EO INVITED FOR KRT PAVITROTSVAMS _ శ్రీ కోదండరామస్వామి పవిత్రోత్సవాల బుక్ లెట్ ఆవిష్కరణ

TIRUPATI, 10 JULY 2023: TTD EO Sri AV Dharma Reddy has been invited to participate in the annual Pavitrotsvams in Sri Kodanda Rama Swamy temple in Tirupati from July 13-15 with Ankurarpanam in July 12.

 

The temple DyEO Smt Nagaratna along with the team of religious staff invited the EO in latter’s chambers in TTD Administrative Building in Tirupati on Monday.

 

Archaka Sri Anandakumar Deekshitulu, temple inspector Sri Chalapati and others were also present.

 

 

ISSUED BY TTD PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

శ్రీ కోదండరామస్వామి పవిత్రోత్సవాల బుక్ లెట్ ఆవిష్కరణ

తిరుపతి, 10 జులై 2023: తిరుపతి శ్రీ కోదండరామస్వామి ఆలయ పవిత్రోత్సవాల బుక్ లెట్ ను ఈవో శ్రీ ఏవి. ధర్మారెడ్డి సోమవారం టీటీడీ పరిపాలన భవనంలోని తన కార్యాలయంలో ఆవిష్కరించారు.

పవిత్రోత్సవాలకు జూలై 12 వ తేదీ సాయంత్రం అంకురార్పణ జరుగుతుంది. జూలై 13వ తేదీ ఉదయం యాగశాలలో పవిత్ర ప్రతిష్ఠ, శయనాధివాసం నిర్వహిస్తారు. జూలై 14వ తేదీ పవిత్ర సమర్పణ, యాగశాలలో వైదిక కార్యక్రమాలు నిర్వహించనున్నారు. జూలై 15వ తేదీ యాగశాలలో వైదిక కార్యక్రమాలు, పూర్ణాహుతితో పవిత్రోత్సవాలు ముగుస్తాయి. ఈ సందర్భంగా ప్రతిరోజూ ఉదయం స్నపనతిరుమంజనం, సాయంత్రం తిరువీధి ఉత్సవం నిర్వహిస్తారు.

ఈ కార్యక్రమంలో ఆలయ డెప్యూటీ ఈవో శ్రీమతి నాగరత్న,టెంపుల్‌ ఇన్‌స్పెక్టర్‌ శ్రీ చలపతి, ఆలయ అర్చకులు , ఇతర అధికారులు పాల్గొన్నారు.

టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.