REVIEW MEETING ON ACCIDENT PREVENTION MEASURES ON GHATS HELD _ ఘాట్ రోడ్లలో ప్రమాదాల నివారణకు కట్టుదిట్టమైన ఏర్పాట్లు

TIRUPATI, 10 JULY 2023: Come out with a concrete plan to make Tirumala cent per cent free from accidents, directed TTD EO Sri AV Dharma Reddy.

A review meeting on the prevention and precautionary steps to be taken on Ghat Road Accidents was held in the chambers’ of TTD EO in TTD Administrative Building in Tirupati on Monday along with Tirupati JEO Sri Veerabrahmam and CVSO Sri Narasimha Kishore and other officials from TTD and related departments from the district.

The EO said a strong mechanism needs to be placed to beef up the security in Ghat Roads. “For this both the TTD CVSO and District SP should come up with best proposals’, he maintained.

Among other important measures included, ensuring 100% surveillance in Vaikuntham to Temple point and at all the four entry points which includes two Ghat Roads and two Footpath routes.

Whenever an accident takes place on Ghats, that case should be referred to SVIMS or BIRRD or SPCHC immediately and the vigilance should alert the concerned hospital so that an action team will be kept ready in these hospitals to attend to the injured without any delay.

During the commencement of vehicle operation in both the ghats, a supervisor on behalf of APSRTC should be available at that time to ensure smooth transportation. 

The drivers also need to be guided to maintain proper distance between two buses to ensure road safety. 

The possibilities of providing alternate facilities for vehicles or drivers in Tirupati and as well places need to be identified for implementing pre-paid taxi systems in Tirumala to be evolved. 

To ban plying of accident-prone vehicles on Ghats and set up TTD Security Posts for surveillance on the ghats.

To set up permanent structures like Roller-Coaster barriers at vulnerable points like Avvachari Kona etc. 

Audio-systems to be set up in all APSRTC buses on do’s and dont’s during plying on ghats

To increase the frequencies of free buses in Tirumala avoiding overcrowding.

CE Sri Nageswara Rao, GM Transport Sri Sesha Reddy, DFO Sri Srinivasulu, Estates Special Officer Sri Mallikharjuna, SPCHC Director Dr Srinath Reddy, BIRRD In-charge CSRMO Dr Kishore, Dr Ram from SVIMS, DMHO Dr Srihari, DTC Tirupati Sri Seetharami Reddy, District Public Transport Officer Sri Jitendernath Reddy, ASP Tirumala Sri Muniramaiah, Tirumala Traffic DSP Sri Kondaiah, VGO Tirupati Sri Manohar and others were also present.

ISSUED BY TTD PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

ఘాట్ రోడ్లలో ప్రమాదాల నివారణకు కట్టుదిట్టమైన ఏర్పాట్లు

– 100% నిఘా పెంచాలి : టీటీడీ ఈఓ శ్రీ ఏవి. ధర్మారెడ్డి

తిరుమ‌ల‌, 10 జూలై 2023: తిరుమల శ్రీవారి దర్శనం కోసం వచ్చే భక్తుల భద్రత దృష్ట్యా ఘాట్ రోడ్లలో ప్రమాదాల నివారణకు కార్యచరణ ప్రణాళికలు సిద్ధం చేసి, కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేయాలని టీటీడీ ఈఓ శ్రీ ఏవి. ధర్మారెడ్డి కలిసి అధికారులను ఆదేశించారు. తిరుపతి టీటీడీ పరిపాలన భవనంలోని ఈవో కార్యాలయంలో జేఈవో శ్రీ వీరబ్రహ్మంతో కలిసి విజిలెన్స్, పోలీస్, వైద్య ఆర్టీసీ, ఫారెస్ట్, స్విమ్స్, బర్డ్, శ్రీ పద్మావతి చిన్నపిల్లల ఆసుపత్రి అధికారులతో ఈవో సమీక్ష సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా ఈవో మాట్లాడుతూ, రెండు ఘాట్ రోడ్లలో ప్రమాదాల నివారణకు జిల్లా ఎస్పీతో ఉన్నత స్థాయి సమావేశాన్ని ఏర్పాటు చేసి కార్యాచరణ ప్రణాళికలు రూపొందించాలని సివిఎస్ఓ శ్రీ నరసింహ కిషోర్ ను ఆదేశించారు. ఘాట్ రోడ్లలో ప్రమాదాలు జరిగినప్పుడు విజిలెన్స్ సిబ్బంది స్విమ్స్, బర్డ్, శ్రీ పద్మావతి చిన్నపిల్లల ఆసుపత్రి అధికారులను అప్రమత్తం చేయాలన్నారు. తద్వారా ఈ ఆసుపత్రులలో ఎటువంటి ఆలస్యం లేకుండా క్షతగాత్రులకు చికిత్స చేయడానికి ఒక యాక్షన్ టీమ్ సిద్ధంగా ఉంటుందన్నారు. స్విమ్స్ వద్ద పోలీస్ అవుట్ పోస్ట్ ఏర్పాటు చేయాలన్నారు. ఘాట్ రోడ్లలో ప్రమాదకరమైన అవ్యచారికోన, కపిలతీర్థం పైభాగంలో మాల్వాడి గుండం వద్ద రోలర్ పోస్టర్ బ్యారియర్ ఏర్పాటు చేయాలని సూచించారు.

ఘాట్ రోడ్లలో ఎక్కువ ప్రమాదాలు జరిగే ప్రాంతాలను గుర్తించి 100% నిఘా పెంచి, కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేయాలన్నారు. భక్తుల సౌకర్యార్థం అలిపిరి సమీపంలో పార్కింగ్ ప్రదేశాన్ని గుర్తించి వాహనాల పార్కింగ్, డ్రైవర్లను అందుబాటులో ఉంచేందుకు, తిరుమలలో ప్రీ పెయిడ్ టాక్సీ సేవలను అందించేందుకు సాధ్యాసాధ్యాలను పరిశీలించాలని అధికారులను ఆదేశించారు. ఘాట్ రోడ్లలో ప్రమాదాలకు గురయ్యే వాహనాలను గుర్తించి రాకపోకలను నిషేధించడంతోపాటు, ఘాట్ రోడ్లలో నిఘా కోసం టీటీడీ సెక్యూరిటీ పోస్టులను ఏర్పాటు చేయాలని ఆదేశించారు.

అదేవిధంగా తిరుమలలోని వివిధ ప్రాంతాలకు భక్తులను చేరవేసే ధర్మ రథాలను రద్దీ అధికంగా ఉండే ప్రాంతాలలో ఎక్కువ సంఖ్యలో తిప్పాలని ఆదేశించారు. ఆర్టీసీ బస్సులలో తిరుమలలో భక్తులు చేయవలసినవి, చేయకూడనివి రికార్డు చేసి ఆడియో సిస్టం ఏర్పాటు చేయాలన్నారు. ఉదయం అలిపిరి, జిఎన్ సి టోల్ గేట్లు తెరిచే సమయంలో ఆర్టీసీ అధికారి పర్యవేక్షణలో బస్సులు అధిక వేగం పోకుండా చర్యలు తీసుకోవాలన్నారు. రెండు ఘాట్ రోడ్లలో భద్రత దృష్ట్యా రెండు బస్సుల మధ్య నిర్దిష్ట దూరం ఉండేలా డ్రైవర్లకు మార్గనిర్దేశం చేయాలన్నారు. తిరుమల వైకుంఠం క్యూ కాంప్లెక్స్ నుండి శ్రీవారి ఆలయం, రెండు ఘాట్ రోడ్లు, రెండు నడక మార్గాలలో నిఘాను మరింత పెంచాలని ఆదేశించారు.

ఈ సమావేశంలో సిఈ శ్రీ నాగేశ్వరరావు, రవాణా విభాగం జిఎం శ్రీ శేషారెడ్డి, డిఎఫ్ఓ శ్రీ శ్రీనివాసులు, ఎస్టేట్ స్పెషల్ ఆఫీసర్ శ్రీ మల్లిఖార్జున, శ్రీ పద్మావతి చిన్నపిల్లల ఆసుపత్రి డైరెక్టర్ శ్రీ శ్రీనాథ్ రెడ్డి, బర్డ్ ఆర్ఎంఓ డా.కిశోర్, స్విమ్స్ డాక్టర్ రామ్, డిఎంహెచ్ ఓ శ్రీ శ్రీహరి, డిటిసి సీతారామి రెడ్డి, జిల్లా ప్రజా రవాణా అధికారి శ్రీ జితేందర్‌నాథ్ రెడ్డి, తిరుమల ఏఎస్ పి శ్రీ మునిరామయ్య, తిరుమల ట్రాఫిక్ డీఎస్పీ శ్రీ కొండయ్య, విజివో శ్రీ మనోహర్, ఇతర అధికారులు పాల్గొన్నారు.

టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయడమైనది