EO performs Ganga Pooja in Tirumala Dams on the occasion of World Water Day _ తిరుమలలో అంతర్జాతీయ జలదినోత్సవ సందర్భంగా వేడుకగా గంగపూజ

Tirumala, 22 March 2013: In connection with World Water Day on Friday, TTD EO Sri LV Subramanyam along with Tirumala JEO Sri KS Sreenivasa Raju and CVSO Sri GVG Ashok Kumar has performed Ganga Puja to Papavinasanam and Gogarbham dams in Tirumala under the aegis of TTD Water Works department.
 
Speaking on the occasion the TTD EO said that with the blessings of Goddess Ganga all the dams in Tirumala are full to the capacities there by quenching the thirst of multitude of visiting pilgirms every year. “We have enough of to meet the water needs of the pilgrims for the next 373 days. Incidentally today also happens to be the World Water Day and TTD is always conscious about conservation of natural water resources. With the blessings of Goddess Ganga today all the dams house almost 88% of water storage”, he added.
  
Additional CV&SO TTDs Sri Siva Kumar Reddy, EE Water Works Sri Narasimha Murthy, Deputy EO KKC Sri Krishna Reddy, EE I Sri Krishna Reddy, engineering staff and employees of water works department were also present.
 
THE PRESENT WATER STATUS AT TIRUMALA AS ON 22_03_2013
 
Papavinasanam Dam (in meters)       –             4995.00
Gogarbham Dam (in feet)                  –           1591.00
Akasa ganga Dam (in meters)           –              275.00
Kumaradhara Dam (in meters)          –             3962.20
Pasupudhara Dam (in meters)            –            1295.00
 
Net quatity of water available at Tirumala    –  12118.00 Lakh gallons and the water is sufficient  for Tirumala is 373 days.
 
ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER, TTDs TIRUPATI

తిరుమలలో అంతర్జాతీయ జలదినోత్సవ సందర్భంగా వేడుకగా గంగపూజ

తిరుమల, 22 మార్చి – 2013 : తిరుమలలోని పాపవినాశనం, గోగర్భతీర్థం జలాశయాల్లో తి.తి.దే ఇంజనీరింగ్‌ విభాగం నీటిపారుదలశాఖ ఆధ్వర్యంలో శుక్రవారం మార్చి 22వ తేదిన అంతర్జాతీయ జలదినోత్సవాన్ని పురస్కరించుకుని జరిగిన గంగ పూజ వేడుకలలో తి.తి.దే ఇ.ఓ శ్రీ ఎల్‌.వి.సుబ్రహ్మణ్యం దంపతులు, జె.ఇ.ఓ శ్రీ కె.ఎస్‌. శ్రీనివాసరాజు పాల్గొన్నారు.

గంగపూజ అనంతరం తితిదే ఇ.ఓ విలేకరులతో మాట్లాడుతూ గంగమ్మతల్లి కృపాకటాక్షాల వలన తిరుమల జలాశయాలన్నీ నీటి సంపదతో కళకళలాడుతున్నాయన్నారు. గత 20 ఏళ్ళుగా తి.తి.దే గంగామాతకు కృతజ్ఞతా పూర్వకంగా ఈ గంగపూజను నిర్వహిస్తున్నదన్నారు. అంతేకాకుండ మార్చి 22వ తేదీన అంతర్జాతీ జలదినోత్సవం కూడా కావడం విశేషం అన్నారు. 1992వ సంవత్సరములో ఐక్యరాజ్య సమితి ప్రతిపాదనల మేరకు ప్రపంచ వ్యాప్తంగా ఈ దినమున జలదినోత్సవాన్ని ఘనంగా జరుపుకుంటున్నారన్నారు.  ప్రాణకోటిని ప్రాణాలతో నిలిపేది జలశక్తి అన్నారు. కనుక జలదేవతను అనునిత్యం ఆరాధిస్తూ మానవాళి సంక్షేమానికి గంగపూజను తితిదే క్రమం తప్పకుండా నిర్వహిస్తుండడం విశేషం అన్నారు. కాగా ప్రస్తుతం తిరుమలలో 373 రోజులకు సరిపడ జలవనరులు 5 జలాశయాలలోను సంవృద్ధిగా ఉన్నాయన్నారు.

ఎంతో వేడుకగా జరిగిన ఈ కార్యక్రమంలో ముఖ్యనిఘా మరియు భద్రతాధికారి శ్రీ అశోక్‌ కుమార్‌, అదనపు ముఖ్య నిఘా మరియు భద్రతాధికారి శ్రీ శివకుమార్‌రెడ్డి, నీటిపారుదల శాఖ ఇఇ శ్రీ నరసింహమూర్తి, ఇఇ-1 శ్రీ కృష్ణారెడ్డి, డిప్యూటి ఇఓ కళ్యాణకట్ట శ్రీ కృష్ణారెడ్డి, తదితర సిబ్బంది, భజన బృందాలు భక్తులు పాల్గొన్నారు.


తి.తి.దే ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.