CJI OFFERS PRAYERS_ తిరుమల శ్రీవారిని దర్శించుకున్న సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జ‌స్టిస్ రంజ‌న్ గొగోయ్‌

Tirumala, 3 February 2019: The Honourable Chief Justice of India Sri Ranjan Gogoi along with Chief Justice of Supreme Court Sri NV Ramana offered prayers in the temple of Lord Venkateswara on Sunday evening.

Both the dignitaries of the apex court of the country accompanied by their spouses reached Mahadwaram where they were accorded warm reception by TTD authorities.

Later the CJI offered prayers inside the temple and had darshanam of main deity in Mahalaghu darshanam like any other common pilgrim.

After darshanam both Sri Gogoi and Sri NV Ramana were offered Vedasirvachanam by vedic pundits. This was followed by presentation of Theertha prasadams, lamination photos of Lord by TTD EO Sri Anil Kumar Singhal and JEO Sri KS Sreenivasa Raju.

District Collector Sri Pradyumna, CVSO Sri Gopinath Jetti, Tirupathi Urban SP Sri Anburasan and other district top brass officials were also present.

ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER TTDs TIRUPATI

తిరుమల శ్రీవారిని దర్శించుకున్న సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జ‌స్టిస్ రంజ‌న్ గొగోయ్‌

తిరుమ‌ల‌, 2019 ఫిబ్రవరి 03: సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జ‌స్టిస్ రంజ‌న్ గొగోయ్ ఆదివారం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు.

ముందుగా ఆలయం వద్దకు చేరుకున్న జ‌స్టిస్ రంజ‌న్ గొగోయ్‌, న్యాయమూర్తి శ్రీ ఎన్.వి.రమణలకు  టిటిడి కార్యనిర్వహణాధికారి శ్రీ అనిల్‌కుమార్ సింఘాల్‌, తిరుమల జెఈవో శ్రీ కె.ఎస్‌.శ్రీనివాసరాజు సంప్రదాయబద్ధంగా స్వాగతం పలికారు. శ్రీవారి దర్శన ఏర్పాట్లు చేశారు. అనంతరం రంగనాయకుల మండపంలో గౌ|| ప్రధాన న్యాయమూర్తికి వేద పండితులు వేదాశీర్వచనం చేశారు. శ్రీవారి చిత్రపటం, తీర్థప్రసాదాలను అందజేశారు.

ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ శ్రీప్రద్యుమ్నా, టిటిడి సివిఎస్వో శ్రీ గోపినాథ్‌జెట్టి, తిరుపతి అర్భన్ ఎస్పీ శ్రీ అన్బురాజన్, సబ్ కలెక్టర్ డా.మహేష్ కుమార్, శ్రీవారి ఆలయ డెప్యూటీ ఈవో శ్రీ హ‌రీంద్ర‌నాథ్‌, ఇతర అధికారులు పాల్గొన్నారు.

తి.తి.దే ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.