి పోలీస్ అధికారులు పాల్గొన్నారు.

తి.తి.దే ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.